
చోడవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీనివాసరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
సాక్షి, విశాఖపట్నం: చోడవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీనివాసరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, గంధవరం నుంచి చోడవరానికి యువకులు భారీ ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో జై విశాఖ అంటూ శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాసరావును కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.