Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Pahalgam Terror Attack1
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Sakshi Guest Column On TRS Party establishment by KCR in Telangana2
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...

టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్‌ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్‌ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్‌ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్‌ యూనియన్, తెలంగాణ లాయర్స్‌ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్‌ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్‌ ఛాన్స్‌లర్లు నవనీత రావు, ఆర్వీయార్‌ చంద్రశేఖర్‌ రావు, జయశంకర్, జస్టిస్‌ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్‌ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్‌ భాస్కర్‌ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్‌ కెప్టెన్‌ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్‌ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్‌ ఫైట్‌– స్ట్రీట్‌ ఫైట్‌ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్‌ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్‌ ఫైట్, స్ట్రీట్‌ ఫైట్‌ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్‌లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్‌... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్‌ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాల సందర్భంగా)

Pakistan Government Mocked By Own Citizens As Tensions Rise With India3
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంట‌లో తిరిగిచ్చేస్తారు'

పెహ‌ల్‌గావ్‌లో మూష్క‌ర‌మూక‌ల మార‌ణ‌హోమం త‌ర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఉగ్ర‌వాదులతో రాక్ష‌స‌ కాండ‌కు అండ‌గా నిలిచింద‌న్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాల‌ను భార‌త్ తెంచుకుంది. సింధూ న‌ది ఒప్పందం నిలిపివేత‌, పాకిస్థానీయుల‌కు వీసాల ర‌ద్దుతో ప‌లు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. అమాయ‌క ప‌ర్యాట‌కులను అకార‌ణంగా పొట్ట‌న పెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌ను ఊహించ‌ని రీతిలో శిక్షిస్తామ‌ని భార‌త్ గ‌ట్టి హెచ్చ‌రిక జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహ‌ల్‌గావ్ (pahalgam) దాడితో భార‌త దేశంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో పాకిస్తాన్‌కు త‌న పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బ‌దులిచ్చేందుకు తంటాలు ప‌డుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర‌వ‌డం త‌ల‌నొప్పిగా మారుతోంది. ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియాలో స్వ‌యంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బ‌య‌టా స‌వాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయ‌క‌త్వంపై త‌మ వ్య‌తిరేక‌త‌ను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం ఎలా విఫ‌ల‌మైందో సోష‌ల్ మీడియా (Social Media) వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు.రాత్రి 9 త‌ర్వాత వార్ వ‌ద్దుభార‌త్ తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా పాకిస్తానీయులు త‌మ ప్ర‌భుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. త‌మ క‌నీస అవ‌స‌రాలు తీర్చ‌డంలో పాల‌కులు ఎలా విఫ‌ల‌మ‌య్యారో ఎత్తిచూపారు. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న త‌మ దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ.. ఇండియాతో యుద్ధం వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌దా అని త‌మ‌ను తామే ప్ర‌శ్నించుకున్నారు. ఒకవేళ త‌మ‌తో యుద్ధం చేయాల్సివ‌స్తే రాత్రి 9 గంట‌ల‌కు ముగించాల‌ని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది త‌ర్వాత గ్యాస్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మ‌రో యూజ‌ర్ తమ దేశార్థిక దారుణావ‌స్థ‌ను బ‌య‌ట‌పెట్టారు.ఈ కష్టాలు ఎప్ప‌టికి తీర‌తాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒక‌రు ప్ర‌శ్నించ‌గా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మ‌రొక‌రు సమాధానం ఇచ్చారు. మ‌న బాధ‌ల కంటే బాంబు దాడే బెట‌ర్ బ్రో అంటూ ఇంకొక‌రు స్పందించ‌గా.. ఈ కష్టాలు ఎప్ప‌టికి తీర‌తాయో అంటూ మ‌రో యూజ‌ర్ నిట్టూర్చారు. త‌మ‌ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫ‌న్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చ‌ద‌వండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్‌ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజ‌ర్లు స్పందిస్తూ.. ఇప్ప‌టికే త‌మ దేశంలో తీవ్ర నీటి కొర‌త ఉంద‌ని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Chandrababu Plans To Convert Talliki Vandanam An Installment Scheme4
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక

సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్‌స్టాల్‌మెంట్‌ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2025: kolkata knight riders vs punjab kings live updates5
IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దుఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వర్షం కారణంగా ర‌ద్దైంది. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ముగిసిన అనంత‌రం వ‌రుణుడు మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించాడు. ఆ త‌ర్వాత వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంతాభావించారు. కానీ మైదానం సిద్దం చేసే స‌మ‌యానికి వ‌ర్షం మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంపైర్‌లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్‌(25) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌స్సెల్ త‌లా వికెట్ సాధించారు. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయంఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి కేకేఆర్ వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. చెల‌రేగిన పంజాబ్ బ్యాట‌ర్లు.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్‌ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్‌(25) రాణించారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్‌..ప్ర‌భుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 83 ప‌రుగుల‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సింగ్‌.. వైభ‌వ్ ఆరోరా బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 14.3 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్‌: 160/2పంజాబ్ తొలి వికెట్ డౌన్‌..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 ప‌రుగులు చేసిన ఆర్య‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌కు పంజాబ్ వికెట్ న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. 11 ఓవ‌ర్లకు పంజాబ్ స్కోర్‌: 112/011 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 112 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(62), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(47) ఉన్నారు.8 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్‌: 71/08 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 71 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(38), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(31) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్‌..4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 43 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(28), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(13) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం.ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జ‌ట్టులోకి తిరిగి మాక్స్‌వెల్‌, ఓమ‌ర్జాయ్ వ‌చ్చారు. కేకేఆర్ రెండు మార్పులు చేసింది. రావ్‌మ‌న్ పావెల్‌తో పాటు చేత‌న్ సాకరియా కేకేఆర్ తుది జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.తుది జ‌ట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

 Union Minister Hardeep Singh  No Water Response To Bilawal6
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!

న్యూఢిల్లీ: సింధు జలాలను ఆపితే అందులో పారిదే రక్తమే అంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ భుట్టో స్టేట్ మెంట్ విన్నాను. ఒకసారి సింధు జలాల్లో దూకి చూడు. నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుంది’’ అంటూ హర్ దీప్ సింగ్ బదులిచ్చారు. ఒక విషయం పబ్లిక్ లో మాట్లాడేముందు ముందు వెనుక చూసుకుని మాట్లాడితే మంచిదని చురకలంటించారు. భుట్టో వ్యాఖ్యల్లో ఎటువంటి గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది. మన పొరుగు దేశంగా ఉన్న పాకిస్తాన్ సహకారంతో అది జరిగింది. దానికి ఆ దేశం పూర్తి బాధ్యత వహించాలి. అంతేగానీ దీన్ని ఇంకా పెద్దది చేసుకుని ఏవో ప్రయోజనం వస్తుందని భావించకండి. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలనే చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంతకుముందు పాకిస్తాన్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రదాడులతో మానవ హక్కుల్ని కాల రాస్తారా?, దీనికి యావత్ ప్రపంచం ఎంతమాత్రం ఒప్పుకోదు. ;పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశమే కాదు.. క్షీణదశకు వచ్చేసిన దేశం’ అంటూ కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు.సుక్కర్ సింధ్ ప్రొవిన్స్ లో భుట్టో జర్దారీ బహిరంగం ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ సింధు జలాలు మావి. అవి ఎప్పటికైనా మావే. ఒకవేళ అందులో నీళ్లు పారకపోతే.. వారి రక్తం పారుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

US Court Given Relief To 1200 Students Over Deportation7
ట్రంప్‌ యూటర్న్‌.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Over 1000 illegal Bangladeshi immigrants detained8
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!

అహ్మదాబాద్: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ.. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతేఅక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. Surat, Gujarat | The people caught last night are Bangladeshis. We will check their documents. After this, we plan to send them to Bangladesh: Surat JCP Crime Raghavendra Vats. https://t.co/jqgyPEJmzm— ANI (@ANI) April 26, 2025 Over 550 Illegal Bangladeshi immigrants detained in Gujarat operationsRead @ANI Story | https://t.co/NuuktkcjCp#IllegalImmigrant #Gujarat pic.twitter.com/6Cwc8g3Ci9— ANI Digital (@ani_digital) April 26, 2025 Massive numbers incoming - More than 1000 illegal Bangladeshis and Pakistanis detained in pre-dawn Ops by Gujarat PoliceMale - 436+88Female - 240+44Kids - 214Total - 1022 pic.twitter.com/rvAB5HdLPQ— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025

Seema Haider To Pakistan Rakhi Sawant Requests Indian Govt To Not Send ​her9
సీమా హైదర్‌ పాక్‌ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్‌ సంచలన వీడియో

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహెల్గామ్‌ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్‌ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్‌ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ

Digital Content Creator ends life Two Days Before Her 25th Birthday10
బర్త్‌డే రెండు రోజులనగా ఇన్‌ఫ్లూయెన్సర్‌,హెయిర్‌ బ్రాండ్‌ సీఈవో ఆత్మహత్య

ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.కామెడీ స్కిట్‌లు, వీకెండ్‌ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్‌అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది.అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్‌లైన్‌లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్‌ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.ఎవరీ మిషా అగర్వాల్2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్‌ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీహెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్‌ కూడా డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్‌ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్‌నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది. చదవండి: సీమా హైదర్‌ పాక్‌ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్‌ సంచలన వీడియో

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement