
హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‌డేట్స్
భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
- పబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వం
- రెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లు
- పెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్
‘తల్లికి వందనం’కి నిధులు కోత
- బడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు
- 12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరం
- గత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వం
దీపం పథకానికి భారీగా కోత
- కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపు
- బడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపు
అన్నదాత సుఖీభవకు భారీ కోత
- అన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపు
- రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ
- 10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు
👉 మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగం
- రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
- వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
- బీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లు
- పాఠశాల విద్యకు 31, 806 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు
- పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లు
- పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయింపు
- సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
- జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు
- ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
- రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది
- 1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయి
- కూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాం
- రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది
- అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది
- 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ అంచనా
- మూలధన వ్యయం రూ.40, 635 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
- ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
- శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర
👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 2025-26
👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్
👉శాసనసభలో ఏపీ బడ్జెట్ 2025 ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
👉 ఏపీ బడ్జెట్ 2025కు కేబినెట్ ఆమోదం
👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్‌లో మంత్రివర్గం సమావేశం
👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రులు
👉 సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
బడ్జెట్.. ఎక్కడ.. ఎవరు?
👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.
వాట్ ఎబౌట్ సూపర్ సిక్స్?
👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..
👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం
👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు
👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.
కేటాయింపులైతే చేసేద్దాం!
👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది.
👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం.
👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం.
👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు.