
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 38,910 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్ ఉంటుంది. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంటవరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్ http://slprb.ap.gov. in సందర్శించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.