
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శు క్ర వారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం గావించారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
22, 25 తేదీల్లో
టీబీజీకేఎస్ నిరసనలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంట్ వద్ద, 25న జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
ఇప్ప పూల సేకరణ
అశ్వాపురం: మండలంలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు ఇప్ప పూలు సేకరిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం నుంచి వర్షాలు కురిసే వరకు గిరిజన గ్రామాల్లో ఇప్ప పూల సేకరణ సాగుతుంది. తెల్లవారుజామునే అడవుల్లోకి వెళ్లి సేకరించి ఇళ్లకు తెచ్చి ఎండబడతారు. అనంతరం కేజీ రూ.15 నుంచి 20చొప్పున విక్రయిస్తుంటారు. వీరి నుంచి జీసీసీ అధికారులు, కొందరు ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేపడతారు.
వేదగణితంలో
విద్యార్థి ప్రతిభ
అశ్వారావుపేటరూరల్: వేద గణితం శిక్షణలో అశ్వారావుపేటకు చెందిన సిద్ధాంతపు సాత్విక్ సాయికుమారాచార్యులు ప్రతిభ కనబరిచాడు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో గడిచిన ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్‌నెట్ ద్వారా వేద గణితంపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ ముగిశాక పరీక్ష నిర్వహించి, శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. కాగా సాత్విక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ మేరకు సర్టిఫికెట్‌ను వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి, వేదగణితం శిక్షకురాలు జి.సత్య ఈ మెయిల్ ద్వారా పంపించారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన