taskforce committe
-
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ సారథ్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్టీఎఫ్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్‌టీఎఫ్‌కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.4 నెలల్లో మధ్యంతర నివేదికఎన్టీఎఫ్ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్ఈఆర్లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం: మేకపాటి గౌతమ్ రెడ్డి
సాక్షి, అమరావతి: స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అవకాశం కల్పించనున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ''వర్క్ ఇన్ హోమ్ టౌన్'' సెంటర్ల నమూనా రూపకల్పను ఆదేశాలు జారీ చేశారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ నైపుణ్యం, ఫైబర్‌నెట్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది. దీంతో కన్నవారితో ఉన్న ఊరిలోనే ఐటీ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుందని గౌతమ్ రెడ్డి తెలిపారు. -
ఏపీ: పీడియాట్రిక్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు పెద్దలపైనే తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి.. మూడో దశలో పిల్లలపై అధికంగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్రత్తమైన ప్రభుత్వం ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మందితో పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. వారంలోగా ప్రాథమిక నివేదక ఇవ్వాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ -
Cyclone Yaas: అదనంగా 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 32వేల ఆక్సిజన్ బెడ్స్‌కి 660 మెట్రిక్ టన్నులు ప్రాణ వాయువు కావాలి. కానీ కేంద్రం ఇచ్చేది 590 మెట్రిక్ టన్నులు మాత్రమే. దాంతో ప్రతిరోజూ అదనంగా 150 మెట్రిక్ టన్నులు తీసుకొస్తున్నాం’’ అన్నారు కృష్ణబాబు. ‘‘యస్ తుపాను వల్ల ఇబ్బందులొస్తాయని ముందస్తుగా.. అదనంగా 400 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ తీసుకొచ్చాం. ఇప్పటివరకు జామ్‌నగర్ నుంచి నాలుగు ఆక్సిజన్ రైళ్లు వచ్చాయి. ఆక్సిజన్ రవాణా కోసం 92 లారీలను వినియోగిస్తుండగా.. సరఫరా కోసం 16 కంటైనర్లను ఏర్పాటు చేశాం. ప్రైవేట్ సెక్టార్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం పాలసీని ప్రకటించారు. 120 కోట్ల రూపాయలతో ఆస్పత్రుల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నాం అని కృష్ణబాబు తెలిపారు. -
ఉద్యోగుల విభజన
వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారీ కార్యాలయాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు మరో ఫ్రొఫార్మా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో జేసీ సమీక్ష ఆదిలాబాద్ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో కసరత్తు మొదలైంది. నూతన జిల్లాలు వచ్చే దసరా నుంచి పాలన అందించాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వివరాలు సేకరించేందుకు ఫ్రొఫార్మా తయారు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో ఉద్యోగుల విభజనకు అవసరమైన వివరాల సేకరణకు ప్రత్యేక ఫ్రొఫార్మా తయారు చేశారు. ముందుగా రెగ్యూలర్ ఉద్యోగులకు సంబంధించిన ఫ్రొఫార్మా, అనంతరం కాంట్రాక్టు, పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగులకు చెందిన ఫ్రొఫార్మాను రూపొందించారు. కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు విభాగాల వారీగా ఉద్యోగుల వివరాలు పొందుపర్చే విధంగా ఈ ఫ్రొఫార్మా ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి నూతనంగా ఏర్పడే జిల్లాలకు కేటాయించేందుకు కావాల్సిన సమాచారం ఈ ఫ్రొఫార్మా ద్వారా అధికారులకు అందుతుంది. ఉద్యోగుల వివరాల సేకరణకు సంబంధించిన ఈ ఫ్రొఫార్మా తయారీకి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో కాకుండా మండలం, డివిజన్, జిల్లా స్థాయిలోనే విభజన ఉంటుందని జేసీ సుందర్ అబ్నార్ తెలిపారు. అటెండర్ స్థాయి నుంచి అన్ని వివరాలు సేకరించి విభజన చేపట్టనున్నామని తెలిపారు. ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఎక్కడి వాళ్లు అక్కడికే కేటాయించేలా సమావేశంలో చర్చించారు. విభజనకు సంబంధించి జిల్లాలకు నియమించడమే తమ బాధ్యత అని, సర్వీసు తక్కువ, ఎక్కువగా ఉండడం తమ పరిధిలోకి రాదన్నారు. వివరాల సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రొఫార్మా ఉంటుందన్నారు. ఉద్యోగి పేరు నుంచి అన్ని వివరాలు ఇందులో పొందుపర్చినట్లు జేసీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విభజనపై.. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను సమకూర్చడంపై కూడా సమీక్షలో చర్చించారు. డీఆర్వో సంజీవరెడ్డి కమిటీ సభ్యులతో చర్చిస్తూ ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వివరాల సేకరణకు ప్రొఫార్మ తయారు చేశామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చని, ప్రొఫార్మలో ఏయే వివరాలు అడుగుతున్నామో చదివి వినిపించారు. డిపార్ట్మెంట్ పేరుతో సహా కార్యాలయాల్లోని అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు, అందులో పని చేస్తున్నవి ఎన్ని.. వాటి సంఖ్య, తదితర వివరాల సేకరణకు ఈ ప్రొఫార్మ రూపొందించారు. కంప్యూటర్, ఏసీ, లైట్లు, కూలర్లు, కుర్చీలు, టేబుళ్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మోబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు (అద్దె, ప్రభుత్వ), జిరాక్స్ మిషన్లు, తదితర వివరాలు ఈ ప్రొఫార్మ ద్వారా సేకరించే వీలుంది. వివరాలు సేకరించిన అనంతరం కొత్త జిల్లాలకు వీటిని కేటాయిస్తారు. మూడు జిల్లాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా.. లేదా.. అనేది ఈ ప్రొఫార్మ ద్వారా తెలిసిపోతుంది. వివిధ కార్యాలయాల్లో ప్రస్తుతం పని చేస్తున్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, డీఈవో సత్యనారాయణరెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి వనజారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.