Top Stories
ప్రధాన వార్తలు

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.

ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్ అందించడంతో పాటు.. ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్.

ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)

ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రాహుల్.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్.. రాహుల్ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగలరు.అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడం సహా.. వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్ ఫోర్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్

భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.

‘కేసీఆర్.. మేం అనుకుంటే మీ కంటే డబుల్ మీటింగ్ పెడతాం’
నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి. నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అంటున్నాడు. సోనియా గాంధీ కాలు మొక్కాడు కేసీఆర్. కేసీఆర్ నీది నోరా.. మోరీనా?, తెలంగాణను మొత్తం దోచుకుతిన్నారు. దళితుడిని సీఎం చేస్తానని , మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా ?, కేసీఆర్.. మేం అనుకుంటే నల్గగొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం. ధరణితో ఏం మోసాలు చేశారో అన్నీ బయటపడతాయి’ అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.తెలంగాణ.. బీఆర్ఎస్ సొంతం కాదుఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. ‘వందల కోట్ల అవినీతి సొమ్ముతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు. నిన్ను ఫాంహౌస్ కు ఎందుకు పరిమితం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. దమ్ముంటే రా.మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెప్తున్నాం. వెయ్యి జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో రైతులకు మేలు జరగలేదు. బీఆర్ఎస్ ఆగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు. తెలంగాణ కోసం కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు. నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!
సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్ జాతీయులను వారి దేశానికి పంపించింది.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x— ANI (@ANI) April 28, 2025మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే పాక్.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్‌లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్‌కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్లో ఉండి, మరికొందరు కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.పాక్‌కు సైనిక విమానాలు..పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్‌లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ కూడా అలర్ట్ అయ్యింది.

అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!

పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు
లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్ విషాదంపై కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది.
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా రికార్డు
ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
రాజమౌళి చేతుల మీదుగా 'ముత్తయ్య' ట్రైలర్ రిలీజ్
హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బంగారం భారీగా పడిపోతుంది!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ఇంట్లో పాముల కలకలం
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
మళ్లీ ఉగ్ర కాండ!
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తీరంలో తూటా.. సీటీలో బాంబు
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
3 నిమిషాలకో మరణం
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్‌కే: కృనాల్ పాండ్యా
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
కేఎల్ రాహుల్‌పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
మూసివేత దిశగా ఫైబర్‌నెట్!
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
హైదరాబాద్‌లో హై అలర్ట్
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా రికార్డు
ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
రాజమౌళి చేతుల మీదుగా 'ముత్తయ్య' ట్రైలర్ రిలీజ్
హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బంగారం భారీగా పడిపోతుంది!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ఇంట్లో పాముల కలకలం
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
మళ్లీ ఉగ్ర కాండ!
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తీరంలో తూటా.. సీటీలో బాంబు
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
3 నిమిషాలకో మరణం
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్‌కే: కృనాల్ పాండ్యా
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
కేఎల్ రాహుల్‌పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
మూసివేత దిశగా ఫైబర్‌నెట్!
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
హైదరాబాద్‌లో హై అలర్ట్
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
సినిమా

శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా
తెలుగు హీరోల్లో శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ అలరిస్తుంటాడు. గతేడాది 'స్వాగ్' అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది జనాలకు నచ్చలేదు. దీంతో తనకు అచ్చొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'సింగిల్'.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) మే 9న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. సింగిల్ గా ఉండే శ్రీ విష్ణు జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. తర్వాత వాళ్లతో ప్రేమ, రొమాన్స్, గొడవలు.. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ బాగుంది. జోకులు బాగానే పేలాయి. చూస్తుంటే శ్రీ విష్ణు మరో హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. రీసెంట్ గా వైరల్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఈ సినిమాలోనూ నటించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించగా.. కార్తీక్ రాజ్ దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?)

జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బుల్లితెర నటి దీపికా రంగరాజు (Deepika Rangaraju).. ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంది. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. లోపల ఎంత బాధ ఉన్నా అది పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడుతుంది. అలాంటిది మొదటిసారి దీపిక తన కష్టాలను బయటపెట్టింది. ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో దీపిక మాట్లాడుతూ.. మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్లుండాలి. ముఖ్యంగా అమ్మానాన్న మన వెనకాల నిలబడాలి. స్నేహితులు, దగ్గరివాళ్లు.. ఇలా ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్లుండాలి. కానీ, అలా నాకంటూ ఎవరూ లేరు.అలాగైతే సంతోషిస్తారుఇప్పటికిప్పుడు నేను యాక్టింగ్ మానేసి ఇంట్లో ఉంటాను, చదువుకుంటాను, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను లేదా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్తే అమ్మవాళ్లు చాలా సంతోషిస్తారు. ఇంట్లో కూర్చుని బాగా చదువుకో అని నాకు స్వాగతం పలుకుతారు. యాక్టింగ్ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ.. నాకు సపోర్ట్‌గా నిలబడలేదు. వావ్, సూపర్ దీపికా.. చాలా బాగా చేస్తున్నావ్, రెండేళ్లలో చాలా పాపులారిటీ వచ్చింది. ఒంటరి ప్రయాణంఇంకా బాగా చేయు అని ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంకా ఎదుగుతాను. కానీ ఇప్పుడు నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు అది బోర్ కొడుతుంది. ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే మోటివేషన్ చేసుకుని ముందుకెళ్లాలా? అని బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా.. బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తోంది.చదవండి: నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి

ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?
ఇప్పుడంటే కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సినిమాలు-సిరీస్ లని అని తెగ చూసేశారు. ఆ టైంలో కొన్ని మూవీస్, సిరీసులు.. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటే 'పంచాయత్'. ఇప్పుడు దీన్ని తీసిన మేకర్స్ నుంచి మరో సిరీస్ రాబోతుంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకొంటే.. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు, మారుమూల పల్లెటూరికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఇక్కడ వాతావరణం, మనుషులు, పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే కథ. సున్నితమైన హాస్యం, పల్లె వాతావరణంలో తీసిన ఈ సిరీస్ 2020లో రిలీజై సూపర్ హిట్ అయింది. తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు.. 'గ్రామ చికిత్సాలయ' అనే సిరీస్ ప్రకటించారు. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ వెల్లడించారు. ఓ పల్లెటూరిలో చిన్న హాస్పిటల్, అందులో ఉండే డాక్టర్.. దీని బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తుంది. ఇందులోనూ ఫన్ తగ్గదని తెలుస్తోంది.అయితే పంచాయత్ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. దీన్ని తెలుగులో 'సివరపల్లి' పేరుతోనూ రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు గ్రామ చికిత్సాలయ సిరీస్ తో వస్తున్నారు. మరి ఈసారి కూడా కంటెంట్ తో మ్యాజిక్ చేసి హిట్ కొడతారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) 📢 BHATKANDI jaane ke liye taiyaar ho jaiye 📢#GramChikitsalayOnPrime, New Series, May 9 pic.twitter.com/7L7TeBFoC5— prime video IN (@PrimeVideoIN) April 28, 2025

అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్‌లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్‌నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్‌గా కోలీవుడ్‌లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు
క్రీడలు

ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రాహుల్.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్.. రాహుల్ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగలరు.అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడం సహా.. వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్ ఫోర్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్

మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్‌నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్

IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం (టైటిల్ సాధించడం) చేస్తున్న వ్యక్తుల్లో భువనేశ్వర్ కుమార్ ముఖ్యుడు. ఈ సీజన్లో భువీ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.తాజాగా (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడమే (4 ఓవర్లలో 33 పరుగులు) కాకుండా 3 వికెట్లు తీసి ఆర్సీబీ గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఓ ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూశ్ చావ్లాను (192) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం భువీ ఖాతాలో 193 వికెట్లు (185 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 169 మ్యాచ్‌ల్లో 214 వికెట్లు తీసి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లుయుజ్వేంద్ర చహల్- 214భువనేశ్వర్ కుమార్- 193పియూశ్ చావ్లా- 192సునీల్ నరైన్- 187రవిచంద్రన్ అశ్విన్- 185ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భువీ ప్రదర్శనలు..సీఎస్కేపై 1/20 (ఆర్సీబీ గెలుపు)గుజరాత్‌పై 1/23 (ఆర్సీబీ ఓటమి)ముంబై ఇండియన్స్‌పై 1/48 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్‌పై 2/26 (ఆర్సీబీ ఓటమి)రాజస్థాన్ రాయల్స్‌పై 1/32 (ఆర్సీబీ గెలుపు)పంజాబ్ కింగ్స్‌పై 2/26 (ఆర్సీబీ ఓటమి)పంజాబ్ కింగ్స్‌పై 0/26 (ఆర్సీబీ గెలుపు)రాజస్థాన్ రాయల్స్‌పై 1/50 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3/33 (ఆర్సీబీ గెలుపు)35 ఏళ్ల భువీ ఆర్సీబీకి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్ తరఫున విశేషంగా రాణించిన భువీ.. ఆ ఫ్రాంచైజీ తరఫున 157 వికెట్లు తీశాడు. మధ్యలో రెండు సీజన్లు పుణేకు ఆడి 31 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతూ 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. భువీ తన ఐపీఎల్ కెరీర్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ (సీజన్లో అత్యధిక వికెట్లు) హోల్డర్‌గా నిలిచాడు. 2016, 20167 సీజన్ల వరుసగా ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో కేవలం డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ మాత్రమే రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించారు.నిన్న జరిగిన ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. భువీతో పాటు హాజిల్‌వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 162 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) ఈ జట్టు సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్‌రైజర్స్, కేకేఆర్‌లను బెంగళూరులో ఎదుర్కొంటుంది.

వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్‌ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
బిజినెస్

భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..
భారత్‌లో గడిచిన దశాబ్దకాలంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ రిపోర్ట్‌లో పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. 2017 పీపీపీ(పర్చేజింగ్ పవర్ పారీటీ-కొనుగోలు శక్తి సమానత్వ సూచీ) నిబంధనల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు ‘తీవ్ర పేదరికం’లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఆ సూచీని భారత్ గణనీయంగా అధిగమించినట్లు నివేదిక తెలుపుతుంది. 2011-12లో 16.2%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 2.3%కు పడిపోయిందని పేర్కొంది. ఈ మార్పు 17.1 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి దూరం చేసింది.పేదరిక నిర్మూలనకు కొన్ని ప్రధాన కారణాలుదేశంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను విస్తృతంగా పంపిణీ చేయడం వంటి ఆహార భద్రత కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (డీబీటీలు) ద్వారా ప్రజలకు సహాయం అందింది. 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను గృహ వినియోగదారుల వ్యయ సర్వేల్లో (హెచ్సీఈఎస్) ఉపయోగించిన కొత్త పద్ధతులు పేదరిక గణాంకాలను మరింత కచ్చితంగా తెలియజేశాయి.తీవ్ర పేదరికానికి అతీతంగా..తక్కువ, మధ్య ఆదాయ దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు రోజుకు 3.65 డాలర్ల (పీపీపీ) సంపాదనను బెంచ్‌మార్క్‌గా తీసుకుంటారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్‌లో 2011-12లో 61.8 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 28.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దంలో 37.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.అసమానతలు..వినియోగ ఆధారిత అసమానతలు తగ్గినప్పటికీ, దేశంలో ఆదాయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023-24లో సంపాదనలో దిగువన ఉన్న 10% ప్రజల కంటే టాప్‌లో నిలిచిన 10% మంది 13 రెట్లు అధికంగా సొమ్ము కూడగట్టుకున్నారు. పట్టణ-గ్రామీణ వినియోగంలో వ్యత్యాసం 2011-12లో 84% నుంచి 2023-24 నాటికి 70%కి తగ్గింది. అయినప్పటికీ గణనీయమైన అసమానతలు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరికాన్ని కట్టడి చేసేందుకు ‘ఉచితాలు’ లేదా సంక్షేమ పథకాల్లోని అంశాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?పరిష్కారాలుదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆర్థిక అసమానతల మూల కారణాలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి ప్రకారం.. తయారీ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పరిశ్రమలను ప్రోత్సహించి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రుణాలు, సబ్సిడీలు, టెక్నాలజీ అప్గ్రేడ్ల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ) మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విద్యను విస్తరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం వ్యక్తులకు తగిన నైపుణ్యాలు అందించాలి. శిశుసంరక్షణ సౌకర్యాలు, సురక్షితమైన పనివాతావరణాలు, ఆర్థిక స్వాతంత్ర్య కార్యక్రమాలను అందించడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.

ఇదిగో ఇన్వెస్ట్మెంట్కూ ఇదే సూత్రం..
మీరో రోడ్ ట్రిప్‌కు బైల్దేరారు. కారు విండోలు కిందికి దించి, స్వేచ్ఛగా, ఝామ్మంటూ, జోరుగా దూసుకెళ్తున్నారు. దారిలో ఏ అడ్డంకి వచ్చినా దాటేయగలను అనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. కానీ, ఇంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోతగా వాన మొదలైంది. ముందేమీ సరిగ్గా కనిపించడం లేదు. కారు పట్టు తప్పిపోతోంది. అప్పటిదాకా థ్రిల్లింగ్ అనిపించిన జర్నీ కాస్తా, ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకున్నంత స్థాయిలో రిస్కులను ఎదుర్కొనేంత సన్నద్ధత మీకు లేదేమోనని. ఇదిగో, పెట్టుబడులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్లకు తాము చాలా రిస్కు తీసుకోగలమనో లేదా ఒక మోస్తరుగా తీసుకోగలమనో తమ తమ రిస్కు సామర్థ్యాల విషయంలో ఒక భావన ఉంటుంది. కానీ వాస్తవ ప్రపంచంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ ధీమాను విపరీతంగా పరీక్షిస్తాయి. మార్కెట్లో ఒడిదుడుకులను ఆచరణలో ఎదుర్కొనడమనేది థియరీలో చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ఇలా, మనకు ఉన్నాయనుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవంగా ఉన్న సామర్థ్యాలకు మధ్య వైరుధ్యం నెలకొన్నప్పుడు, భావోద్వేగాలకు లోనై, నిర్ణయాలు తీసుకుంటాం.కంగారుపడిపోయి, ముందుగానే తప్పుకుంటాం లేదా సామర్థ్యానికి మించి మరింత రిస్కు తీసుకుంటాం. ఊహించుకుంటున్న సామర్థ్యాలకు, వాస్తవ సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసాన్ని ముందుగానే గుర్తించి, క్రియాశీలకంగా చక్కదిద్దుకుంటే సంపద సృష్టికి దోహదపడుతుంది. లేకపోతే సంపద నాశనానికి దారితీస్తుంది. మరికొందరు ఇన్వెస్టర్లు, మరింత ఎక్కువగా రిస్కులు తీసుకోగలిగినప్పటికీ, తమకు అంత సామర్థ్యం లేదని భావిస్తుంటారు. ఇలా మరీ మెతక వైఖరి వల్ల వృద్ధి అవకాశాలను కోల్పోతుంటారు. అవగాహన ఉండాలి.. రిస్కు సామర్థ్యం అనేది ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యవధి, వ్యక్తిత్వాన్ని బట్టి ఇన్వెస్టరు ఏ స్థాయిలో రిస్కును తీసుకోగలుగుతారనేది చూచాయగా తెలియజేస్తుంది. ఇక రిస్క్ సహనశీలత అనేది, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇన్వెస్టరు వాస్తవంగా – ఇటు భావోద్వేగాలపరంగా అటు ఆర్థికంగా – ఎంత వరకు రిస్కు తీసుకుంటారనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈక్విటీల విషయంలో తాను ఎంతైనా రిస్కు తీసుకోగలనని ఓ ఇన్వెస్టరు అనుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమవుతున్నప్పుడు కంగారుపడిపోయి, అమ్మేయొచ్చు. అంటే, తాము రిస్కుల విషయంలో ముందుగా ఊహించుకున్న దానికన్నా సహనశీలత చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలా ఊహించుకునే దానికి, వాస్తవానికి మధ్య ఉండే వ్యత్యాసం వల్ల భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులవుతాయి. రిస్కులపై భ్రమలు.. మనం ఊహించుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసాలకు చాలా కారణాలే ఉంటాయి: మార్కెట్ పరిస్థితులు: బుల్ మార్కెట్లు మనకు ఆత్మవిశ్వాసం ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. మరోవైపు, మార్కెట్లు పతనమైనప్పుడు తీవ్రమైన భయం వేస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు, ముందూ వెనుకా ఆలోచించకుండా తమ రిస్కు సామర్థ్యాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అనుభవం: మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు, మార్కెట్ల పతనాన్ని తొలిసారి చవిచూసే వరకు తాము ఎలాంటి రిస్కులనైనా ఎదుర్కొనగలమనే భావనలో ఉండొచ్చు. కానీ అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు మాత్రమే వాస్తవిక దృక్కోణం ఉంటుంది. భావోద్వేగాలపరమైన పక్షపాత ధోరణులు: నష్టాన్ని అస్సలు ఇష్టపడకపోయే ధోరణి ఉంటే, లాభాలు ఎంత వచ్చినా గానీ కాస్తంత నష్టం వస్తే చాలా కష్టంగా అనిపించేలా చేస్తుంది. అలాగే, ఇటీవలి కాలంలో కనిపించిన ధోరణుల వైపు మొగ్గు చూపే ఆలోచన విధానం ఉంటే, మార్కెట్లు స్వల్పకాలిక ఒడిదుడుకులకు లోనైనా ఇన్వెస్టర్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తుతుంది. గుంపును అనుసరించి ముందుకెళ్లే ధోరణి, ఇన్వెస్టర్లు తమకు అనువు కాని రిస్కులను తీసుకునేలా ప్రేరేపిస్తుంది. జీవితంలో మార్పులు: యువ ప్రొఫెషనల్స్‌కు కాస్తంత రిస్కులు తీసుకునే సామర్థ్యాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్కు దగ్గరవుతుండటంలాంటి పరిస్థితుల కారణంగా ప్రాధాన్యతలు మారొచ్చు. దానికి అనుగుణంగానే రిస్క్ సామర్థ్యాలూ మారొచ్చు. కాలవ్యవధిపై భ్రమలు: పెట్టుబడులు మొదలెట్టినప్పుడు తమకు బోలెడంత సమయం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కానీ స్వల్పకాలికంగా నష్టాలు ఎదురైనప్పుడు, అసలు సమయమే లేదనే రీతిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సామర్థ్యాలకు తగ్గట్లుగా పెట్టుబడులు.. ఇన్వెస్టర్లు తమ వాస్తవిక రిస్కు సామర్థ్యాల గురించి అర్థం చేసుకున్న తర్వాత, తదనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సరి చేసుకోవడం చాలా కీలకం. ఈక్విటీలు, ఫిక్సిడ్ ఇన్‌కం, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటిస్తే, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఉపయోగపడతాయి. జీవితంలోని దశలు, మార్కెట్ పరిస్థితులను బట్టి రిస్క్ సామర్థ్యాలు మారిపోతుంటాయి కాబట్టి, మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ ఉండాలి.క్రమం తప్పకుండా రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే రిస్కులకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను పొందేందుకు సాధ్యపడుతుంది. ప్రొఫెషనల్ సలహాలను తీసుకుంటే మనకు అనువైన వ్యూహాలను అమలు చేసేందుకు వీలవుతుంది. పెట్టుబడులు విజయవంతం కావాలంటే మనపై మనకు అవగాహన ఉండటం ముఖ్యం. తప్పుగా అంచనా వేసుకుంటే, భావోద్వేగాలపరమైన నిర్ణయాలతో అంతిమంగా ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతాయి. క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ ఉండటం, క్రమశిక్షణతో పెట్టుబడులు, సమతుల్యమైన వ్యూహాలు వంటి అంశాలు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి.ఎలా గుర్తించాలి.. వాస్తవిక రిస్క్ సామర్థ్యాలను అర్ధం చేసుకోవాలంటే గతంలో చేసిన పెట్టుబడుల ధోరణులను ఒకసారి విశ్లేషించుకోవాలి. మార్కెట్లు పతనమైనప్పుడు కూడా పెట్టుబడులను కొనసాగించారా లేదా కంగారు పడిపోయి, నిష్క్రమించారా? అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆదాయ స్థిరత్వం, పెట్టుబడుల కాలవ్యవధి, ఒడిదుడుకుల విషయంలో భావోద్వేగాలపరమైన స్పందన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే రిస్క్ ప్రొఫైలింగ్ సాధనాలు ఇందులో కాస్త సహాయపడగలవు. ఇక అసెట్లకు జరిపే కేటాయింపులు కూడా మనం ఎంతవరకు రిస్కులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తుంది.ఉదాహరణకు పెట్టుబడుల విషయంలో చాలా దూకుడుగా, చురుగ్గా ఉంటాననుకునే వ్యక్తి ఎక్కువగా ఫిక్సిడ్ ఇన్‌కం అసెట్స్వైపే మొగ్గు చూపుతున్నారంటే, తాము ఊహించుకుంటున్న దానికన్నా వారి రిస్క్ సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. పెట్టుబడుల కాలవ్యవధి, ఆర్థిక లక్ష్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలు ఉన్న వారితో పోలిస్తే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా కాస్తంత ఎక్కువ రిస్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న స్ట్రెస్ టెస్టుతో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో 20 శాతం పడిపోయినా ఎలాంటి మార్పులు, చేర్పులూ చేయకుండా ఓర్చుకోగలమా అనే చిన్న ప్రశ్న వేసుకుంటే మన రిస్క్ సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి.- రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ – రిటైల్ సేల్స్, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్

ఈ-అంబులెన్స్‌ల తయారీలో జాప్యం.. కారణం..
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్‌లు రోడెక్కేందుకు మరింత సమయం పట్టనుంది. 2024 సెప్టెంబర్‌లో ఈ-అంబులెన్స్‌ల కోసం రూ.500 కోట్ల కేటాయించారు. ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది ఇప్పటికీ స్పష్టమైన ఫలితాలను ఇవ్వలేదు. పీఎం ఈ-డ్రైవ్ కోసం మొత్తం రూ.10,900 కోట్ల వ్యయం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ-అంబులెన్స్ విభాగంలో ఫోర్స్ మోటార్స్, మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే వీటి తయారీకి ఆసక్తి కనబరిచాయి.కీలక సవాళ్లుపరిమిత తయారీదారుల భాగస్వామ్యం వల్ల ఇప్పటి వరకు తయారీలో పురోగతి లేదనే వాదనలున్నాయి. 2025 మార్చి నాటికి ఈ-అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టుకు కట్టుబడిన మొదటి కంపెనీ ఫోర్స్ మోటార్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాహనాలను పంపిణీ చేయలేదు. మారుతీ సుజుకి ఇండియా తయారీని ప్రారంభించినట్లు తెలిపింది. కానీ సంస్థ ఎండీ హిసాషి టకేచి వాహనాల కచ్చితమైన డెలివరీ సమయాన్ని మాత్రం తెలియజేయలేదు.సబ్సిడీ మార్గదర్శకాల్లో జాప్యంఏఆర్ఏఐ లేదా ఐసీఏటీ వంటి ఏజెన్సీలు వాహనాలకు హోమోలాగేషన్ (పబ్లిక్ రోడ్లపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణిస్తుందనే అధికారిక ఆమోదం) లేకపోవడం వల్ల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీల మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇప్పటివరకు భారత్‌లో సర్టిఫైడ్ ఈ-అంబులెన్స్‌లు లేకపోవడం కూడా భద్రతా మార్గదర్శకాల అమలుకు నిరోధకంగా మారింది.హైబ్రిడ్ అంబులెన్సులుతక్షణ అవసరాలను తీర్చడానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం హైబ్రిడ్ అంబులెన్సులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంది. ఈ హైబ్రిడ్ అంబులెన్స్‌లను వినియోగించేందుకు అన్ని విధాలా సహకరిస్తుంది. అయినప్పటికీ, హైబ్రిడ్ నమూనాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ప్రధానంగా 14,028 ఈ-బస్సులు, 2.05 లక్షల ఈ-త్రీవీలర్ వాహనాలు, 1.10 లక్షల ఈ-రిక్షాలు, 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు, ఇ-ట్రక్కులు, ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?ఈ-బస్సులు, ఈ-టూ వీలర్స్ వంటి విభాగాల్లో పురోగతి ఉన్నప్పటికీ ఈ-అంబులెన్స్‌లు తయారీ ఇంకా ప్రాథమిక ధశలోనే ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ జాప్యాన్ని అంగీకరిస్తున్నారు. కానీ నిబంధనలను ఖరారు చేయడానికి, విజయవంతంగా వాటిని అమలు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తయారీ భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి వీటిని వీలైనంత త్వరగా రోడెక్కించాలని నిపుణులు కోరుతున్నారు.

గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా ఆరో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 28) పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు తగ్గుదలతో 22 క్యారెట్ల నగల బంగారం రూ.90 వేల దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,550ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.630, రూ.620 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరల మార్పునకు కారణాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.900 మేర క్షీణించి రూ.1,11,000 వద్దకు తగ్గింది. అదే ఢిల్లీ ప్రాంతంలో అయితే అత్యధికంగా రూ.1400 తగ్గి రూ. 1,00,500 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ

తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!
వేగం..వేగం..అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్క బెట్టుకోవడం వరకు ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు. ఆహారాన్ని త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల వల్ల అనేక రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాంఅన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా, బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును నిజమే. ఎందుకంటే గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.త్వరగా తినడం వల్ల తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు, గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం.అంతేకాదు ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. చివరగా .. కూటికోసంమే కోటి విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.

కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది.

ఓపెన్ జిమ్: కసరత్తు.. ఆరోగ్యం మా సొత్తు!
జీవనశైలి మారింది. మారుతున్న కాలంతో పాటు జీవనంలో వేగం పెరిగింది. దీంతో అలసట, ఒత్తిడి అధికమైంది. ఆహార పానీయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. వాటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరైంది. అందుకు ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అక్కన్నపేట(హుస్నాబాద్): జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా గ్రామాల్లోనే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో దాదాపు అన్ని గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను నిర్మించారు. వాటి నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు కేటాయించారు. మండలంలో 31 గ్రామాలు ఉండగా ఇటీవల మరో ఆరు గ్రామాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మొత్తం 37 గ్రామాలు ఉన్నాయి. అందులో సగానికిపైగా గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జిమ్‌లను ఉదయం, సాయంత్రం వినియోగించుకొంటున్నామని, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకొన్న మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు చెప్పారు. కొత్త అనుభూతి బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో కసరత్తు చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్తోమతలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో ఫిట్నెస్తో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకొంటున్నారు.

పిలిచిన పలికేవు స్వామి!
స్వామివారి దర్శనం చేసుకుందామని బెంగుళూరుకు చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిరుపతి బయలుదేరాడు. నేరుగా అలిపిరి చేరుకున్నాడు. తల పైకెత్తి శేషాచలం కొండలవైపు చూశాడు. గుండెల్లో దడ మొదలయ్యింది. ‘నేను 3550 మెట్లు ఎక్కగలనా?’ అన్న అనుమానం పట్టుకుంది. ‘ముచ్చట గా మూడు మైళ్లు కూడా నడవలేనే, ఈ పన్నెండు కిలోమీటర్ల దూరం నడవటం నా వల్ల అయ్యే పనేనా’ అని దిక్కులు చూడసాగాడు. అక్కడే ఇద్దరు యువతులు ప్రతి మెట్టుకూ పసుపు కుంకుమలు పెట్టి కర్పూరం వెలిగిస్తూ ఉన్నారు.‘‘మీరు చాలాసార్లు కాలినడకన కొండ ఎక్కినట్లు ఉన్నారు. నేను నడవగలనా?’’అని వారిని అడిగాడు. ‘‘కొంచెం కష్టపడాలి. అక్కడక్కడ కూర్చుని వెళ్ళండి’’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. అయినా అతడికి ధైర్యం రాలేదు. ఎప్పుడో వచ్చిన మోకాళ్ళ నొప్పులు గుర్తుకు తెచ్చుకుని కాలినడక విరమించుకున్నాడు. బస్సుకెళ్దామని నిర్ణయించుకుని పక్కకి తిరిగాడు.అప్పుడే ఓ పండు వృద్ధురాలు కట్టె చేతపెట్టుకుని, నెత్తిన సంచి ఉంచుకొని కొండ ఎక్కడానికి వచ్చింది.ఆ యువ ఇంజినీరు ఆశ్చర్యంగా ‘‘ఇన్ని మెట్లు నువ్వు ఎక్కగలవా అవ్వా?’’ అని అడిగాడు. ఆమె బోసినోటితో ‘‘ఎక్కించే వాడు పైన ఉన్నాడు నాయనా, నన్ను ఎలాగోలా ఎక్కిస్తాడులే’’ అని సమాధానమిచ్చింది.‘‘ఆయన ఎలా ఎక్కిస్తాడు? నువ్వుకదా కొండ ఎక్కాల్సింది!’’ అన్నాడు.‘‘నడవాలని అనుకోవడమే నా వంతు నాయనా. మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకవిధంగా తోడుగా వచ్చి నన్ను కొండ చేరుస్తాడు’’ అని మెట్లు ఎక్కసాగింది. ‘ఈ పెద్దామే ఎక్కుతోందే... మనం ఎందుకు ఎక్కలేము?’ అని మనసులో అనుకున్నాడు. చిన్నగా ఆ అవ్వతో కలిసి నడవటం ప్రారంభించాడు. అక్కడక్కడా నిలుస్తూ అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇద్దరూ కొండపైకి చేరారు.చివరి మెట్టు మీద నిలబడుకొని ఆ యువకుడు ‘‘అవ్వా... మీ దేవుడు వచ్చి నిన్ను కొండ ఎక్కిస్తాడని చెప్పావే... ఎక్కడా కనిపించడేమి?’’ అని కొంచెం వెటకారంగా అడిగాడు. ఆ ముసలామె నవ్వుతూ ‘‘నువ్వు ఎవరనుకున్నావు నాయనా... దేవుడు తోడు చేసి పంపితే వచ్చినవాడివి కదా’’ అని చెప్పి హుషారుగా వైకుంఠం వైపు నడవసాగింది. ‘ఆ’ అని నోరు తెరవడం ఆ యువకుడి వంతు అయ్యింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి:
ఫొటోలు


కొంచెం మస్తీ.. శారీలో మీనాక్షి చౌదరీ (ఫోటోలు)


70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే (ఫొటోలు)


‘సారంగపాణి జాతకం’తో హిట్ కొట్టిన తెలుగు అమ్మాయి రూపా (ఫొటోలు)


‘హిట్ 3’ ప్రీ రిలీజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ (ఫొటోలు)


బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ సైన్యం.. హైలైట్ (ఫొటోలు)


హీరో నిఖిల్ చేతుల మీదుగా నటి అనితా చౌదరి "మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్" ప్రారంభం (ఫొటోలు)


‘సారంగపాణి జాతకం’ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


డాక్టర్ బాబు ఇంట్లో వేడుక.. కొడుక్కి మంగళస్నానం (ఫొటోలు)


అనారోగ్యం నుంచి కోలుకున్న యాంకర్ రష్మీ.. అప్పుడే బాలీ దీవుల్లో చిల్! (ఫొటోలు)
అంతర్జాతీయం

'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
పెహల్గావ్లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహల్గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.రాత్రి 9 తర్వాత వార్ వద్దుభారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. వీడియోలో భయానక దృశ్యాలు
దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలోని షాహిద్ రాజయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పేలుడు కారణంగా బందర్ అబ్బాస్ పోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. ఘటనాస్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా, పేలుడు జరిగిన సమయంలో ఓడరేవులో భారీ సంఖ్యలో కార్మికులు పనిలో ఉన్నారని సమాచారం. మరణాలు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. గాయపడినవారిని హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. More than 500 were injured in a massive explosion at Iranian southern port city of Bandar Abbas. Shahid Rajaei port is a major facility for container shipments in the Islamic Republic of Iran. It handles 80 million tons of goods a year.This happened as the United States and… pic.twitter.com/wT4HznvN2W— John Dawson (@winthewestback) April 26, 2025

పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
లండన్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025
జాతీయం

పాక్ అదుపులోనే బీఎస్ఎఫ్ జవాన్
న్యూఢిల్లీ: ప్రమాదవశాత్తు అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్రేంజర్లకు చిక్కిన భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ ఇంకా విడుదల కాలేదు. ఆయన సరిహద్దు దాటి 90 గంటలు దాటింది. విడిపించేందుకు బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య మూడు దఫాలు సమావేశాలు జరిగాయి. కానిస్టేబుల్‌ను బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ సభ్యుడు పూర్ణం కుమార్ సాహుగా గుర్తించారు. ఆయన స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ. ఆ జవాన్ గురించిన సమాచారం తమ వద్దలేదని పాకిస్తాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన అన్ని యూనిట్లను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. పాక్ రేంజర్లతో మరోసారి ఫీల్డ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించాలని బీఎస్ఎఫ్ కోరింది. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 90 గంటలైనా జవాన్ ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. తమ కుమారుడిని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని షా తండ్రి ప్రభుత్వాన్ని కోరారు. భర్తను తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకునేందుకు జవాన్ పూర్ణం సాహు భార్య రజనీ.. హౌరా నుంచి ఫిరోజ్‌పూర్‌కు బయల్దేరారు.

బంగ్లాదేశ్‌కూ నీళ్లు నిలిపివేయాలి: బీజేపీ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన గంగ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ‘ఆ ఒప్పందం చాలా తప్పు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేసింది’అని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో సంబంధాలున్న దేశాలతో నదీ జలాల పంపకం ఒప్పందాలను యథా ప్రకారం కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ‘పాములకు ఎంతకాలం నీళ్లు అందించాలి? వాటిని నలిపేయాలి’అంటూ దూబే వ్యాఖ్యానించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు.

కస్తూరిరంగన్‌కు తుది వీడ్కోలు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు.

పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది.
ఎన్ఆర్ఐ

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్

రూ.1,000 కోట్లు హాంఫట్
మాటలతో మైమరపిస్తున్నారు.. ఆకాశాన్ని తెచ్చి అరచేతిలో పెడతామని ఆశలు కల్పిస్తున్నారు.. కో అంటే కోట్లు అలా వచ్చి పడతాయని నమ్మబలుకుతున్నారు. వందకి వెయ్యి, లక్షకి పది లక్షలు అంటూ ఆశల గాలం వేస్తున్నారు. ఇలా నరసరావుపేట కేంద్రంగా ఆర్థిక నేరగాళ్లు ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ.1,000 కోట్ల వరకు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. అత్యాశను ఆయుధంగా చేసుకుని సొమ్మంతా లాగేసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా స్కాములు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అడ్డాగా మారుతోంది. సాయి సాధన చిట్‌ఫండ్ స్కామ్, యానిమేషన్ పేరిట వందల కోట్ల రూపాయల వసూలు చేసిన ఘరానా మోసం ఇప్పటికే వెలుగుచూశాయి. ఈ రెండు స్కాంలలో మోసపోయిన బాధితులు నరసరావుపేటలోనే అధికంగా ఉన్నారు. కొత్తగా మరో రెండు గొలుసుకట్టు సంస్థలు ప్రజలను నిండా ముంచేస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. నరసరావుపేట కేంద్రంగా జరిగిన సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం నాలుగు నెలల క్రితం వెలుగు చూసింది. అదే విధంగా యూపిక్స్ యానిమేషన్ స్కాం ఏడు నెలల నుంచి పెట్టుబడిదారులకు డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. డబ్బులు ఇస్తానని నిర్వాహకుడు కొన్ని నెలలుగా మభ్యపెడుతూ వచ్చి, చివరకు పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ఈ రెండు వ్యవహారాల్లో సుమారు రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టి నరసరావుపేట వాసులు నిండా మునిగారు. తాజాగా మరో రెండు గొలుసుకట్టు ఆర్థిక మోసాలు వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వీటిలో నరసరావుపేటవాసులు మరో రూ.200 కోట్ల దాకా పెట్టుబడులుపెట్టినట్టు తెలుస్తోంది. క్రిప్టో పేరుతో కొట్టేశారు! మరోవైపు క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ మరో సంస్థ నరసరావుపేటలో భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. తీరా పెట్టుబడులు పెట్టాక.. ఈ సంస్థలో పెట్టిన కరెన్సీ విలువ అమాంతం పతనమైందని, ఇప్పడు విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదంటూ చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి మరో ఆన్లైన్ కరెన్సీ తెరపైకి వచ్చి కొత్తగా నగదు వసూలు చేస్తున్నారు. మే 21న అంతర్జాతీయ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ అవుతోందంటూ చెప్పుకొస్తున్నారు. ఏమాత్రం గ్యారెంటీ లేని క్రిప్టో కరెన్సీలో రూ.కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని వెనక్కి తెచ్చుకోలేక పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 25 రోజులుగా విత్‌డ్రా నిలిపివేత.. గొలుసుకట్టు ఆర్థిక సంస్థకు సంబంధించి 25 రోజులుగా నగదు ఉపసంహరణ నిలిపివేశారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి రోజూ 1.8 శాతం వడ్డీ రూపంలో ఇస్తారని నమ్మబలికారు. మూడు నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుందని ఆశ చూపించారు. అడిగిన వెంటనే అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడులన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో పెట్టాల్సి ఉండటంతో ఏజెంట్లే నగదును ఎక్స్చేంజ్ చేసి మరీ పెట్టుబడులు పెట్టించారు.దీనికోసం నరసరావుపేటలోని పలు ప్రముఖ రోడ్లలో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా భారీగా నగదుని పెట్టుబడులుగా పెట్టించారు. నగదు నిలిపివేయడంతో పెట్టుబడిదారులు కార్యాలయాల నిర్వహకులు, ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కంపెనీ షట్‌డౌన్ చేసిందని, మరో ప్లాట్‌ఫాంలో త్వరలో కార్యకలాపాలు కొనసాగుతాయని, మీ డబ్బుకు ఢోకాలేదంటూ చెప్పుకొస్తున్నారు.

అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..!
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్‌కుమార్‌రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్‌కుమార్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్‌రింగ్‌రోడ్డు, పులివెందుల టౌన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్‌ఫాల్ చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసుకున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్‌చేసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్‌కుమార్‌రెడ్డి బ్లాక్‌మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్లో పొక్సో, అనంతపురం త్రీటౌన్ పీఎస్‌లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పోలీసుస్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది.

పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు.

అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ


ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది: MLC లేళ్ల అప్పిరెడ్డి


భారత నౌకాదళం అమ్ములపొదిలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు


Pahalgam Incident: పాకిస్థాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్


Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


అది నోరు కాదు.. కోమటిరెడ్డి స్టాంగ్ కౌంటర్


విశాఖలో పాకిస్తాన్ దేశస్తులను గుర్తించిన పోలీసులు


లిక్కర్ కేసులో కుట్రలు తప్ప మరేమీ కనిపించడం లేదు: Manohar Reddy


99 పైసలకే భూమి.. ఉర్సా భూములపై మార్గాని భరత్ షాకింగ్ నిజాలు


డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీపీఎం తీవ్ర స్థాయిలో మండిపాటు