
Kamaljit Kaur Success Story: జీవితంలో ఎదగాలంటే తెలివి మాత్రమే కాదు చేయాలనే సంకల్పం, చేయగలననే పట్టుదల ఉంటే నిన్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.. విజయ శిఖరాలను అధిరోహించి సక్సెస్ సాధించిన మహానుభావులు చెప్పే మాటలివి. విజయం సాధించాలంటే మాటల్లో అనుకున్నంత సులభమైతే కాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఐదు పదులు దాటిన 'కమల్‌జిత్ కౌర్' (Kamaljit Kaur) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె జీవితంలో సాధించిన సక్సెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో పంజాబ్ లుథియానాలోని చిన్న గ్రామంలో పుట్టిన కమల్‌జిత్ చిన్నప్పటి నుంచి స్వచ్ఛమైన పాలు, నెయ్యి, వెన్న తింటూ పెరిగింది. ఎలాంటి కల్తీ లేని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈమెకు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని గతంలో వెల్లడిందింది.
కిమ్ముస్ కిచెన్
బాల్యంలో తాను ఆస్వాదించిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజంగా అందించాలనే సంకల్పంతో 50 సంవత్సరాల వయసులో కమల్‌జిత్ కౌర్ కిమ్ముస్ కిచెన్ పేరుతో నెయ్యి విక్రయించడానికి సంకల్పించింది. అనుకున్న విధంగానే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈమె నెయ్యి వాసనలు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా పాకాయి. దెబ్బతో కిమ్ముస్ కిచెన్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది.
(ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!)
ఎలాంటి కల్తీ లేకుండా నెయ్యిని తయారు చేయడానికి ఈమె బిలోనా అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగించింది. ఈ పద్ధతిలో మొదట ఆవు పాలను మరిగించి చల్లబరుస్తుంది, తర్వాత ఒక టీస్పూన్ పెరుగు కలిపి, మరుసటి రోజు అందులో నుంచి వెన్నను తీసి నెయ్యిని తయారు చేస్తుంది.
(ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?)
సంపాదన
క్రమంగా కమల్‌జీత్ కౌర్ నెయ్యికి బాగా డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచ దేశాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పుడు ఇతర దేశాల నుండి కూడా ఆర్డర్ చేస్తున్నారు. రిటైల్ నెయ్యి సీసాలు 220 ml, 500 ml, 1 లీటర్ పరిమాణాల్లో లభిస్తాయి. పరిమాణాన్ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ముస్ కిచెన్ సంపాదన నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ. వీరి సంపాదనలో 1 శాతం గురుద్వార్‌కు, ఆకలితో ఉన్న వారికి అందిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.