Wang
-
సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి. -
‘మీటూ’కి కొత్త వెర్షన్!
‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్‌తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది. పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్ ప్రావిన్స్ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు. దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్ని ‘లైఫ్ డిసిప్లిన్ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్ అనే మాటతో సరిపెట్టేసింది. ∙∙ వాంగ్ మొదట ఝౌ కు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్. ఝౌ కూడా మెసేజ్‌తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్‌లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్! బాస్ తన క్యాబిన్లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్‌ల రూపంలో ఈమె ఫోన్లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్ చేసి చెబుతోంది. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ బాస్‌కి సపోర్ట్‌గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్‌గా తీసుకుని సీట్లోంచి తొలగించింది. తుడిచే కర్రతో బాస్‌ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్) -
54 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
1963లో దారి తప్పి భారత్‌లోకి వచ్చిన చైనా సైనికుడు బీజింగ్: 54 ఏళ్ల క్రితం దారితప్పి భారత్‌కి వచ్చిన ఓ చైనా సైనికుడు ఎట్టకేలకు శనివారం స్వదేశానికి చేరుకున్నాడు. వాంగ్ కి (77) అనే చైనా సైనికుడు 1962లో జరిగిన భారత్–చైనా యుద్ధకాలంలో సరిహద్దు దాటొచ్చి భారత్‌లో చిక్కుకుపోయాడు. బీజింగ్ ఎయిర్‌పోర్టులో వాంగ్‌కు చైనా విదేశాంగ, భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు. యుద్ధం ముగిశాక∙రాత్రి చీకట్లో దారి తప్పి 1963 జనవరి 1న ఇతను అస్సాంలోకి ప్రవేశించాడు. అక్కడి రెడ్ క్రాస్ సభ్యులు వాంగ్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారు. వాంగ్ ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. తిరిగి చైనా వెళ్లేందుకు భారత అధికారులు అంగీకరించక పోవడంతో మధ్యప్రదేశ్ చేరుకుని అక్కడే ఓ మహిళను పెళ్లాడి వాచ్‌మన్ ఉద్యోగంలో చేరారు. స్థానికులు అతనికి రాజ్ బహదూర్ అని పేరు పెట్టారు. వాంగ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుక్కి ఓ కూతురుంది. కొన్నాళ్ల క్రితం వాంగ్ బంధువు ఒకరు భారత పర్యటనకు వచ్చినప్పుడు అతణ్ని కలిసి విషయం తెలుసుకుని చైనాకు వెళ్లి వాంగ్‌కు పాస్‌పోర్టు వచ్చేలా చేశాడు. వాంగ్‌పై గతంలో బీబీసీ ప్రసారంచేసిన కార్యక్రమం సంచలనం కావడంతో విషయం ఇరుదేశాల విదేశాంగ శాఖలకు తెలిసి ఉమ్మడిగా చర్చించి.. భారత్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేలా వీసా మంజూరు చేశారు. వాంగ్ భార్య, కూతురు అతనితోపాటు చైనా వెళ్లేందుకు నిరాకరించగా, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి వాంగ్ శనివారం చైనా చేరుకున్నారు.