
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని నూజివీడు–వట్లూరు సెక్షన్‌లో జరుగుతోన్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం తెలిపారు.
ఈ నెల 7, 8, 11, 12 తేదీల్లో ధన్‌బాద్–అలప్పుజ (13351), 7న టాటా–యశ్వంత్‌పూర్ (18111), సంత్రగచ్చి–సనత్‌నగర్ (07070), 8, 13 తేదీల్లో విశాఖ–విజయవాడ (08567), 8న టాటా–బెంగళూరు (12889), 11న హతియా–యర్నాకుళం (22837),12న హతియా–బెంగళూరు (12835) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు.