‘హ్యాపీడేస్‌’లాగే ‘పాషన్‌’ ఉంటుంది: శేఖర్‌ కమ్ముల | Sekhar Kammula Talks About Passion Movie | Sakshi
Sakshi News home page

‘హ్యాపీడేస్‌’లాగే ‘పాషన్‌’ ఉంటుంది: శేఖర్‌ కమ్ముల

Published Wed, Dec 20 2023 10:51 AM | Last Updated on Wed, Dec 20 2023 11:27 AM

Sekhar kammula Talk About Passion Movie - Sakshi

సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.  "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్  కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం...నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు

నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ - ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం. అన్నారు.

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్. డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా. అన్నారు.నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే భాగస్వామిని అవుతున్నాను. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement