
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 83 శాతం జంప్‌చేసి రూ. 8,759 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 4,780 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 15,509 కోట్ల నుంచి రూ. 18,109 కోట్లకు ఎగసింది.
అయితే మొత్తం వ్యయాలు మాత్రం రూ. 9,643 కోట్ల నుంచి రూ. 9,309 కోట్లకు తగ్గాయి. నిర్వహణ లాభం 41 శాతంపైగా మెరుగై రూ. 10,618 కోట్లకు చేరింది. స్థాపిత సామర్థ్యం 15,250 మెగావాట్లకు చేరగా.. 17.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. 60.1 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది. జార్ఖండ్‌లోని 1,600 మెగావాట్ల గొడ్డా అ్రల్టాసూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు అమ్మకాలు పెరిగేందుకు దోహదపడినట్లు కంపెనీ వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు విద్యుత్ ఎగుమతిని ప్రారంభించినట్లు పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్ షేరు బీఎస్‌ఈలో 2.7 శాతం ఎగసి రూ. 275 వద్ద ముగిసింది.