
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. బెంగళూరు నుంచి విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్‌కు డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం భువనేశ్వర్‌కు దారి మళ్లించారు.
దారి మళ్లించిన విమానాల వివరాలు..
- 6E 581/881 VOMM - VTZ - VOMM (Chennai - Vizag - Chennai) ETA 0615 (1145 IST)
- 6E 7064/7063 VOTP -VTZ - VOTP (Tirupati - Vizag - Tirupati) ETA 0840 (1410 IST)
- 6E 917/6089 VOMM - VTZ- VOMM (Chennai - Vizag - Chennai) ETA1140 (1710 IST) are cancelled for the day