Passion Movie
-
ప్యాషన్‌తో నిర్మించిన పేషన్ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్ కమ్ముల
‘‘కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ ‘పేషన్’ సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సుధీష్, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేషన్’. నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – ‘‘ఆనంద్’ సినిమా నుంచే నాకు అరవింద్ జాషువా పరిచయం. తనలో మంచి స్టోరీ టెల్లింగ్ క్రియేటర్ ఉన్నాడని అప్పుడే అనిపించింది. తను రాసిన పేషన్ నవలను చదివా. చాలా బాగుంది. ఇక అరవింద్ రూపొందించిన ఈ ‘పేషన్’ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. కొత్త నిర్మాతలు ప్యాషన్‌తో ఈ మూవీ తీశారు’’ అన్నారు.‘‘శేఖర్ కమ్ములగారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ‘పేషన్’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ‘‘శేఖర్ కమ్ములగారికి నేను ఏకలవ్య శిష్ణుడ్ని. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యే కథతో ‘పేషన్’ తీశాం. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు అరవింద్ జాషువా. -
‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్ కమ్ముల
యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్‌గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్‌లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది. -
‘హ్యాపీడేస్’లాగే ‘పాషన్’ ఉంటుంది: శేఖర్ కమ్ముల
సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం...నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ - ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం. అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్. డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా. అన్నారు.నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే భాగస్వామిని అవుతున్నాను. అన్నారు.