
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్ది దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07031) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది.
రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌ల్లో ఆగుతుంది. అలాగే, చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌ల్లో ఆగుతుంది.
విజయవాడ మీదుగా పలు రైళ్లు రద్దు
కడియం–ద్వారపూడి–అనపర్తి సెక్షన్‌ల్లో జరుగుతోన్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మార్చి 1, 2 తేదీల్లో గుంటూరు–విశాఖ (17239/17240), మార్చి 2న విశాఖ–గుంటూరు (22701/22702), విశాఖ–లింగంపల్లి (12805), 3న లింగంపల్లి–విశాఖ (12806) రైళ్లను రద్దు చేసింది.