నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్‌ కార్డ్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ | HDFC Bank aims to regain lost ground in credit card battle | Sakshi
Sakshi News home page

నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్‌ కార్డ్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Published Tue, Aug 24 2021 5:56 AM | Last Updated on Tue, Aug 24 2021 3:53 PM

HDFC Bank aims to regain lost ground in credit card battle - Sakshi

నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేమెంట్స్, కంజ్యూమర్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ పరాగ్‌ రావ్‌ వెల్లడించారు.

ముంబై: క్రెడిట్‌ కార్డ్స్‌ మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. కొత్త క్రెడిట్‌ కార్డుల జారీకి ఆర్‌బీఐ నుంచి గత వారం గ్రీన్‌సిగ్నల్‌ పొందిన నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని బ్యాంక్‌ నిర్ధేశించుకుంది. తొలుత నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు బ్యాంక్‌ పేమెంట్స్, కంజ్యూమర్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ పరాగ్‌ రావ్‌ వెల్లడించారు.

‘మూడు నెలల్లో ఈ సంఖ్యను చేరుకుంటాం. ఆ తర్వాత ఆరు నెలలకు ఈ సంఖ్యను 5 లక్షలకు చేరుస్తాం. 9–12 నెలల్లో కార్డుల సంఖ్య పరంగా మా వాటాను తిరిగి చేజిక్కించుకుంటాం’ అని వివరించారు. కార్డుల సంఖ్య పరంగా హెచ్‌డీఎఫ్‌సీ వాటా 2 శాతం తగ్గి 25లోపుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నూతన క్రెడిట్‌ కార్డులు జారీ చేయరాదంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను 2020 నవంబరులో ఆర్‌బీఐ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement