
రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలతో పాటు అనేక విధానాలను అనుసరిస్తున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఉచిత రేషన్ వంటివి అందిస్తూ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది.
ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPOల) పేరుతో మరో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
అనగా రైతులకు ప్రధానమంత్రి ఎఫ్‌పిఓ పథకం కింద రూ. 15 లక్షల వరకు సహాయం అందిస్తారు. తద్వారా వారు వ్యవసాయ పరిశ్రమలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే రైతులు వ్యవసాయం, వ్యాపారం చేసేందుకు సహకరించే ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కూడా.
దీని కింద రైతులకు అందించే డబ్బులను వ్యవసాయ పనిముట్లు, ఎరువులు సహా ఇతరాత్రా సాగు సంబంధ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.15 లక్షలు వరకు గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ ఇస్తుంది. అందుకోసం ప్రభుత్వ వెబ్‌సైట్ ఈనాం (ENAM) లో నమోదు కావాల్సి ఉంటుంది.
చదవండి: Double Toll Tax Rate: వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే..