డాక్టర్‌ వైఎస్సార్‌ ఎఫ్‌యూకు 2(ఎఫ్‌) గుర్తింపు | Dr YSR University of Architecture and Fine Arts received 2 F recognition | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ వైఎస్సార్‌ ఎఫ్‌యూకు 2(ఎఫ్‌) గుర్తింపు

Published Thu, Jul 1 2021 4:31 AM | Last Updated on Thu, Jul 1 2021 4:31 AM

Dr YSR University of Architecture and Fine Arts received 2 F recognition - Sakshi

ఏఎఫ్‌యూ (వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్‌ జిల్లా కడపలో గతేడాది ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 2(ఎఫ్‌) గుర్తింపు లభించింది. ఈ మేరకు యూజీసీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ పరిధిలోని విశ్వవిద్యాలయాల జాబితాలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీకి చోటు దక్కినట్లయింది. దీంతో విశ్వవిద్యాలయం జారీ చేసే సర్టిఫికెట్లకు యూజీసీ గుర్తింపు దక్కనుంది.

యూనివర్సిటీలో పరిశోధనలు, ప్రాజెక్టులు నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుంది. వర్సిటీ ఏర్పాటైన ఏడాదికే యూజీసీ నుంచి 2(ఎఫ్‌) గుర్తింపు లభించడంపై వీసీ ఆచార్య దురైరాజ్‌ విజయ్‌కిశోర్, రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ.సి.సురేంద్రనాథ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement