Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

High Court once again expresses strong anger against AP police1
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – హైకోర్టుసాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్‌ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదని మండిపడింది. ‘‘పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మనండి.. చట్టం ఏం చెబుతుందో ఆయన్ను అడిగి తెలుసుకుంటాం. సిట్‌లోని అధికారులు వారికి వారు చాలా పెద్దవాళ్లం.. శక్తిమంతులం అని అనుకుంటున్నారు. శక్తిమంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు.. అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫాం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. సిట్‌ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం’’ అని సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో మీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆయన్ను సిట్‌ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ దర్యాప్తు అధికారిపై నిప్పులు.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పోలీసుల దుర్మార్గ పోకడను తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు పూసగుచి్చనట్లు నివేదించారు. కేసు ఏమిటి? నేరం ఏమిటి? అనే విషయాలను చెప్పకుండా తనను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించారని హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాథేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్లు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి (ఐవో) విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభాంత్రులకు గురి చేశారన్నారు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి తన వెంటపడతారోనని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్‌ దర్యాప్తు అధికారి, అదనపు ఎస్‌పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు చెరిగింది. ‘అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యంరెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. ఆయన ఏ కేసులోనూ నిందితుడు కారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్లు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు...’ అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్సార్‌సీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి గత వారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలను నివేదించారు. ‘పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్‌ వద్దకు తరలించి నా మొబైల్‌ లాక్కున్నారు. సిట్‌ అదనపు ఎస్‌పీ నన్ను దూషించారు. బంధించి హింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచి్చనట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు..’ అని కోర్టుకు విన్నవించారు.ఆటిట్యూడ్‌ చూపితే ఏం చేయాలో తెలుసు...బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) పేర్కొనటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్‌కు వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి ఆటిట్యూడ్‌ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలుసునంది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులెవరని ప్రశ్నించగా ఎస్‌జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్‌ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామంది. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ స్పందిస్తూ, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్‌ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారిని వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. 18-12-2024..మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు..‘సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మెజిస్ట్రేట్‌ ఆధారాలున్నా­యనడం తప్పు. మెజిస్ట్రేట్‌ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్‌కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06-01-2025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్‌ చూపారు? ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18-02-2025..లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయ­డం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయ­డం లేదు. కోర్టు ఆదేశా­లను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నా­యని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు25-02-2025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచి పెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11-03-2025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్‌ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్‌ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’– సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ చట్ట విరుద్ధమని కొట్టివేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25-03-2025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు10-04-2025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణ మురళిపై కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి

CM Revanth Reddy team participating in World Expo in Osaka2
కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఒసాకా, ప్రపంచం కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు జపాన్‌ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. కలిసి పనిచేద్దాం.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం..’అంటూ జపాన్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. జపాన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ఒసాకాలో జరిగిన వరల్డ్‌ ఎక్స్‌పోలో పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్‌ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. మా ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి..’అని సీఎం చెప్పారు. బయో, ఐటీ రంగాల్లో గుర్తింపు: శ్రీధర్‌బాబు ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎల్రక్టానిక్స్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్‌ మొబిలిటీ, సర్క్యులర్‌ ఎకానమీపై ఈ నగరం ఆధారపడుతుందని పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)తో పాటు రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని, ఆర్‌ఆర్‌ఆర్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)కు మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా పెవిలియన్‌ ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్‌పో’లో తెలంగాణ తన ప్రత్యేకపెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి..మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం దీనిని ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకో మారు ఒసాకా ఎక్స్‌పో నిర్వహిస్తారు. అయితే ఈ ఎక్స్‌పోలో భారతదేశం నుంచి పాల్గొన్న తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. కిటాక్యుషు నుంచి సీఎం బృందం ఒసాకా చేరుకుంది. కాగా ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రం అడుగులు వేయనుంది.

Rasi Phalalu: Daily Horoscope On 12-04-2025 In Telugu3
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి ప.1.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.06 వరకు, తదుపరి ధనిష్ఠ,వర్జ్యం: ప.12.02 నుండి 1.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృతఘడియలు: రా.9.30 నుండి 11.01 వరకు.సూర్యోదయం : 5.44సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం... అనుకోని ధనలాభం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో మరింత ఆదరణ.వృషభం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. ఆస్తులపై ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం.... వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య,కుటుంబసమస్యలు. ఆలయాల సందర్శనం.కర్కాటకం... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వృత్తి,వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం.సింహం... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు దర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం. విద్యావకాశాలు.కన్య... అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.తుల... బంధువులతో స్వల్ప తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయాల సందర్శనం. బంధువుల కలయిక.వృశ్చికం... సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.ధనుస్సు.... కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. దైవచింతన.మకరం... చేపట్టిన పనులలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.కుంభం... ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆరోగ్యసమస్యలు.మీనం... విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

10 grams of 24-carat gold crosses Rs 1 lakh mark in India4
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!

న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్‌ మార్కెట్‌లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్‌ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్‌ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్‌ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్‌ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్‌ మార్కెట్‌. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్‌ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్‌ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్‌ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్‌ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్‌ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్‌ ఇండెక్స్‌ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్‌ యువాన్, జపనీస్‌ యెన్, యూరో, బ్రిటిష్‌ పౌండ్, కెనడియన్‌ డాలర్, ఆ్రస్టేలియన్‌ డాలర్‌ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్‌ టైమ్‌ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్‌ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్‌ టైమ్‌ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్‌ రేట్‌ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్‌ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్‌..భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్‌ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్‌ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్‌ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్‌ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్‌ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్‌జీబీల మాటేమిటి?భారత్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం (ఎస్‌జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్‌ బాండ్స్‌ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను రిడీమ్‌ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్‌ కూడా ఆఫర్‌ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్‌ రిజర్వ్‌ ఫండ్‌ (జీఆర్‌ఎఫ్‌)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్‌లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్‌ బాండ్స్‌ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్‌ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్‌ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్‌ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి...: సెంట్రల్‌ బ్యాంక్స్‌ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్‌ఫ్లేషన్‌ ఆందోళనలు :..తాజా యూఎస్‌ ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్‌ఫ్లేషన్‌ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్‌ పెట్టుబడులు :..చైనా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్‌ రేటు కోతలు :..యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి ఇజ్రాయెల్‌–హమాస్‌ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్‌ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్‌లో యూఎస్‌ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్‌ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్‌ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్‌ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్‌ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్‌ కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ ఈటీఎఫ్‌ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్‌ డాలర్‌ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్‌ కమోడిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రణవ్‌ మెర్‌

Chandrababu Govt illegal case on Raj Kasireddy5
మద్యం మసి పూసి.. సిట్‌ పోలీసుల ‘కసి’

సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెది­రింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్‌ బుక్‌ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్‌ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్‌ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌ కసిరెడ్డిని శంషాబాద్‌ విమానాశ్రయంలోనే సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్‌ అధికారుల రాజ్‌ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్‌బుక్‌ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్‌ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్‌ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్‌ కసిరెడ్డి విషయంలో సిట్‌ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్‌ అధికారులకు ఈ–మెయిల్‌ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్‌ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్‌ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్‌ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ రాజ్‌ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్‌ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్‌ రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా రాజ్‌ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్‌ చీఫ్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్‌ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్‌ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్‌ హాస్పిటల్స్‌ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్‌ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్‌ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్‌ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్‌ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్‌ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ స్పెషల్‌ ఆఫీసర్‌ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్‌ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్‌సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్‌ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్‌ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్‌ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్‌ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్‌ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్‌ డిస్టిలరీస్‌ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్‌ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్‌ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్‌ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్‌ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెన్యువల్‌ కూడా చేయనే లేదు. రాజ్‌ కసిరెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు.

Sakshi Guest Column On Indian Govt method of negotiating with USA6
ఇండియా విధానం సరైనదేనా?

భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్‌ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్‌ మోటార్‌ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్‌ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్‌ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్‌ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్‌ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్‌ యూరోపియన్‌ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్‌ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్‌లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్‌ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్‌ స్థూలంగా జపాన్‌ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్‌ ఫర్‌ యాన్‌ అన్‌సర్టెన్‌ వరల్డ్‌’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్‌ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్‌ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్‌ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్‌ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్‌ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

PM Modi, US Vice President Vance discuss trade, strategic ties and global issues7
వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి

న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్‌ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్‌ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్‌ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్‌ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్‌ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్‌ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్‌ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్‌ చిన్నకుమారుడు వివేక్‌ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్‌ సూట్‌ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్‌ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్‌ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌కు, ఇటు వికసిత్‌ భారత్‌ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్‌ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్‌ ఢిల్లీకి వచ్చారు.

TJR Sudhakar Babu Sensational Comments on TDP govt8
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు

సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్‌ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్‌లో చోటు కలి్పంచిన ఘనత జగన్‌ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. జగనన్న అణ­గారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మా­జీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీ­వయ్య, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్‌కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్‌ జగన్‌ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్‌ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు.

Gujarat Titans beat Kolkata Knight Riders by 39 runs9
గుజరాత్‌ గర్జన

కోల్‌కతా: గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. బట్లర్‌ (23 బంతుల్లో 41 నాటౌట్‌; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ముందుగా సాయి సుదర్శన్‌ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్‌ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్‌ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్‌ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్‌ 34 బంతుల్లో, సుదర్శన్‌ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్‌ చేసిన రసెల్‌ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్‌ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్‌ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్‌ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్‌ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్‌ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్‌ (1) పెవిలియన్‌ చేరగా, కెప్టెన్‌ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్‌ నరైన్‌ (17)ను రషీద్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ అతన్ని అవుట్‌ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్‌ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) స్టంపౌట్‌ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 52; శుబ్‌మన్‌ గిల్‌ (సి) రింకూ సింగ్‌ (బి) వైభవ్‌ 90; బట్లర్‌ (నాటౌట్‌) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్‌ (బి) హర్షిత్‌ రాణా 0; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–44–1, మొయిన్‌ అలీ 3–0–27–0, హర్షిత్‌ రాణా 4–0–45–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–33–0, నరైన్‌ 4–0–36–0, రసెల్‌ 1–0–13–1. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 1; నరైన్‌ (సి) తెవాటియా (బి) రషీద్‌ 17; రహానే (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) సుందర్‌ 50; వెంకటేశ్‌ (సి) సుందర్‌ (బి) సాయి కిషోర్‌ 14; రింకూ సింగ్‌ (సి) గిల్‌ (బి) ఇషాంత్‌ 17; రసెల్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 21; రమణ్‌దీప్‌ (సి అండ్‌ బి) ప్రసిధ్‌ కృష్ణ 1; మొయిన్‌ అలీ (సి) షారుఖ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్‌) 27; హర్షిత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–32–1, ఇషాంత్‌ 2–0–18–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–25–2, రషీద్‌ ఖాన్‌ 4–0–25–2, సుందర్‌ 3–0–36–1, సాయి కిషోర్‌ 3–0–19–1.

Sakshi Editorial On Maharashtra govt Hindi Language Mandatory10
ఈసారి ‘మహా’ వంతు!

ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్‌ దాన్ని తప్పుబట్టారు. అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్‌ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది. సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్‌ఎస్‌ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్‌ఎస్‌ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్‌నాథ్‌ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.తమిళనాడులో స్టాలిన్‌ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్‌ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్‌ ఠాక్రే ఎంఎన్‌ఎస్‌ స్థాపించారు. మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్‌ ఠాక్రేకు కలిసిరాలేదు. ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్‌ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్‌ వాదన. తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్‌ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement