PMMY
-
పదేళ్లలో రూ.33.65 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదు ప్రారంభమైన ప్రధానమంత్రి–ముద్ర యోజన (పీఎం–ఎంవై) మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 52 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు రూ.33.65 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ముద్ర యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. వారి విజయగాధలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం తోడ్పడుతోందని అన్నారు. ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారగలమన్న నమ్మకం వారిలో పెరుగుతోందని తెలిపారు. పథకంతో లబ్ధిపొందినవారు మరో 10 మందిలో ప్రేరణ కలిగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తన సక్సెస్ స్టోరీని ప్రధానమంత్రితో పంచుకున్నారు. నరేంద్ర మోదీ, లబ్ధిదారు మధ్య జరిగిన సంభాషణ. లబ్ధిదారు: సార్.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు హిందీ రాదు. తెలుగులోనే మాట్లాడుతా.. మోదీ: ఏం ఫర్వాలేదు.. మీరు తెలుగులోనే మాట్లాడండి. లబ్ధిదారు: నాకు 2009లో వివాహం జరిగింది. 2019 వరకు గృహిణిగా ఉన్నాను. జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో కెనరాబ్యాంక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో 13 రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. బ్యాంక్‌కు చెప్పి నాకు లోన్ ఇప్చించారు. ష్యూరిటీ ఏమీలేదు. ఎవరూ నాకు సపోర్ట్ లేరు. కెనరా బ్యాంక్ వారు నన్ను నమ్మి లోన్ ఇచ్చారు. రూ.2 లక్షలు ముద్ర లోన్ తీసుకుని 2019లో వ్యాపారం ప్రారంభించా. నా రీపేమెంట్స్ చూసి 2022లో రూ.9.5 లక్షలు రుణం మంజూరు చేశారు. వ్యాపారాన్ని మరింత విస్తరించా. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. మోదీ: అంటే.. రూ.2 లక్షలతో ప్రారంభించారు. రూ.9.5 లక్షలకు చేరుకున్నారు. మీతో ఎంతమంది పనిచేస్తున్నారు? లబ్ధిదారు: 15 మంది సార్. అందరూ గృహిణిలు, గ్రామీణ ప్రజలే సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మోదీ: కృతజ్ఞతలు.. మీకు ధన్యవాదాలువారి ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ పీఎం–ముద్రా యోజన పథకంతో జీవితాలు మారిపోయిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దశాబ్ద కాలంలో ముద్ర యోజన అనేక కలలను సాకారం చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించి వారిని శక్తివంతంగా మార్చింది. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. పథకం లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే కావడం చాలా సంతోషకరం. ముద్రా యోజనతో సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’’ అని మోదీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు చేశారు. -
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్‌ఎమ్‌వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. -
ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..
2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.ప్రధాన్ మంత్రి ముద్ర యోజనప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.Union Budget 2024-25 provides special attention to #MSMEs and #manufacturing, particularly labour-intensive manufacturing.👉New mechanism announced for facilitating continuation of bank credit to #MSMEs during their stress period👉Limit of #Mudra loans increased from ₹10 lakh… pic.twitter.com/wPbMvnwBhz— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
ఆరేళ్లలో రూ.15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం కింద గణనీయమైన స్థాయిలో రుణ వితరణ నమోదైంది. ఆరేళ్లలో 28 కోట్ల మందికి పైగా లబ్దిదారులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద ఎటువంటి తనఖా లేకుండానే రూ.10 లక్షల వరకు రుణ సాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలు కింద.. తయారీ, ట్రేడింగ్, సేవల రంగం, వ్యవసాయం రంగ సంబంధిత పరిశ్రమలకు ఈ పథకం కింద రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. శిశు విభాగం కింద రుణ గ్రహీతలకు 2 శాతం వడ్డీ రాయితీని ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్డౌన్ల వల్ల ఎదురైన సమస్యల నుంచి చిన్న పరిశ్రమలు గట్టెక్కేందుకు ఈ సాయాన్ని ప్రకటించింది. శిశు విభాగం కింద తనఖా లేకుండా ఒక్కో పరిశ్రమకు రూ.50,000 వరకు రుణం మంజూరవుతుంది. 2020 మార్చి నాటికే శిశు విభాగం కింద 9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
పరపతి ముద్ర ఉంటేనే రుణం
ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రయోజన (పీఎంఎంవై) లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు, తయారీ, సేవా, వాణిజ్య రంగాలకు, నిరుద్యోగులకు పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలి. జిల్లాలో 34 బ్యాంకులకు చెందిన 455 శాఖలు ఉన్నాయి. ఒక్కో శాఖనుంచి కనీసం 25 మందికి రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 15,470 మందికి రూ.50 వేలలోపు రుణాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేకపోయారు. కొన్ని బ్యాంకుల్లో బోణీ కరువు:మండల ప్రాంతాల్లో ఉన్న కొన్ని బ్యాంకుల్లో ఒక్క రుణం కూడా ఇచ్చి న దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పాటు తమ శాఖలను ఏర్పాటు చేసిన కొన్ని బ్యాంకులైతే తాము ముద్ర రుణాలు ఇవ్వబోమని ఖరాకండిగా చెబుతున్నారు. మరి కొన్ని శాఖల్లో ఇవ్వలేమని చెప్పకుండా పదే పదే తిప్పుతున్నారు. పూచికత్తో, పలుకబడో ఉంటేనే.. పూచికత్తు లేకుండా 50 వేలరూపాయల రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం కచ్చితంగా హామీ కోరుతున్నారు. చిన్న వ్యాపారులు ఎవరైనా దీని గురించి తెలుసుకుని వెళ్లి అడిగితే మా లక్ష్యం అయిపోయింది వేరే బ్యాంకులో ప్రయత్నించండని సలహా ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రుణం కోసం ఇవి కావాలి.. = గుర్తింపు ధ్రువపత్రం (ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి) = నివాస ధ్రువపత్రం(విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇంటిపన్ను రసీదు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వంటి చిరునామా ఉన్నవి ఏదైనా) = ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు–2 = కొనదలచిన యంత్ర సామగ్రి/ వ్యాపార సామాను/మూలధన పెట్టుబడికి ఉపయోగపడే కొటేషన్ = సప్లయర్ పేరుతో కూడిన సరుకుల వివరాలు = వ్యాపార సంస్థ గుర్తింపు/చిరునామా ధ్రువపత్రం, ఇటీవల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఇతర పత్రాలు అందని ద్రాక్షే.. ముద్ర రుణాలు అందని ద్రాక్షలా మారాయి. అధికార పార్టీ వారికి, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. సాధారణ కార్మికులు మాత్రం ప్రైవేట్ ఫైనాన్సర్ల చేతిలో కాల్‌మనీ వేధింపులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అరులకు ముద్ర రుణాలు ఇప్పించాలి.– హైదర్‌వలి, ఆటోయూనియన్ జిల్లా అధ్యక్షుడు, ధర్మవరం -
రూ. 1.80 లక్షల కోట్ల రుణాలు లక్ష్యం
ముద్రా బ్యాంక్ సీఈవో జిజి మామెన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల మేర బ్యాంకులు రుణ వితరణ చేయనున్నట్లు లఘు పరిశ్రమల అభివృద్ధి, రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా సీఈవో జిజి మామెన్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటిదాకా రూ.25 వేల కోట్లు రుణాల మంజూరీ జరిగినట్లు మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం రూ.1.22 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. అంచనాలు మించి 3.48 కోట్ల మందికి రూ. 1.33 లక్షల కోట్ల రుణ వితరణ జరిగినట్లు మామెన్ చెప్పారు. ఇందులో రూ.80 వేల కోట్ల పైగా రుణా లు బ్యాంకులు ఇవ్వగా, మిగతావి మైక్రోఫైనాన్స్ సంస్థలు మొదలైనవి ఇచ్చాయని ఆయన తెలియజేశారు. రుణాలు తీసుకున్న వారిలో సింహభాగం మహిళలే ఉండగా, 36 శాతం సంస్థలు కొత్తగా ఏర్పాైటె నవని మామెన్ చెప్పారు. మరోవైపు, పౌల్ట్రీ, డెయిరీ వంటి వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలను కూడా ముద్రా యోజన పరిధిలోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారాయన. రుణ సదుపాయం పొందగోరే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పడేందుకు ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.