
ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి.. దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 2025 నింజా 650 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధర కంటే కూడా రూ. 11000 ఎక్కువ. కాబట్టి ఈ కొత్త బైక్ ధర రూ. 7.27 లక్షలు (ఎక్స్ షోరూమ్).
2025 కవాసకి నింజా 650 బైక్ ఇప్పుడు వైట్ / ఎల్లో రంగుతో.. కొత్త ఆకుపచ్చ రంగులో లభిస్తుంది. ఇది చూడటానికి కొంత కవాసకి పోర్ట్‌ఫోలియోలోని నింజా ఆర్ సిరీస్ బైకు మాదిరిగా ఉంటుంది. ఇందులో 4.3 ఇంచెస్ ఫుల్ డిజిటల్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది కవాసకి రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
2025 కవాసకి నింజా 650 బైకులో.. అదే 649 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 67.31 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 196 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ కెపాసిటీ 15 లీటర్లు కావడం గమనార్హం.
ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..