Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Bachao Karreguttalu: CRPF Huge Operation at Mulugu April 22nd 2025 Updates1
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్‌.. భారీ ఎన్‌కౌంటర్‌!

ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీగా మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మావోయిస్టులు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Telangana Intermediate 2025 Results Direct Link Click Here2
Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్‌తో..

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. జస్ట్‌ ఒకే ఒక్క క్లిక్‌తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. సప్లిమెంటరీ తేదీలను కూడా ఫలితాల వెంటే ప్రకటించనున్నారు.

Ex Karnataka DGP Case: Wife Internet Searches Reveal Disturbing Details3
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..

బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్‌ కొడుకు కార్తీక్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్‌ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్‌ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్‌ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్‌ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్‌ తనయుడు కార్తీక్‌ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

Kommineni Comments On Chandrababu False Allegations4
చంద్రబాబు.. మరీ ఇంతగానా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్‌ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్‌ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్‌ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్‌, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్‌, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్‌ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్‌ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్‌ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్‌ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Jasprit Bumrah Has Been Named As Wisden Men's Leading Cricketer In The World For 20245
జస్ప్రీత్‌ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్‌ మెన్స్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది. 2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్‌ల్లో 13 సగటున) తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్‌ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, బీసీసీఐ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు గెలుచుకున్నాడు.గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్‌కు టైటిల్‌ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డుతో పాటు రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు.దిగ్గజాల సరసన చోటుతాజాగా విజ్డెన్‌ మెన్స్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్‌ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్‌ 2, సచిన్‌ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.విజ్డెన్‌ వుమెన్స్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్‌ సెంచరీ సాధించింది.పూరన్‌కు లీడింగ్‌ టీ20 ప్లేయర్‌ అవార్డుపొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌కు విజ్డెన్‌ మెన్స్‌ లీడింగ్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డు లభించింది. పూరన్‌ గతేడాది పొట్టి ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు.

New trend acqua workd outs health benefits6
న్యూ ట్రెండ్‌.. ఆక్వా వర్కౌట్స్‌ : ప్రయోజనాలెన్నో!

పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్‌ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్‌ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్‌దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్‌ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్‌ లిఫ్ట్‌లు, లెగ్‌ కిక్స్, లెగ్‌ షూట్స్‌ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్‌లు/హైడ్రో ఎక్సర్‌సైజ్‌లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్‌ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్‌ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్‌ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్‌ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్‌ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్‌ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్‌–బాక్సింగ్‌ వంటి అనేక రకాలైన వర్కవుట్స్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్‌ గ్లోవ్స్, రెసిస్టెన్స్‌ ట్యూబింగ్, వాటర్‌ వాకింగ్, ఆక్వా థ్రెడ్‌మిల్స్, వాటర్‌ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్‌ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్‌ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్‌లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్‌ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్‌లోడ్‌ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్‌ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్‌ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్‌ పాస్‌ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్‌ క్యాప్‌ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్‌ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్‌ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్‌ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్‌ లేదా ఫ్లిప్‌ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్‌ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్, ఏరోబిక్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్‌నర్‌గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్‌ శిక్షకురాలు

Twist In Air Force Officer Assault Case In Bengaluru7
ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్

బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్‌ కమాండర్‌ షీలాదిత్యా బోస్‌, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్‌ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్‌ బోస్‌ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్‌ నాన్‌ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ దేవ్‌రాజ్‌ షాకింగ్‌ విషయం తెలియజేశారు. తొలుత బోస్‌ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్‌పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్‌, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్‌డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025

Ursa: Kesineni Nani Exposed Kesineni Chinni Fraud8
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్‌ బట్టబయలు చేసిన కేశినేని నాని

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్‌ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్‌ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్‌మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్‌, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025

ED Notice Issued To Actor Mahesh Babu9
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు(Mahesh Babu) కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గతవారంలో రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్‌, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్‌ ప్రచార కర్తగా వ్యవహరించారు. వీటి ప్రచారానికి గానూ ఆయన భారీగా పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్‌కు చేసిన ప్రచారానికిగానూ రూ.5.9 కోట్లు మహేష్‌ అందుకున్నారు. ఈ ప్రమోషన్‌ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్‌ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత 27వ తేదీన ఆయన్ని విచారణకు ఈడీ నోటీసులు పంపింది. అయితే.. ఆరోజు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఆ మరుసటిరోజు (28వ తేదీన) ఉదయం 11గం. విచారణకు రావాలని కోరింది. సంబంధిత గ్రూపులతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

Google Monopoly Ends For Android TVs In India Check The Fine Details10
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..

గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.గూగుల్, ఆల్ఫాబెట్‌లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్‌లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్‌మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్‌లో ఏవి ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్ స్టోర్‌లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్‌లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్‌లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్‌లకు సేవలు అందిస్తున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్‌లను డిఫాల్ట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్‌మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement