రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్‌మెంట్‌ రికార్డ్‌ | IIT BHU record breaking placement with Rs 2 20 crore package | Sakshi
Sakshi News home page

రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్‌మెంట్‌ రికార్డ్‌

Published Wed, Feb 5 2025 8:40 PM | Last Updated on Wed, Feb 5 2025 9:24 PM

IIT BHU record breaking placement with Rs 2 20 crore package

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో (Campus Placement) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) తన రికార్డును తానే బద్దలుకొట్టింది.  ఈ ఏడాది అత్యధిక వార్షిక వేతనం (Salary Package) రూ. 2.20 కోట్లుగా నమోదైంది.   మునుపటి రికార్డు 2021 సంవత్సరంలో రూ. 2.15 కోట్లు ఉండేది.  ఇప్పుడు నమోదైన అత్యధిక వేతనంతో గత పదేళ్లలో ఐఐటీ బీహెచ్‌యూ సాధించిన అత్యుత్తమ పనితీరు ఇదేనని భావిస్తున్నారు.

దీంతో పాటు 1128 మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు. మరో 424 మంది ఇంటర్న్‌షిప్‌లను పొందారు. ఈసారి సగటు ప్యాకేజీ కూడా పెరిగింది. ఈ సంవత్సరం సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.80 లక్షలకు చేరుకుంది.  తమ విద్యార్థుల ప్రతిభ, విద్యా, పరిశోధనా నైపుణ్యం పట్ల సంస్థ నిబద్ధత అగ్రశ్రేణి రిక్రూటర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయని ఐఐటీ బీహెచ్‌యూ డైరెక్టర్ పేర్కొన్నారు.

క్యాంపస్‌లో జరిగిన నియామకాల్లో పరిశ్రమ దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ హాజరై విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.  గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా స్టీల్, అమెజాన్, డేటా బ్రిక్స్, ఐటీసీ, శామ్‌సంగ్, ఒరాకిల్, వాల్‌మార్ట్, క్వాల్‌కామ్‌తో సహా దాదాపు 350 కంపెనీలు 2024 ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను కవర్ చేశాయి.

రికార్డు ప్యాకేజీలు
ఐఐటీ బీహెచ్‌యూలో  ఏటా జరుగుతున్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో విద్యార్థులు రికార్డుస్థాయిలో అత్యధిక వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2024-25లో అత్యధిక వేతనం  రూ.2.20 కోట్లు కాగా,  2023-24లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ.1,20 కోట్లు, 2021-22లో రూ.2.15 కోట్ల ప్యాకేజీలు అత్యధిక వేతనాలుగా రికార్డు సృష్టించాయి.  11 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ను పొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement