
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు.
షెడ్యూల్ ఇలా...
10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1(కాంపోజిట్ కోర్సు), 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లిషు, 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 15న గణితం, 17న భౌతిక శాస్త్రం, 18న జీవ శాస్త్రం, 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ), 20న సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనుంది.