
న్యూఢిల్లీ: వచ్చే నెల (అక్టోబర్) రెండో వారం నాటికి దేశీయంగా తొమ్మిది రూట్లలో 250 పైగా ఫ్లయిట్స్ నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు, అహ్మదాబాద్‌లకు కొత్తగా సర్వీసులను, అలాగే బెంగళూరు-అహ్మదాబాద్ రూట్‌లో రోజూ అదనంగా మరో ఫ్లయిట్‌ను నడపనున్నట్లు పేర్కొంది. (Mankind Pharma: అతిపెద్ద ఐపీవో బాట)
అప్పటికి తమకు అయిదో విమానం కూడా అందుబాటులోకి వస్తుందని, తద్వారా వారానికి 250 పైచిలుకు సర్వీసులు నిర్వహించగలమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న కార్యకలాపాలు ప్రారంభించింది. 2023 మార్చి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోనుంది.