ముడుపుల పే..కాట! | - | Sakshi
Sakshi News home page

ముడుపుల పే..కాట!

Published Thu, Apr 17 2025 1:51 AM | Last Updated on Thu, Apr 17 2025 1:53 AM

బాపట్ల
గుణదలకు క్రైస్తవుల పాదయాత్రదుగ్గిరాల: ఆర్‌సీఎం మత పెద్దలు, దీక్ష తీసుకున్న క్రైస్తవులు బుధవారం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి డాక్టర్‌ సురేష్‌ యామర్తి ఆధ్వర్యాన పాదయాత్ర చేశారు.

సంకటహర చతుర్థి పూజలు

అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరుడి ఉపాలయంలో బుధవారం సంకట హర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు శేషసాయిశర్మ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 515.00 అడుగుల వద్ద ఉంది. ఇది 140.3150 టీఎంసీలకు సమానం.

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

రేపల్లె రూరల్‌: నియోజకవర్గ ప్రజలకు జూదాన్ని అలవాటు చేసిందే టీడీపీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందేలు, పేకాట, గుండాట, కోత ముక్క.. ఇలా జూద క్రీడలను బహిరంగంగా నిర్వహించిన ఘనత కూడా తమ్ముళ్లదేనని ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రావడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని నగరం, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పై పందేలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా పేకాట కేంద్రాలకు నిలయంగా నగరం మండలం మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

తమ్ముళ్ల అడ్డాలు ఇవే..

● మండలంలోని ఏలేటిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెలమవారిపాలెం శివారులో టీడీపీ నేతకు చెందిన ఇంట్లో పెద్ద జూద కేంద్రాన్ని (పేకాట క్లబ్‌) ఏర్పాటు చేశారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి పేకాటరాయుళ్లు వస్తున్నారు. నిత్యం రూ. కోట్లలో పందేలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా కాయిన్స్‌తో పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు.

● వెలమవారిపాలెంలోని సపోటా తోటల్లోనూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో జోరుగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ బహిరంగంగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు కనీసం తనిఖీలు జరగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పేకాట కేంద్ర నిర్వాహకులు ఎలా లాబీయింగ్‌ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనంగా ప్రజలు చెబుతున్నారు.

● గత నెల రోజులుగా ధూళిపూడి పాత సినిమా హాలును అడ్డాగా చేసుకుని పేకాట కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇటీవల వేమూరు నియోజకవర్గంలో డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు రైడింగ్‌ చేసి పేకాట కేంద్రాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మాత్రం తనిఖీలు చేసిన పాపాన కూడా పోలేదు. దీనిపై ప్రజలు బహిరంగంగా విమర్శలు కురిపిస్తున్నారు.

పేకాటకు అడ్డాగా మారిన ధూళిపూడి పాత సినిమా హాలు

7

న్యూస్‌రీల్‌

పచ్చ నేతకు భారీగా ముడుపులు

నియోజకవర్గంలో పేకాట కేంద్రాలపై పోలీసులు రైడింగ్‌ చేయకుండా పచ్చ పార్టీలోని ముఖ్య నేతకు ఆయా పేకాట కేంద్రాల నిర్వాహుకులు భారీ స్థాయిలో ముడుపులు సమర్పించుకుంటున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నగరం మండలంలోని వెలమవారిపాలెంలో పేకాట కేంద్రం నుంచి రోజుకు రూ.లక్షల్లో ముడుపులు అందిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పేకాట కేంద్రాలపై దాడులు జరగకుండా ఈ ముఖ్య నేత అడ్డుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పేకాట కేంద్రాలపై దాడులు నిర్వహించాలని, జూదాన్ని పూర్తిస్తాయి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నగరం మండలంలో

అతిపెద్ద పేకాట క్లబ్‌

వెలమవారిపాలెం కేంద్రంగా

చేతులు మారుతున్న రూ.కోట్లు

దాడులు జరగకుండా టీడీపీ

ముఖ్య నేతకు భారీగా ముడుపులు

పేకాట కేంద్రాల వైపు

కన్నెత్తి చూడని పోలీసు అధికారులు

వెంటనే తగిన చర్యలు చేపట్టాలని

కోరుతున్న ప్రజలు

ముడుపుల పే..కాట! 1
1/6

ముడుపుల పే..కాట!

ముడుపుల పే..కాట! 2
2/6

ముడుపుల పే..కాట!

ముడుపుల పే..కాట! 3
3/6

ముడుపుల పే..కాట!

ముడుపుల పే..కాట! 4
4/6

ముడుపుల పే..కాట!

ముడుపుల పే..కాట! 5
5/6

ముడుపుల పే..కాట!

ముడుపుల పే..కాట! 6
6/6

ముడుపుల పే..కాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement