scating
-
ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్. అలాంటి స్కేటింగ్‌కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్. ఆమె భారత్ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్ దిగ్గజం ఆనంద్ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్‌ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్ స్కేటింగ్ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్ స్కేటింగ్ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మహీంద్రా పోస్ట్‌లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్ స్కేటింగ్‌కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్‌కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది. ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్‌లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తారా ప్రసాద్ ఎవరు?ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్ షూస్ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్ స్కేటింగ్ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది. భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. అయితే.. సియోల్‌లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్‌లో క్రికెట్‌కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్‌కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్‌ద బెట్ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip. Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times. Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఇద్దరూ ఇద్దరే.. స్కేటింగ్‌లో చిరుతలే.!
మురారీని ఓ రోజు తల్లిదండ్రులు వుడా(వీఎంఆర్డీఏ) పార్కుకు తీసుకెళ్లగా.. అక్క డ కొందరు స్కేటింగ్ ఆడుతున్నారు. వారిని చూసి తాను నేర్చుకుంటానని మారాం చేశాడు. కుమారుడి ఆసక్తిని గుర్తించిన ఆ తల్లిదండ్రులు వెంటనే శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. అలా మురారి 2012లో స్కేటింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అనతికాలంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగాడు. అన్నయ్య బాటలోనే తమ్ముడు ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. ప్రపంచస్థాయి ఎంపిక పోటీలో నాలుగో స్థానంలో నిలిచాడు. త్రుటిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. సీతమ్మధార(విశాఖ ఉత్తర): స్కేటింగ్‌లో తారాజువ్వల్లా దూసుకుపోతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. రోలర్ స్కేటింగ్‌లో భాగంగా ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. వారే జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలేనికి చెందిన చందక వెంకట సురేష్ కుమార్, అంబిక దంపతుల కుమారులు వెంకట్ పవన్ కార్తికేయ, వెంకట నాగ మురారి. త్వరలో అర్జెంటీనాలో జరిగే ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో దేశం నుంచి ముగ్గురు ఎంపిక కాగా.. అందులో పవన్ కార్తికేయ ఒకడు. చదువులోనూ ప్రతిభావంతులే.. చదువులోనూ వీరిద్దరూ ప్రతిభ చూపిస్తున్నారు. 90 శాతం మార్కులు సాధిస్తున్నారు. క్రీడలు, చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్పీడ్ విభాగంలో ఎల్.కృష్ణకుమార్ వద్ద, ఇన్లైన్ ఆల్పైన్ ఈవెంట్లో తండ్రి సురేష్ వద్ద వీరు శిక్షణ తీసుకుంటున్నారు. కఠోర సాధనతో.. స్కేటింగ్‌లో ప్రతిభ చూపాలంటే కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం కూడా కీలకం. మంచి కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ కాపాడుకోవాలి. అప్పుడే పతకాలు సాధించగలరు. పవన్ కార్తికేయ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి ఆర్కేబీచ్, ఆరిలోవ, సింహచలం రోడ్డు తదితర ప్రాంతాల్లో సాధన చేస్తూ.. సాయంత్రం వీఎంఆర్డీఏ పార్కు స్కేటింగ్ రింక్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. రోడ్లు ఖాళీ లేని సమయంలో సింహాచలం రోడ్లపై కూడా సాధన చేస్తుంటాడు. డౌన్‌హిల్ ఈవెంట్లో మెరుపులు కొండ శిఖరం నుంచి వాలులో కిందకు దూసుకొస్తూ.. ప్రత్యర్థులను దాటుకుంటూ రావాలి. వేగం, స్థిరత్వం కలగలసి అత్యంత చాకచాక్యంగా ఆడాల్సిన క్రీడ ఇది. దీనిలో ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. పవన్ కార్తికేయ ఇంతటి కష్టమైన క్రీడాంశంలో సైతం మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐదేళ్లుగా ఇన్లైన్ ఆలై్పన్ ఈవెంట్లో అన్నదమ్ములిద్దరూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతూ.. దూసుకుపోతున్నారు. పైలట్ అవుతా.. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ నా కల.. అదే లక్ష్యంతో చదువుతున్నాను. స్కేటింగ్‌లో ప్రపంచస్థాయిలో గెలిచి దేశానికి మంచి పేరు తీసుకువస్తా. – పవన్ కార్తికేయ ఐఐటీలో ర్యాంక్ సాధిస్తాను. ప్రపంచస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తున్నాను. తల్లిదండ్రుల ఆశయాలు నేరవేరస్తాను. – నాగ మురారి మురారి విజయాలివీ.. 2018లో వీఎంఆర్డీఏ పార్కులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2019లో విశాఖలో జరిగిన స్కేటింగ్ పోటీల్లో వెండి పతకం 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వెండి పతకం 2022 ప్రపంచ స్థాయి పోటీల ఎంపికలో నాలుగో స్థానం కార్తికేయన్ విజయాలివి 2013లో స్కూల్ గేమ్స్ పోటీల్లో రజతం 2016లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం. కర్నాటకలో నిర్వహించిన జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏడో స్థానం 2017లో తిరుపతిలో జరిగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ గేమ్స్‌లో రజతం 2018లో విశాఖలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం, కాంస్యం 2019లో విశాఖలో వీఎంఆర్డీఏ పార్కులో జాతీయస్థాయి ఆర్ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం 2019లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో ఇన్లైన్ ఆలై్పన్ ఈవెంట్లో 14వ స్థానం. ఈ పోటీలకు 96 దేశాల క్రీడాకారులు హాజరయ్యారు. 2020లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం 2021లో పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ప్రతిభకు ప్రోత్సాహం చందక వెంకట పవన్ కార్తికేయకు 2019లో వైఎస్సార్ క్రీడా పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల నగదు బహుమతి ప్రదానం చేసింది. 2021లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది. 2022లో ప్రపంచస్థాయి పోటీలకు అయ్యే ఖర్చుల నిమిత్తం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జెడ్పీ కార్యాలయం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా రూ.2.65లక్షలు డి.డి.రూపంలో ఆర్.ఎస్.ఎఫ్.ఐకార్యాలయానికి పంపించారు. (చదవండి: ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే) -
విశాఖలో ఉత్సాహంగా స్కేటింగ్ ట్రెయినింగ్
-
జపాన్ స్కేటింగ్ విన్యాసాలు
-
దూసుకెళ్తా!
నేను కూడా స్కేటింగ్ చేస్తా..! కాసుకోండి అంటూ సవాల్ చేస్తున్నట్లుంది కదూ ఈ బుజ్జి శునకం. నాలుగేళ్ల ఈ శునకం పేరు బోబో. పెంపుడు కుక్కలకు సంబంధించిన ఓ లగ్జరీ హోటల్ ప్రమోషన్ భాగంగా దీని యజమాని సింగపూర్‌లో ఇలా ప్రదర్శనకు ఉంచాడు.