
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.సప్తమి ప.2.09 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.7.35 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.3.45 నుండి 5.23 వరకు, దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.23 వరకు, అమృత ఘడియలు: రా.1.33 నుండి 3.11 వరకు, భాను సప్తమి.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: బాకీలు వసూలవుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగయోగం.
సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
వృశ్చికం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.
మకరం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.