‘మిచౌంగ్‌’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది | Cyclone Michaung Crossed The Coast Near Bapatla | Sakshi
Sakshi News home page

‘మిచౌంగ్‌’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది

Published Tue, Dec 5 2023 4:39 PM | Last Updated on Tue, Dec 5 2023 5:08 PM

Cyclone Michaung Crossed The Coast Near Bapatla - Sakshi

మిచౌంగ్‌ తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడుతూ, ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది.

సాక్షి, అమరావతి: మిచౌంగ్‌ తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడుతూ, ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది.

తీరం  వెంబడి గంటకు 100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, వాహనాలు ధ్వంసం అయ్యాయి. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ.. 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిపడుతున్న అలలు, భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ శాఖ 4 కోట్ల మంది సెల్‌ఫోన్లకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపింది.

25 మండలాలు, 54 గ్రామాలు, 2 పట్టణాలపై తుపాను అధిక ప్రభావం చూపింది. జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. 10 వేల మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తుపాను సహాయ చర్యల కోసం 11 జిల్లాలకు రూ.20 వేల కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. 36 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల్లో పలు చోట్ల వరిపంట, అరటి తోటలు నేలకొరిగాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement