
మారుతున్న ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా.. చాలా వాహన తయారీ సంస్థలు బైక్‌లను అప్‌డేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా చేరింది. ఇది ఒకేసారి నాలుగు బైకులను (ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ఆర్) అప్డేట్ చేయనుంది. ఇందులో నేకెడ్ ఆర్ మోడల్స్ కొత్త స్టైలింగ్ పొందుతాయి. పుల్ ఫెయిర్డ్ ఆర్ఆర్ బైకులు రీడిజైన్ పొందుతాయి.
బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్ వంటి నేకెడ్ బైక్స్ ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతాయి. పవర్, టార్క్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బైక్ ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ పొందుతుంది. సీటు కింద యూఎస్బీ-సీ ఛార్జర్ ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైకులు యాంత్రికంగా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైకులలో ఎక్కువ భాగం నలుపు రంగు ఉండటం చూడవచ్చు.
ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ బైకుల విషయానికి వస్తే.. ఎం 1000 ఆర్ఆర్ కొంత ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వింగ్‌లెట్‌లు కొంత పెద్దవిగా ఉంటాయి. కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్‌బైక్ కూడా రీడిజైన్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందదు.
బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఈ నాలుగు బైకులను భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్: రూ. 19 లక్షల నుంచి రూ. 23.30 లక్షలు
➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్: రూ. 33 లక్షల నుంచి రూ. 38 లక్షలు
➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్: రూ. 20.75 లక్షల నుంచి రూ. 25.25 లక్షలు
➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్: రూ. 49 లక్షల నుంచి రూ. 55 లక్షలు