
సాక్షి, తాడేపల్లి: పొట్టి శ్రీరాములు జయంతి ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/Af7J8ai5MN
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2025