
ముందు జాగ్రత్త్తే మందు
ఉమ్మడి జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఎండలు
● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం ● వాహనాలు, మొక్కల సంరక్షణా కీలకమే..
●వాహనాల నిర్వహణలో
అప్రమత్తత
జీవన యానంలో వాహనాల వినియోగం కీలకంగా మారింది. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యాన వాహనదారులు జాగ్రత్తలు పాటించాల ని మెకానిక్‌లు సూచిస్తున్నారు. ఖమ్మంకు చెందిన మెకానిక్ ఎం.రామాచారి ఇచ్చిన సూచనలు ఇలా..
●బైక్‌లు, కార్లే కాక ఎలక్ట్రికల్ వాహనాలను ఎండ సమయంలో వినియోగించినప్పుడు టైరు, ట్యూబ్‌లు చూసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ చేయించొద్దు. నిర్ణీత వ్యవధిలో ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు. ఇంజన్ ఎప్పుడూ చల్లగా ఉండేలా ప్రయాణం కొనసాగించాలి. రేడియేటర్ కూలింగ్ తనిఖీ చేసుకోవాలి. బ్యాటరీ వాహనాలు అటు ఫుల్, ఇటు జీరో చార్జింగ్ అయ్యే వరకు చూడొద్దు. పార్కింగ్ సమయాన నీడ ప్రాంతాలనే ఎంచుకోవాలి.
●ఎండతో అనారోగ్యం,
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వీటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ నారగాని రాంప్రసాద్, పీడియాట్రీషియన్ పవన్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అధిక వేడితో చెమట కారణంగా ఒంట్లో నీటిశాతం తగ్గి, లవణాలు బయటకు వెళ్తాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురై తలనొప్పి, స్పృహ కోల్పోవడం, మాట తడబడడం, వికారం, అలసట, కళ్లుతిరగడం, రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. ఎండ ప్రభావం ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులపై పడే అవకాశముంది. వీటి నివారణకు శరీరానికి కావాల్సినంత నీరు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కొబ్బరినీరు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం మంచిది. నిమ్మరసం, ఓఆర్‌ఎస్ ద్రావణాలు తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, ధూమపానానికి దూరంగా ఉండాలి. వడదెబ్బతో అస్వస్థతకు గురైన వారిని చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి తల నుంచి కాళ్ల వరకు తడిగుడ్డతో తుడవాలి. గాలి అడేలా చూస్తూ తేరుకున్నాక ఓఆర్‌ఎస్ తాగించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. వీటన్నింటికి మించి ఉదయం 11 నుంచి సాయంత్రం 4లోపు తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దు. పిల్లలు ఎండలో ఆడకుండా పర్యవేక్షించాలి. తగిన నీరు తాగేలా చూడాలి. డయేరియాకు గురికాకుండా తేలికపాటి ఆహారమే ఇస్తూ నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు

ముందు జాగ్రత్త్తే మందు