
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు ఊరట దక్కింది. కూటమి ప్రభుత్వం ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.