
గంజాయి, సారా నిర్మూలనపై దృష్టి పెట్టాలి
హుకుంపేట: మండలంలో గంజాయి, సారాను నిర్మూలించేందుకు దృష్టి పెట్టాలని డీఎస్పీ షెహ్‌బాజ్ అహ్మద్ ఆదేశించా రు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, మండలంలో జరుగుతున్న నేరాలు,మత్తు పదార్థాల రవాణా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, సారా రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
డీఎస్పీ సహబాజ్ అహ్మద్