
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: శు.పాడ్యమి రా.10.56 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: భరణి రా.11.28 వరకు, తదుపరి కృత్తిక; వర్జ్యం: ప.10.04 నుండి 11.33 వరకు; దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు; అమృత ఘడియలు: సా.6.58 నుండి 8.30 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.40; సూర్యాస్తమయం 6.14
మేషం...రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం...కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.
మిథునం...వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కర్కాటకం...పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం...అపరిమితమైన ఖర్చులు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. శ్రమ తప్పదు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య...రుణబాధలు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. సాహసకృత్యాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
తుల....పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వేగవంతంగా సాగుతాయి.
వృశ్చికం....సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
దనుస్సు...ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మకరం....కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒత్తిడులకు లోనవుతారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం....కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం....కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.