iit
-
లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..!
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్‌ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?ఇన్‌స్టా పోస్ట్‌లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్‌గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు. కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్‌కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది. View this post on Instagram A post shared by Anorah ✨ Contemporary sarees (@anorah.in) (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది.ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్నింగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి.సీటు అక్కడే కావాలి...జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు.ఎన్ఐటీల్లో...ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది.తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఐఐటీల ప్లేస్‌మెంట్స్.. వివరాలు గప్ చుప్
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్‌పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ–బీహెచ్‌యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కారణాలు ఇవేనా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్‌మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. వారం లేదా పక్షం రోజులకోసారి.. సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. డిసెంబర్లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్‌మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు. కొత్త ఐఐటీల ప్లేస్‌మెంట్స్ నివేదికలు అప్పుడే.. చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్‌ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్లో ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఒకేసారి తుది ప్లేస్మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఐఐటీల నిర్ణయానికి మద్దతు విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్బాద్లో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు. విద్యార్థులు ఏమంటున్నారంటే.. మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు.. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్మెంట్ రికార్డ్
క్యాంపస్ ప్లేస్మెంట్లలో (Campus Placement) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ ఏడాది అత్యధిక వార్షిక వేతనం (Salary Package) రూ. 2.20 కోట్లుగా నమోదైంది. మునుపటి రికార్డు 2021 సంవత్సరంలో రూ. 2.15 కోట్లు ఉండేది. ఇప్పుడు నమోదైన అత్యధిక వేతనంతో గత పదేళ్లలో ఐఐటీ బీహెచ్‌యూ సాధించిన అత్యుత్తమ పనితీరు ఇదేనని భావిస్తున్నారు.దీంతో పాటు 1128 మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు. మరో 424 మంది ఇంటర్న్‌షిప్‌లను పొందారు. ఈసారి సగటు ప్యాకేజీ కూడా పెరిగింది. ఈ సంవత్సరం సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.80 లక్షలకు చేరుకుంది. తమ విద్యార్థుల ప్రతిభ, విద్యా, పరిశోధనా నైపుణ్యం పట్ల సంస్థ నిబద్ధత అగ్రశ్రేణి రిక్రూటర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయని ఐఐటీ బీహెచ్‌యూ డైరెక్టర్ పేర్కొన్నారు.క్యాంపస్‌లో జరిగిన నియామకాల్లో పరిశ్రమ దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ హాజరై విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా స్టీల్, అమెజాన్, డేటా బ్రిక్స్, ఐటీసీ, శామ్సంగ్, ఒరాకిల్, వాల్‌మార్ట్, క్వాల్‌కామ్‌తో సహా దాదాపు 350 కంపెనీలు 2024 ప్లేస్మెంట్ డ్రైవ్‌ను కవర్ చేశాయి.రికార్డు ప్యాకేజీలుఐఐటీ బీహెచ్‌యూలో ఏటా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు రికార్డుస్థాయిలో అత్యధిక వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2024-25లో అత్యధిక వేతనం రూ.2.20 కోట్లు కాగా, 2023-24లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ.1,20 కోట్లు, 2021-22లో రూ.2.15 కోట్ల ప్యాకేజీలు అత్యధిక వేతనాలుగా రికార్డు సృష్టించాయి. 11 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ను పొందారు. -
వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మేళాకు పలువురు స్వామీజీలు, బాబాలు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐఐటీ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ కుంభమేళాలో సందడి చేశారు. సాధారణంగా ఐఐటీ అనగానే అక్కడ సీటు లభించడం మొదలుకొని చదువు పూర్తయ్యాక లభించే భారీ జీతం గురించి చర్చిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ఐఐటీ చదువుతున్నవారు లేదా ఐఐటీ పూర్తి చేసిన పలువురు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ, బాబాలుగా పేరొందుతున్నారు. ఈ జాబితాలోకి వచ్చే కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌరంగ్ దాస్ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన గౌరంగ్ దాస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్)లో చేరడం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. గౌరంగ్ దాస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన వీడియోల ద్వారా ఉన్నత వ్యక్తిత్వం గురించి ఆయన చెబుతుంటారు. గౌరంగ దాస్ పలు ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా రాశారు.అభయ్ సింగ్ఐఐటీ బాంబే నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. అతను కెనడాలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారు.ఆచార్య ప్రశాంత్ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆచార్య ప్రశాంత్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. అతను తన కార్పొరేట్ కెరీర్‌ను వదిలి, ఆధ్యాత్మికత వైపు మళ్లారు. నేడు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా పేరొందారు. ఆధ్యాత్మికతపై ఆయన పలు పుస్తకాలు రాశారు.సంకేత్ పారిఖ్ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన సంకేత్ పారిఖ్ జైన సన్యాసం తీసుకున్నారు. దీనికి ముందు ఆయన అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆయన జైన తత్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని, శాంతి వైపు అడుగులు వేశారు.స్వామీ ఎంజేఐఐటీ కాన్పూర్, యూసీఎల్ఎ నుండి పీహెచ్డీ చేసిన ఎంజె.. రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారారు. గతంలో ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. దీనికి ముందు ఎంజే హైపర్బోలిక్ జ్యామితి, రేఖాగణిత సమూహ సిద్ధాంతంపై పరిశోధనలు సాగించారు.స్వామి ముకుందానందస్వామి ముకుందానంద్ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆయన జగద్గురు కృష్ణపాల్జీ యోగా సంస్థను స్థాపించారు యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతపై పలు పుస్తకాలను రాశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.అవిరళ్ జైన్ఐఐటీ బీహెచ్‌యూ నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అవిరళ్ జైన్.. వాల్‌మార్ట్‌లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి, జైన సన్యాసం స్వీకరించారు. ఆయన కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి, ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్నారు.స్వామి విద్యానాథ్ నంద్ఐఐటీ కాన్పూర్ నుండి పట్టభద్రుడై, యుసిఎల్ఎ నుండి పిహెచ్డీ చేసిన స్వామి విద్యానాథ్ నంద్ రామకృష్ణ మఠంలో చేరి, తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేశారు.సన్యాసి మహారాజ్ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సన్యాసి మహారాజ్ ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తుంటారు. అంతర్గత శాంతి, స్వీయ-సాక్షాత్కారం మనిషికి ఎంత ముఖ్యమో ఆయన జీవితం తెలియజేస్తుందని చాలామంది అంటుంటారు.ఈ బాబాలంతా భౌతికంగా విజయాలు సాధించడంతో పాటు, ఆధ్యాత్మిక పురోగతిని కూడా అందుకున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు -
వారు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు రాసుకొనేలా జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జేఈఈ– అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి హఠాత్తుగా రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్డ్–2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!
కష్టపడి చదివి, నేర్చుకుని ప్రతిభాపాటవాలను సొంతం చేసుకుంటాం. ఇది సర్వసాధారణం. కానీ కొందరూ పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. చిన్న వయసులోనే తమలో ఉన్న అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటారు. మనలా సంప్రదాయ విద్య సరిపడదు వారికి. ఎందుకంటే వయసుకి అనుగుణమైన విద్యకు మించిన జ్ఞానం వీరి సొంతం. అలాంటి కోవకు చెందిందే మాళవిక రాజ్ జోషి. ఆ ప్రతిభే ఆమె ఉన్నతికి ప్రతిబంధకమై.. ఐఐటీలో ప్రవేశానికి అనర్హురాలిగా చేసింది. విద్యాపరంగా పలు సవాళ్లు ఎదుర్కొనక తప్పలేదు. చివరికి ప్రతిష్టాత్మకమైన ఎంఐటీలో చోటు దక్కించుకుని శెభాష్ మాళవిక అని అనిపించుకుంది.ముంబైకి చెందిన మాళవిక రాజ్ జోషికి చిన్నప్పటి నుంచి అపారమైన ప్రతిభ ఉంది. చిన్న వయసులోనే గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అపారమైన నైపుణ్యం ఉంది. ఆమె ఇంటెలిజెన్సీ పవర్‌ని గుర్తించి.. ఏడో తరగతి నుంచి సంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి చెప్పించింది తల్లి సుప్రియ. అప్పటి వరకు ముంబైలోని దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో చదువుకునేది మాళవిక. ఆమె చదువుని సీరియస్ తీసుకుని ఇంటివద్దే ప్రిపేర్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు తల్లి సుప్రియ. కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేశారామె. పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ మాళవిక గణితం, ప్రోగ్రామింగ్‌లో బాగా రాణించింది. దీంతో మాళవిక తల్లిదండ్రులు ఆమెను ఐఐటీకీ పంపాలనుకున్నారు. కానీ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానందున ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్‌లు ఆమెను తిరస్కరించాయి. అయితే ఆమె ప్రతిభాపాటవాలు బీఎస్సీ డిగ్రీకి సరితూగేవి. దీంతో ఆమె చిన్న వయసులోనే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (CMI)లోని ఎమ్మెస్సీ స్థాయి కోర్సులో అడ్మిషన్ పొందగలిగింది. అలా ఆమె గ్లోబల్ ప్రోగ్రామింగ్ పోటీలలో కూడా పాల్గొనడం ప్రారంభించింది. ఈ పోటీల్లో రాణించి.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చోటు దక్కించుకుంది. దీంతో మాళవిక కేవలం 17 ఏళ్లకే ఎంఐటీ సీటు పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఒక చోట మన ప్రతిభను గుర్తింకపోయినా..వాటిని తలదన్నే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు గుర్తిస్తాయని చాటి చెప్పింది. టాలెంట్ ఉన్న వాడిని ఆపడం ఎవరితరం కాదంటే ఇదే కదూ..!(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
ఉద్యోగాలను మించి.. కెరీర్‌పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
యూపీఎస్సీ కోసం.. అధిక జీతం వదులుకుని.. ‘కనిష్క్’ సక్సెస్ స్టోరీ
న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)ను సాధించాడు.కనిష్క్ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్ రాత పరీక్షలో 942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్‌ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్‌ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్‌లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
ఒడుపైన ఎత్తు.. ఒత్తిడే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్‌షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.ఐఐటీలో ఆత్మల రాత్రి అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌లలో మునిగిపోతారు.ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.ఐఐటీహెచ్‌లో మెంటల్ హెల్త్ మంత్రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్‌షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్‌లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్‌షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌నే అబివృద్ధి చేశారు. చాట్‌బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఐఐటీహెచ్‌లో తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిబుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్లను ప్రదర్శించారు. ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్లర్జీ, ఐఐటీ భువనేశ్వర్ -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
ఐఐటీల్లో అరుదైన కోర్సులు (ఫోటోలు)
-
ఏఐని వాడుకుంటాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు. ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
నీట్, జేఈఈ క్రాక్ చేసి.. మెడికల్, ఐఐటీ వద్దంటూ..
ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు. -
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు
సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది. -
దారి చూపే దివిటీలు
పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.తండా నుంచి ఐఐటీ దాకా...ఈ ఫొటో చూడండి...దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంది. సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్మీడియట్లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు. ఆరోజు ఎంత బాధ పడ్డానో!‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.– బదావత్ రాములు, మధులత తండ్రిచదువే లోకం...నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా. – సరోజ, మధులత తల్లి – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్ -
సీఎస్‌ఈకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్ఐటీల్లో 24,226, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కలిసొచ్చిన కటాఫ్... సీట్ల పెరుగుదలఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్ వంటి సంస్థల్లో సీఎస్ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు. ఐఐటీ అడ్వాన్స్డ్ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.సీఎస్ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్ఐటీల్లో, రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. – ఎంఎన్.రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరొచ్చు
దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.ఇకపై ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్ ఐఐటీ నిలిచింది.ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్‌పూర్ ఐఐటీ ఇంజినీరింగ్ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. -
బియాండ్ సేవల విస్తరణ...
తమ సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఇంటీరియర్ ఉత్పత్తులకు పేరొందిన నగరానికి చెందిన బియాండ్ కలర్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ కుమార్ వర్మ తెలిపారు. గత మూడు రోజులుగా మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐడీ) షో కేస్ ప్రదర్శన ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఐఐడీ షో కేస్‌లో ప్రదర్శించిన తమ ఉత్పత్తులకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. -
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్‌జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత గరిష్టంగా 1.91 లక్షల మంది పరీక్షకు నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ పరీక్షకు 1,89,744 మంది దరఖాస్తు చేశారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో రెండేళ్ల కిందటి వరకు 60 శాతం మంది కూడా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 76 శాతానికి పెరిగింది. ఉత్తీర్ణత శాతం తక్కువే..అడ్వాన్స్డ్ పరీక్షకు నమోదు చేసుకున్నవారితో పోలిస్తే హాజరయ్యేవారి సంఖ్య ఏటా తక్కువగానే ఉంటోంది. అలాగే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య కూడా స్వల్పమే. గత కొన్నేళ్లుగా పరీక్షలకు సంబంధించి కటాఫ్ మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతూ వచ్చింది. జనరల్‌తో పాటు రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గతేడాది అత్యధికంగా 1.80 లక్షల మందికి పైగా పరీక్ష రాస్తే 43,773 మంది మాత్రమే అర్హత సాధించారు. గతేడాది కటాఫ్ కూడా బాగా పెరిగింది. ఇక అడ్వాన్స్‌డ్‌లో పురుషులతో పోలిస్తే మహిళల హాజరు, ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, వాటిలో అర్హత సాధించాలంటే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. రెండు సెషన్లలో పరీక్షదేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆన్లైన్లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 21,844, తెలంగాణ నుంచి 24,121 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన 2.50 లక్షల మందిలో సుమారు 60 వేల మందికిపైగా పరీక్షకు దరఖాస్తు చేయలేదు. వారు 12వ తరగతి/ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించలేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. -
ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్ వచ్చిందా? రాలేదా?
అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసినా టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. ఐఐఎంల్లోనూ అదే తీరు.. ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్మెంట్ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..! భారత్‌లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే సైన్స్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం.. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది. వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు. వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు.. మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది. గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
ప్రఖ్యాత విద్యాసంస్థల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
మద్రాస్ ఐఐటీలో స్పోర్ట్స్ కోటా
న్యూఢిల్లీ: అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు. -
ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్ మేజిక్‌లో మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ముంబైకి మొదటి ప్రాధాన్యం సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. ఎన్ఐటీల్లో చాన్స్ పెరిగేనా? వచ్చే సంవత్సరం ఎన్ఐటీల్లో కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
గోవా ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన డాక్టర్ సువ్వారి ఆనందరావు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యో గం సాధించారు. ఆయన స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపేట గ్రామం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన గోవా ఐఐటీ సంస్థలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఆనందరావు ఉగ్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కమ్మవారిపేటకు చెందిన సువ్వారి నీలాచలం, పద్మావతిలు ఆనంద రావు తల్లిదండ్రులు. పాఠశాల స్థాయి నుంచి ఆనందరావు చదువుల్లో చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఎకనామిక్స్‌పై ఆసక్తితో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఐఎంఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ బీమా సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. అయితే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ‘ఎఫీషియన్సీ అండ్ ఫెర్మార్మన్స్ అసెస్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్యూరెన్స్ ఇండస్ట్రీ, సమ్ న్యూ ఎవిడెన్స్ ఫర్ ఇండియా’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేసి చేసి డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఆయన 2019 జూలై నుంచి 2020 వరకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశా రు. 2020 నవంబరు నుంచి 2023 జనవరి వరకూ ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయంలో సహాయ ఆచార్యునిగా, ఎకనామిక్స్ హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 నుంచి హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తూ.. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ గోవాలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఆయన ప్రచురించిన జర్న ల్స్ అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. -
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు మరో ప్లాన్.. సుప్రీంకు వినతి!
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? -
కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫర్‌తో!
ముస్కాన్ అగర్వాల్! ఐఐఐటీ-యునలో రికార్డ్ సృష్టించింది. ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్ దిగ్గజం లింక్డిన్లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా లింక్డిన్ విధులు నిర్వహిస్తుంది. ఇందులో ఈమె ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. అలాంటి కోడింగ్‌లో ఈమె దిట్ట. గత ఏడాది అగర్వాల్ ‘టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022’ కోడింగ్ పోటీల్లో పాల్గొన్న 67,000 కంటే ఎక్కువ మంది మహిళా కోడర్లను ఓడించింది. విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్ ఉమెన్ కోడర్’గా నిలిచారు. టెక్‌గిగ్ గీక్ గాడెస్ఈవెంట్లో ఫైనలిస్టులు ప్రోగ్రామింగ్ సొల్యూషన్ల కోసం నాలుగు గంటల పాటు కోడ్లను రాసింది. ఫలితంగా ఆమె రూ.1.5 లక్షలు బహుమతి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లింక్డిన్లో మెంటార్షిప్ అంతేకాదు ముస్కాన్ అగర్వాల్లింక్డిన్లో మెంటార్షిప్కు ఎంపికయ్యారు. ఎంపికైన 40 మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఈ మెంటార్ షిప్లో లింక్డిన్ నిపుణులు ఆయా విభాగాల్లో మెంటర్ షిప్‌కు సెలక్ట్ అయిన వారికి తగిన సలహాలు అందిస్తారు. ప్యాకేజీలే.. ప్యాకేజీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే గ్రాడ్యుయేట్ 2022-23 బ్యాచ్ నుండి వార్షిక ప్లేస్మెంట్లలో సంవత్సరానికి రూ. 3.67 కోట్ల జీతంతో అంతర్జాతీయ కంపెనీల్లో జాబ్ ఆఫర్ దక్కించుకున్నారు. దేశీయ ప్లేస్మెంట్లో ఓ విద్యార్ధి అత్యధికంగా ఏడాదికి రూ.1.68కోట్ల ప్యాకేజీని పొందాడు.16 మంది గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనాలతో ఉద్యోగ ఆఫర్లను అంగీకరించగా, 2022-23 ప్లేస్మెంట్ సీజన్లో 65 మంది విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. అమెరికా, జపాన్, యూకే , నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లలోని వివిధ కంపెనీల్లో ఎంపికైన విద్యార్ధులు విధులు నిర్వహించనున్నారు. -
బై‘స్కిల్’లుడు
సైకిల్‌ను మధ్యలోకి మడిచి కారు డిక్కీలో పెట్టుకోవచ్చా? ‘బేషుగ్గా’ అంటున్నాడు ఆనంద్ మహీంద్రా. ఎక్కడ ‘స్కిల్’ కనిపించినా ఆ విశేషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది మామూలు సైకిల్ కాదు. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ–బైసికిల్. ఐఐటీ బాంబే స్టూడెంట్స్ ఈ బైసికిల్‌ను తయారు చేశారు. ‘మరోసారి మనం గర్వించేలా ఐఐటీ బాంబే స్టూడెంట్స్ సృష్టించిన వాహనం ఇది’ అని కాప్షన్ పెట్టాడు మహీంద్రా. ‘ఇంప్రెసివ్ ఇనోవేషన్... రివల్యూషన్ ఆన్ వీల్స్’ అంటూ యూజర్లు స్పందించారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించండి
సంగారెడ్డి అర్బన్: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్ వీక్ సెలబ్రేషన్లో భాగంగా 3 రోజుల వర్క్‌షాప్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడమే కాక ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులైన, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతికతను కలిగి ఉన్నారని, ఇది గొప్ప శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ కీలకపాత్ర పోషిస్తోందని అభినందించారు. కార్యక్రమంలో సైంట్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దానివల్లే ఇస్రో ఉద్యోగాలను వద్దనుకుంటున్నారు.. చైర్మన్ కామెంట్స్ వైరల్
భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెబుతున్న 'ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' (ISRO)లో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆధునిక కాలంలో అలాంటి వారి సంఖ్య బాగా తగ్గిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ 'ఎస్ సోమనాథ్' (S Somanath) తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఈయన అలా ఎందుకన్నారు? కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి బయటకు వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరటానికి సుముఖత చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం జీతభత్యాలే అంటూ సోమనాథ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఇంజినీర్లుగా, ఐఐటీయన్లుగా ఉండాలి. వారు తప్పకుండా దేశ ప్రతిష్టను పెంచే ఇస్రోలో చేరాలి. కానీ నేడు అలా జరగడం లేదు. రిక్రూట్మెంట్స్ ప్రకటించినప్పటికీ ఎక్కువ మంది దీని కోసం ప్రయత్నించడం లేదు. కొందరు పనిచేసే స్థలం ముఖ్యమని భావించి చేరుతున్నారు, అలాంటి వారు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు. 60 శాతం మంది ఇస్రో చీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఇటీవల టీమ్ బయలుదేరింది. అయితే చాలామంది ఉద్యోగం కోసం వచ్చిన వారు శాలరీ స్ట్రక్చర్ చూసి ప్రెజెంటేషన్ నుంచి 60 శాతం మంది బయటకు వెళ్లిపోయారని సోమనాథ్ తెలిపారు. గతంలో కొందరు ఇస్రోలో జీతాలు భారీగా ఉంటాయని భావించే వారు, కానీ గత నెలలో హర్ష్ గోయెంకా ఒక ట్వీట్లో సోమనాథ్ జీతం రూ. 2.5 లక్షలని, వేర్వేరు పోస్టులకు వేరువేరు వేతనం ఉంటుందని, అయితే ఇక్కడ ఇంజనీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56,100 మాత్రమే అని తెలిపాడు. ఇదీ చదవండి: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు! ప్రస్తుతం ఐఐటీ చేసిన చాలామంది ఎక్కువ ప్యాకేజి కోసం చూస్తున్నారు, ఈ కారణంగా ఇస్రోలో చేరటానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అయితే దేశంపై ఉన్న ప్రేమతో ఇక్కడ చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి 'సమృద్ జోషి' వెల్లడించాడు. కానీ టెక్నాలజీలో దూసుకెళుతున్న భారతదేశం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్తమ ప్రతిభ ఉన్నవారు ముందుకు రావాలి. అందరూ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తే రానున్న రోజులు ప్రశార్థకంగా మారుతాయి. -
ఒత్తిడితో పిల్లల్ని ఇంకా చంపుదామా?
మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతి నెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్లేస్మెంట్లు, జీతం ప్యాకేజీల కథలతో ఈ వ్యవస్థ యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తోంది. అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. అయినా విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నాం. ఈ ప్రాణాపాయ విద్యకు బలంగా ‘నో’ అని చెప్పాలి. ఈ మధ్య ఓ దీర్ఘకాలిక ఆందోళన నాతో ఘర్షించడం మొదలెట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నామా? విద్య పేరిట, ‘విజయం’ కోసం జరిగే పరుగుపందెంలో కొందరు ‘బలహీనమైన’, ‘భావోద్వేగా నికి లోనయ్యే’ యువకులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్న ప్పటికీ, దీన్నంతా మామూలు వ్యవహారం లానే చూస్తున్నామా? ఇలాంటి విద్య... విద్యార్థి స్ఫూర్తినే నాశనం చేస్తుందనీ, సామాజిక మానసిక వ్యాధిని సాధారణీకరిస్తుందనీ చెబుతూ, మధ్యతరగతి తల్లిదండ్రులతోనూ, ఉపాధ్యాయులతోనూ నేను తరచుగా కమ్యూని కేట్ చేయడానికి ప్రయత్నించాను. గణాంకాల ద్వారా వారిని ఒప్పించేందుకు కూడా ప్రయత్నించాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం, ఆ ఏడాది 13,089 మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. అంటే ప్రతిరోజూ 35 కంటే ఎక్కువ చొప్పున అన్నమాట. అయినప్పటికీ, నేను ఒక తిరస్కరణ లేక నిరాకరణ స్థితిని ఎదుర్కొంటున్నాను. మన కాలంలో వాతావరణ అత్యవసర పరిస్థితికి చెందిన కఠినమైన వాస్తవికతను మనం ఎలాగైతే తిరస్కరిస్తున్నామో దాదాపుగా ఇదీ అంతే! మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. మరో వైపున ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. అయినప్పటికీ, మనం మౌనంగా ఉండటానికే ఇష్టపడతాం లేదా దానిని కేవలం ఒక అపసవ్యతగా భావిస్తాం. అదే విధంగా, ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతినెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. నిజానికి, జీవితాన్నే నిరాకరించే ఈ పోటీ వ్యాప్తికి సంబంధించిన వ్యవస్థీకృత, సామాజిక కారణాల గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే, అధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఉద్యోగాల కొరత ఉంది. ఉదారవాద కళలు, మానవ శాస్త్రాల విలువ తగ్గిపోయింది. ఇంజినీరింగ్, వైద్యశాస్త్రాలు, బిజినెస్ మేనేజ్మెంట్, ఇతర సాంకేతిక కోర్సులపై మక్కువ పెరిగింది. సంస్కృతిపై, విద్యపై నయా ఉదార వాద దాడి కారణంగా జీవిత ఆకాంక్షల మార్కెటీకరణ జరిగింది. అన్నింటికంటే మించి, ‘యోగ్యత’ లేదా ‘బలవంతులదే మనుగడ’ సిద్ధాంతాలకు పవిత్రత కల్పించడం కోసం... అన్యాయమైన సామాజిక వ్యవస్థలో ఒక జీవన విధానంగా అతి పోటీతత్వాన్ని లేదా సామాజిక డార్వినిజంను అంగీకరించడం జరిగింది. మన పిల్లలు, యువ విద్యార్థులు బాధపడుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, ఆందోళన, ఆత్మహత్య ధోరణులతో వారు జీవిస్తున్నందున, మనం మౌనంగా ఉండలేం. ఈ అన్యాయాన్ని మనం సాధారణీకరించలేం. ఒక ఉపాధ్యాయునిగా, ఈ విధమైన ఏ విద్యనైనా ఏమాత్రం సందిగ్ధత లేకుండా మనం విమర్శించాలనీ, దీని ద్వారా కొత్త అవ కాశాల కోసం ప్రయత్నించాలనీ నేను భావిస్తాను. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. కానీ ఈ విద్యా వ్యవస్థలో భాగమైన ప్రతి యువ విద్యార్థి కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన, ‘వైఫల్యానికి’ సంబంధించిన అమితమైన భయాలతో అననుకూల మైన వాతావరణంలో పెరుగుతున్నారనేది కూడా అంతే నిజం. ప్రేమ, సహకారానికి సంబంధించిన ఆవశ్యకత; పట్టుదల, ప్రశాంతతకు సంబంధించిన కళ ద్వారా భూమ్మీద మన ఉనికి తాలూకు హెచ్చు తగ్గులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం; సాధారణ విషయాలలో జీవి తానికి సంబంధించిన నిజమైన నిధిని కనుగొనడానికి వీలు కల్పించే బుద్ధిపూర్వక స్థితి... ఇలా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవ కాశం లేని, నిజంగా ముఖ్యమైన వాటిని పెంపొందించడంలో ఆసక్తి లేని వ్యవస్థ ఇక్కడ ఉంది. ఒక సీతాకోక చిలుక చిన్న పసుపు పువ్వుతో ఆడుకోవడం, ముసలి నాయనమ్మ కోసం ఒక కప్పు టీ తయారు చేయడం, ఆమెతో పారవశ్యంలో ఒక క్షణం పంచుకోవడం, లేదా శీతా కాలపు రాత్రి ఒక నవలను చదవడం... ఇలాంటి వాటికి బదులుగా, ఈ వ్యవస్థ అన్ని గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. ఇది యువ మనసులను అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. పాఠశాలల నుండి కోచింగ్ ఫ్యాక్టరీల వరకు, మనం విద్యను అన్ని రకాల ప్రామాణిక పరీక్షలను ‘ఛేదించే’ ఒక వ్యూహంగా కుదించి వేశాము. గొప్ప పుస్తకాలను చదవడం, వినూత్న ఆలోచనలను అన్వేషించడం, చర్చించడం, వాదించడం, సైన్ ్స, సాహిత్యం, కళలతో ప్రయోగాలు చేయడం వంటి వాటి కంటే పరీక్షలు, మార్కులు చాలా ముఖ్యమైనవి కావడంతో నిజమైన అభ్యాసం దెబ్బతింటోంది. ‘వేగా నికి’ సంబంధించిన మాంత్రికతతో ఓఎమ్ఆర్ షీట్లో ‘సరైన’ సమా ధానాన్ని టిక్ చేయగల సామర్థ్యమే విలువైనది అయిపోయింది. ఎమ్సీక్యూ – కేంద్రీకృత పరీక్షా వ్యూహాలను విక్రయించే మార్గ దర్శక పుస్తకాలు యువ అభ్యాసకుల మానసిక స్థితిని వలసీకరించడం ప్రారంభించాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.ఈ వ్యవస్థ సౌందర్యం, సృజనాత్మకత, ఉత్సుకత లేనిది. ఇది యాంత్రికమైన, ప్రామాణికమైన, కరుడు గట్టిన మనస్సులను తయారు చేస్తుంది. ఉపకరణ ‘మేధస్సు’కు మాత్రమే అది విలువ నిస్తుంది. దీనిలో సృజనాత్మక కల్పన లేదా తాత్విక అద్భుతం లేదు. కోచింగ్ సెంటర్ వ్యూహకర్త మీ బిడ్డను సూర్యాస్తమయాన్ని చూడ డానికీ, ఒక పద్యం చదవడానికీ లేదా సత్యజిత్ రే చలన చిత్రాన్ని మెచ్చుకునేలా ప్రేరేపించాలనీ మీరు ఆశించలేరు. ఈ బోధకులు మీ పిల్లలను వేగంగా పరిగెత్తమని, ఇతరులను ఓడించమని, భౌతిక శాస్త్రాన్ని లేదా గణితాన్ని కేవలం ప్రవేశ పరీక్ష మెటీరియల్‌గా కుదించుకోమని, అతని/ఆమె స్వీయ–అవగాహనను ఐఐటీ–జేఈఈ లేదా నీట్ ర్యాంకింగ్‌తో సమానం చేయమని మాత్రమే అడగగలరు. మరో మాటలో చెప్పాలంటే, ఈ విధమైన విద్య ఒక వ్యక్తిని సాంస్కృతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా దారిద్య్రంలోకి నెడుతుంది. ఇది జీవితం కోసం, దాని లోతైన అస్తిత్వ ప్రశ్నల కోసం ఎవరినీ సిద్ధం చేయదు. కార్ల్ మార్క్స్ ఒకప్పుడు ‘సరుకుల మాయ’గా భావించిన దానిని ఈ విధమైన సాధనా విద్య చట్టబద్ధం చేస్తోంది. అవును, మన పిల్లలు ఒక విధంగా శిక్షణ పొందవలసి ఉంటుంది, తద్వారా వారు ఒక ధర ట్యాగ్‌తో వస్తువులుగా లేదా ‘ఉత్పత్తులుగా’ ఉద్భవించవలసి ఉంటుంది. కఠినమైన వాస్తవాన్ని అంగీకరించండి. చాలా హైప్ చేయబడిన ఐఐటీలు, ఐఐఎమ్‌లు – మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూసే అంతిమ మోక్షమైన ‘ప్లేస్మెంట్లు మరియు జీతం ప్యాకేజీల’ పురాణాల ద్వారా యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తాయి. మన పిల్లలను, ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి గల వ్యక్తు లుగా చూడకుండా, కేవలం ‘పెట్టుబడి’ లేదా విక్రయించదగిన వస్తు వుల స్థాయికి తగ్గించి, మనం న్యూరోటిక్, ఆందోళనతో కూడిన, అధిక ఒత్తిడితో కూడిన తరాన్ని సృష్టించడం కొనసాగిస్తాము. ‘మోటివేషనల్ స్పీకర్ల’ను ‘స్వయం–సహాయ’ పుస్తకాల మార్కెట్‌ను అభివృద్ధి చేయ డానికి వ్యవస్థ అనుమతించినప్పటికీ, పెరుగుతున్న ఆత్మహత్యల రేటును అరికట్టడం అసాధ్యం. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, శ్రద్ధగల పౌరులుగా, మనం అప్రమత్తంగా ఉండాలి, మన స్వరం పెంచాలి, ఈ ప్రాణాపాయ విద్యకు నో అని చెప్పాలి, కొత్త అవగాహనను ఏర్పరచాలి. మన పిల్లలకు జీవితాన్ని ధ్రువీకరించే, కరుణను పెంచే మరో దృక్పథాన్ని అందించాలి. అవిజిత్ పాఠక్ వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కరువు సీమలో విద్యాసౌరభం
పదిలో ప్రత్యేకత చాటాలంటే పుట్టిన ఊరు వదలాలి. ఇంటర్లో విన్నర్ కావాలంటే ఇంటి నుంచి దూరంగా పోవాలి. ఇక.. ఐఐటీ సీటు రావాలంటే అయినవారిని వీడాల్సిందే. నీట్లో ర్యాంకు రావాలంటే నిలుచున్నచోటును మరిచిపోవాల్సిందే. ఇదీ నిన్నామొన్నటివరకు రాయలసీమ విద్యార్థుల పరిస్థితి. అవును.. ప్రతిభ ఉన్నా సానబెట్టేవారు దొరకని దుస్థితి. పట్టుదల ఉన్నా పెద్దపట్టణాలకు వెళ్లలేని ఆర్థికస్థితి. ఇలాంటి తరుణంలో ఓ యువకుడు తన సద్బుద్ధితో వీరికి సరికొత్త మార్గాన్ని చూపాడు. రాళ్ల సీమ నుంచి రత్నాల్లాంటి విద్యార్థులను వెలికితీస్తున్నాడు. కడప గడ్డ వేదికగా ఐఐటీ, నీట్‌లలో ర్యాంకుల పంట పండిస్తున్నాడు. తన ‘సంకల్ప్’బలంతో కార్పొరేట్ శక్తులకు సవాల్ విసురుతున్నాడు. విద్యార్థుల సామర్థ్యానికి తన శక్తి జోడించి లక్ష్యం వైపు నడిపిస్తున్న ఓ విజేత స్ఫూర్తిగాథే నేటి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, కడప డెస్క్: ‘విజయం కోసం ఆరాటపడితే సరిపోదు.. జీవితంలో ఎదగాలని ఆశపడితే చాలదు.. మనసా వాచా కర్మణా ఆచరించాలి.. అలా చేయకుంటే ఎంత ఉన్నతాశయమైనా భూమిలో నాటని విత్తనంతో సమానమే.. అది మొలకెత్తదు.. ఆ ఆశయమూ ఫలించదు..’ అంటూ విద్యార్థులకు స్ఫూర్తిమంత్రం నూరిపోస్తుంటాడు వంశీకృష్ణ. వెనుకబడిన సీమ విద్యార్థుల భవితకు దీపధారై నడుస్తున్న ఆయన పుష్కరం క్రితం కడపకు వచ్చాడు. లాభాపేక్ష లేకుండా... 2011లో వైఎస్సార్ జిల్లా కేంద్రంలో నాగార్జున మోడల్ స్కూల్ కేంద్రంగా ‘సంకల్ప్’ స్థాపించాడు. అప్పటి నుంచి ఎందరో విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారు. అటుతర్వాత ఏపీహెచ్‌బీ కాలనీలో దశాబ్దం కిందట ‘సంకల్ప్’ పేరిట ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు వంశీకృష్ణ. అయినా ‘నాగార్జున’తో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా కాకుండా సేవాదృక్పథంతో ఇస్తున్న ఆయన శిక్షణతో ఎంతోమంది ఉజ్వల భవిష్యత్ పొందారు. పకడ్బందీగా ప్రవేశపరీక్ష ‘సంకల్ప్’లో ప్రవేశాల కోసం బేసిక్ మ్యాథమేటిక్స్ విధానం ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. నాలుగో తరగతి ముగించి ఐదో తరగతిలో చేరబోయే విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పదో తరగతి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఏటేటా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సీమ జిల్లాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తారు. ఇక్కడ చేరితే ఐఐటీలో కచ్చితంగా సీటు వస్తుందనే నమ్మడమే ఇందుకు కారణం. పరీక్షల్లో అర్హత సాధించిన వంద మందికే ఇక్కడ అవకాశం కల్పిస్తారు. ఆలోచనే ఆయుధం సంకల్ప్‌లో మొత్తం సిలబస్‌ను వేగంగా బోధించరు. విద్యార్థి ఆలోచనా విధానం, స్వతహాగా చొరవను గుర్తిస్తారు. ఉపాధ్యాయులపై ఆధారపడకుండా సొంతంగా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివేలా తర్ఫీదు ఇస్తారు. నిత్యం ఏదో ఒక టాపిక్ చెబుతారు. అది నేర్చుకున్న విద్యార్థి సొంతంగా దానిపై ఒక్క నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక తరహా శిక్షణతో వారు రాటుదేలుతారు. ప్రశ్నించడం నేర్పుతూ.. సంస్థలో ప్రతి విషయంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ ప్రశ్నించడం అలవరుస్తున్నారు. మూస పద్ధతిలో బోధన కాకుండా విద్యార్థికి న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చి ఎన్ని పద్ధతుల్లో సాల్వ్ చేస్తారంటూ అడుగుతారు. చాలామంది మూడు పద్ధతుల్లో సాల్వ్ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువ పద్ధతుల్లో పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తొమ్మిది పద్ధతుల్లో సాల్వ్ చేయడం విశేషం. చిన్నారుల ఆలోచనలను సరైన దారిలో పెడితే ఇలాంటి అద్భుతాలు సాధ్యమంటాడు వంశీ. ►ఉత్తర తెలంగాణ నుంచి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదేడుకు చెందిన సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు చకిలం వంశీకృష్ణ. ఓదేడు, మంథని, వరంగల్‌లో ఈయన బాల్యం గడిచింది. అక్కడే ప్రాథమికస్థాయి నుంచి డిగ్రీ వరకు చదువు పూర్తి చేశాడు. ఫిజిక్స్‌లో పీజీ చేసిన ఆయన ఐఐటీ, జేఈఈ లెక్చరర్‌గా కోటా(రాజస్థాన్), ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. ఐఐటీ రామయ్య, సూపర్ థర్టీ ఆనంద్ కుమార్ల నుంచి స్ఫూర్తి పొందాడు. వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా చేయాలనే ఆలోచన అక్కడే మొదలైంది. కెమిస్ట్రీ లెక్చరర్ చకిలం రేణుకతో వివాహమైన అనంతరం ‘సంకల్ప్’ స్థాపనకు బీజం పడింది. ► ర్యాంకులకు సూచిక భావిభారతానికి సేవ చేయాలనే లక్ష్యంతో తన శిష్యులను డాక్టర్లు, ఇంజినీర్లుగా.. సమాజానికి ఉపయోగపడే ఉన్నతాశయాలు కలిగినవారిగా తయారు చేస్తున్నాడు వంశీ. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ సీ్త్ర ఉంటుందనే నానుడిని నిజం చేస్తున్నారు ఆయన భార్య రేణుక. కెమిస్ట్రీ బోధకురాలైన ఆమె ‘సంకల్ప్’కు డెరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘సంకల్ప్’ ఘనత తమతో పాటు సహోపాధ్యాయులది కూడా అంటున్నాడు వంశీకృష్ణ. అందరి సమష్టికృషితోనే ఘనమైన ఫలితాలు సాధిస్తున్నామంటున్నాడు. ఆయన వద్ద చదివిన చాలామంది విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల్లో రూ. లక్షల్లో గడిస్తున్నారు. ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లుగానే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా కూడా స్థిరపడ్డారు. ఈ ఏడాది ప్రణతిరెడ్డి అనే విద్యార్థిని నీట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 45వ ర్యాంకు సాధించడం ‘సంకల్ప్’ సాధనకు గీటురాయిగా నిలిచింది. పదుల సంఖ్యలో ఐఐటీ, మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమైంది. తమ సంస్థలో ఏటా పది మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమేగాక కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నాడు వంశీకృష్ణ. భవిష్యత్తులో అనాథ పిల్లలకు శిక్షణను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమంటున్నారాయన. క్రమశిక్షణ నేర్పుతున్నారు నా కుమారుడు శ్రీనందన్‌రెడ్డి, కుమార్తె హర్షిత సంకల్ప్‌లో చదివారు. బేసిక్స్‌తో పాటు పోటీప్రపంచానికి తగ్గట్టు తీర్చిదిద్దారు. ప్రాబ్లం సాల్వింగ్‌తో పాటు క్రమశిక్షణ నేర్పారు. దీంతో ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సులభమైంది. శ్రీనందన్ 2019 ఆల్ ఇండియా నీట్లో 42వ ర్యాంకు సాధించారు. హర్షిత కూడా మంచి ర్యాంకు సాధించింది. – ఎ.ప్రసూన, ప్రొఫెసర్, హోమియో మెడికల్ కళాశాల సెల్ఫ్ లెర్నింగ్ అత్యావశ్యకం ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్ చాలా అవసరం. వారిని అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాం. మాస్టర్ టాస్క్ ఇచ్చి అదే పద్ధతుల్లో ప్రశ్నలు క్రియేట్ చేయమని చెబుతాం. ఇష్టంలో కష్టపడే వాతావరణం ఉండేలా చూస్తాం. – వంశీ, సంకల్ప్ సంస్థ సీమవాసుల అదృష్టం కడపలో ఇన్స్టిట్యూట్ పెట్టడం జిల్లావారికే కాదు సీమవాసులకు సైతం అదృష్టంగా మారింది. విద్యార్థులు బరువుగా కాకుండా, బాధ్యతగా చదువుకోవడాన్ని నేర్పి స్తున్నారు. దీంతో మావాడు కేవీపీఐ, మ్యాథ్స్ ఒలింపియాడ్, తదితర పరీక్షల్లో సైతం రాణించాడు. ఐఐటీలో 280 ర్యాంకుతో ఖరగ్ పూర్లో సీటు సాధించాడు. అమెజాన్‌లో సీనియర్స్ విభాగంలో ఇంటర్న్‌షిప్ సాధించాడు. – చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మామయ్య సలహాతో.. వంశీకృష్ణ మేనమామ రాజకీయ, సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. సంకల్ప్ స్థాపించాలనే తన ఆలోచనను ఆయనకు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉప యోగపడేలా సంస్థ ఉండాలని, రాయలసీమ అందుకు అనుగుణంగా ఉంటుందని నాగేశ్వర్ సలహా ఇచ్చారు. దీంతో రాయలసీమ నడిబొడ్డునున్న కడపలో సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
జేఈఈ–2024కి ఎన్నికల గండం!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2024కి పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో ఆటంకాలు తప్పేలా లేవు. జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌ల్లో నిర్వహిస్తోంది. అనంతరం జూన్/జూలై నాటికి అడ్వాన్స్‌డ్‌ను కూడా నిర్వహించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను చేపడుతోంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఆలస్యమై ప్రవేశాల్లో కూడా జాప్యం జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం.. దేశంలో ఎన్నికల హడావుడి డిసెంబర్‌కన్నా ముందే ఆరంభం కానుంది. ఆ నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లలో ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తంతు ముగిశాక 2024 మార్చి, ఏప్రిల్‌ల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లలోనూ అధికార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంటుంది. ఈ ఎన్నికల ప్రభావం జేఈఈపై పడుతుందని.. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం కాబట్టి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే పరిస్థితి.. జేఈఈ మెయిన్ 2022కు కూడా ఇలాగే ఆటంకాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలతో పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. ఆ విద్యా సంవత్సరానికి జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ ముందరి సంవత్సరం అంటే 2021 సెప్టెంబర్ నాటికే విడుదల చేయాల్సి ఉండగా 2022 ఫిబ్రవరిలో కానీ విడుదల కాలేదు. ఆ షెడ్యూల్‌ను కూడా మూడుసార్లు మార్చి విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఏటా జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించేలా ఈ పరీక్షల సాధారణ షెడ్యూల్ ఉండగా జేఈఈ–2022 మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు, రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల బోర్డుల పరీక్షలు అదే సమయంలో ఉండడం, సీబీఎస్ఈ ప్లస్2 తరగతుల పరీక్షల నేపథ్యంలో మళ్లీ రెండుసార్లు వేరే తేదీలను ప్రకటించినా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఆ ఏడాది జూన్, జూలైకు పరీక్షలను వాయిదా వేశారు. ఫలితంగా జూన్ 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆగస్టు 28కి వాయిదా పడింది. ఈసారి అంతకన్నా ఎక్కువగా డిసెంబర్ ముందు నుంచే ఎన్నికల హడావుడి ఆరంభం కానుండడం, ముఖ్యమైన పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి ఉండడంతో జేఈఈ పరీక్షలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయా విద్యాసంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 జేఈఈ షెడ్యూల్ సెప్టెంబర్‌లో విడుదల చేస్తారో, లేదో అనుమానమేనని అంటున్నారు. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
ఐఐటీ వదిలి కమెడియన్‌గా.. సంపాదన తెలిస్తే అవాక్కవాల్సిందే!
Biswa Kalyan Rath Success Story: ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తరువాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి సంపాదించడం ఆనవాయితీ. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది ఐఐటీయన్లు తమకు నచ్చిన ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'బిశ్వ కళ్యాణ్ రాత్' (Biswa Kalyan Rath). ఇంతకీ ఈయనెవరు? ఈయన సంపాదన ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిశ్వ కళ్యాణ్ రాత్ ఇండియన్ స్టాండ్-అప్ కమెడియన్, రచయిత అండ్ యూట్యూబర్. ఈయన తన తోటి హాస్యనటుడు కనన్ గిల్‌తో కలిసి యూట్యూబ్ కామెడీ సిరీస్, ప్రిటెన్షియస్ మూవీ రివ్యూస్ ద్వారా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా 2016 బ్రహ్మన్ నమన్ అనే నెట్‌ఫ్లిక్స్ కామెడీ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించాడు. ఆ తరువాత 2017లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లాఖోన్ మే ఏక్ని సృష్టించాడు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) నిజానికి బిశ్వ కళ్యాణ్ రాత్ 2012లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేట్, ఆ తరువాత బయోటెక్నాలజీ పూర్తి చేసాడు. చదువు పూర్తయిన తరువాత గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ వంటి వాటిలో పనిచేసాడు. ఈ సమయంలోనే అతను 2013లో బెంగుళూరులో ఒక ఓపెన్ మైక్ ఈవెంట్లో కనన్ గిల్‌ను కలిసి 2014లో తన ఉద్యోగాన్ని వదిలి కమెడియన్‌గా మారాడు. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) బిశ్వ కళ్యాణ్ రాత్ కమెడియన్‌గా మారిన తరువాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ అండ్ కోల్‌కతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బిస్వా మస్త్ ఆద్మీ అనే పేరుతో కామెడీ షో కూడా ప్రారంభించాడు. మొత్తానికి ఐఐటీ వదిలి కమెడియన్‌గా స్థిరపడిన బిశ్వ నికర ఆస్తి విలువ రూ. 11 లక్షల నుంచి రూ. 67 లక్షల వరకు అని సమాచారం. కాగా పాణిగ్రాహి అంబర్ ధార, దో సహేలియాన్ వంటి షోలలో పాపులర్ అయిన 'సులంగ్నా'ను 2020లో వివాహం చేసుకున్నాడు. -
పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది. -
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ) -
మన ఐఐటీలు ఆత్మహత్యా కేంద్రాలా?
టెక్నాలజీలో భారత్‌ను పటిష్ఠంగా మార్చాలన్న లక్ష్యంతో దేశంలో ఐఐటీలను నెలకొల్పారు. కానీ విదేశాల్లో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగిన తర్వాతే నిజంగా వీటి వైపు చూడటం మొదలైంది. దాంతో వీటిలో సీటు సంపాదించడమే లక్ష్యంగా కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక్కడి చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఒకటైతే; ఐఐటీల్లో చేరాక అక్కడి పోటీని తట్టుకోలేక తీవ్ర చర్యకు విద్యార్థులు దిగడం మరొకటి. ప్రొఫెసర్ల నిరంకుశ విధానాలు విద్యార్థుల మీద విపరీత ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యార్థులను దేశం ఆధారపడగల సమర్థ ఇంజనీర్లుగా, సాంకేతిక నిపుణులుగా మలచడానికి బదులుగా... విద్యా కర్మాగారాలుగా ఐఐటీలను మార్చడమే ప్రొఫెసర్ల ప్రాథమిక లక్ష్యంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ 1950లలో దేశంలో మొట్టమొదటి ఐఐటీని ఖరగ్‌పూర్‌లో నెలకొల్పారు. బోస్టన్లోని ఎమ్ఐటీ ప్రమాణాలకు అనుగుణంగా మన ఇంజినీరింగ్, టెక్నాలజీలను ప్రభావితం చేయ డమే దీని లక్ష్యం. అయితే అమెరికా, యూరప్‌లలో కంప్యూటర్ ఆధా రిత ఉద్యోగాలకు ఉన్నట్లుండి డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనే 1995 ప్రాంతంలో ఐఐటీలకు నిజమైన డిమాండ్ పెరిగింది. తదనుగుణంగా అనేక ఐఐటీలను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటీ, ఒక ఎన్ఐటీ ఉంటున్నాయి. రాన్రానూ డిమాండ్ పెరుగు తుండటంతో, మూడు ప్రవేశ పరీక్షలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియను ఐఐటీలు ప్రవేశపెట్టాయి. జేఈఈ–1(నవంబర్/డిసెంబర్), జేఈఈ– 2 (ఫిబ్రవరి), జేఈఈ–అడ్వాన్సుడ్ (జూన్). ఇంటర్ సిలబస్ పూర్తి కావడానికి ముందే తొలి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నది స్పష్టం. సిలబస్ బీఎస్సీ సెకండ్ ఇయర్ స్థాయిలో ఉంటుంది. అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో చేరాలని విద్యార్థులకు ఇది స్పష్టమైన సంకేతం. అందుకనే, ఇంటర్మీడియట్ గొలుసుకట్టు/కార్పొరేట్ రెసిడెన్షి యల్ కళాశాలలు దేశమంతటా, ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక్కడ చదువుకు అనుగుణమైన వాతావరణం ఉండదు. చిన్న నిద్రించే గదులుంటాయి, క్రీడలకు చోటుండదు, బయటి ప్రపంచంతో సంబంధాలుండవు. ఐఐటీలో సీటు కొడతారని, కోట్లాది రూపాయల వేతనాన్ని ఆర్జిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలను వీటిలో చేర్పిస్తారు. మరోవైపున క్రూరమైన టీచర్లు అవకాశం దొరికినప్పడల్లా విద్యార్థులను బాదిపడేస్తుంటారు. నిలబెట్టి మరీ అవమానిస్తుంటారు. ఆత్యహత్యకు పాల్పడటం కంటే ఎలాంటి అవకాశాలు విద్యార్థులకు ఉండటం లేదు. మానసిక కౌన్సెలింగ్ గురించి వారికి ఏమీ తెలీదు. టీచర్లు, వార్డెన్ల భౌతిక క్రూరత్వం, ఒక టీచర్ నిర్దాక్షిణ్యంగా బాదినప్పుడు తీవ్రంగా బాధ పడిన డేవిడ్ కాఫర్ఫీల్డ్ను గుర్తుకు తెస్తుంది. (1850లలో చార్లెస్ డికెన్స్ ఇదే పేరుతో రాసిన నవల ఇది). 2020లలో కూడా ఇలాంటి ఉదంతాలకు మనం సాక్షీభూతంగా ఉండటం దురదృష్టకరం. 2022 జనవరి 1 నుండి 2023 మార్చి వరకు 12 మంది ఇంట ర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యల పాలబడటం ఆందోళనకరమైన వాస్తవం. తాజాగా 2023 మార్చి 1న హైదరాబాద్ నగరంలోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ బాలుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఒక బలమైన సలహా ఏమిటంటే, పిల్లలు గణితంలో మెరుగ్గా ఉంటేనే జేఈఈ రెసిడెన్షియల్ కాలేజీలను ఎంచుకోవాలి. 2022 నాటికి, ఐఐటీ–జేఈఈ కోసం 11 నుండి 12 లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 2.7 శాతం మాత్రమే దేశంలోని100 కేంద్ర విద్యా సంస్థల్లో చేరగలరు. ఇటీవలి కాలంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజినీరింగ్ కళాశాలల వంటి విద్యాసంస్థలను, విద్యార్థుల ఆత్మహత్యలనే తరంగం వేధిస్తోంది. పరీక్షా వైఫల్యాలు, విద్యాపరమైన ఒత్తిడి, కులం, పట్టణ–గ్రామీణ, ధనిక –పేద, ఆంగ్ల నైపుణ్యం వంటి వివిధ కారణాలు ప్రకాశవంతమైన యువ మనస్సులను తీవ్రమైన చర్యలను ఆశ్రయించడానికి కారణ మవుతున్నాయి. 2018 నుంచి 2022 మధ్యకాలంలో కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీల్లో 33 మంది, ఎన్ఐటీల్లో 24 మంది ఆత్మ హత్య చేసుకున్నారని రాజ్యసభలో విద్యా మంత్రి పేర్కొన్నారు. అనేక ఐఐటీలలో, ఒక సాపేక్ష గ్రేడింగ్ విధానం అమలులో ఉంది. ఇందులో ఒక వ్యక్తి పనితీరును ఇతర ప్రకాశవంతమైన సహ విద్యార్థులతో పోల్చి కొలుస్తారు. దురదృష్టవశాత్తూ, ఈ వ్యవస్థ ఆచార్యులకు అపారమైన అధికారాన్ని కల్పిస్తుంది. వారు నిర్మాణాత్మక బోధన, పరిశోధనల కంటే తరచుగా వారి వ్యక్తిగత ప్రాధాన్యతలకు చోటిస్తారు. విద్యార్థులు ఈ సాపేక్ష గ్రేడింగ్ విధానం ఆధారంగా ఉన్నత ర్యాంకుల కోసం పోటీపడుతున్నందున, విద్యాపరంగా, వ్యక్తిగతంగా ప్రత్యర్థులుగా మారతారు. తమ సొంత గ్రేడ్లకు హాని కలిగిస్తారనే భయంతో విద్యార్థులు ఎలా కట్–థ్రోట్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు, నోట్సును ఎవరికీ చూపకుండా ఎలా దాచిపెట్టుకుంటున్నారు, ఒకరికొకరు సహకరించుకోవడానికి ఎలా నిరాకరిస్తున్నారు అనే అంశాలు దిగ్భ్రాంతికరమైన వివరాలు చెబుతున్నాయి. ఐఐటీల్లోని ప్రొఫెసర్లు తరచుగా తమను తాము క్రమశిక్షణకు సంరక్షకులుగానూ, సైన్స్ అండ్ టెక్నాలజీకి స్వయంప్రకటిత కర్తలు గానూ భావిస్తారు. వాస్తవానికి ఐఐటీలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లేదా పరిశోధన, అత్యాధునిక పురోగతి విషయంలో గణనీ యమైన కృషి చేసిన ప్రొఫెసర్లు చాలామంది లేరని తెలుసుకోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులను దేశం ఆధారపడగల సమర్థ ఇంజనీర్లుగా, సాంకేతిక నిపుణులుగా మల్చడానికి బదులుగా... విద్యా కర్మాగారాలుగా ఐఐటీలను మార్చడమే ప్రొఫెసర్ల ప్రాథమిక లక్ష్యంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. అకడమిక్ లిటరేచర్ని, ర్యాంకింగు లను నిశితంగా పరిశీలిస్తే, ఐఐటీలలోని పరిశోధనా ఫలితాలు పాశ్చాత్య దేశాలతో సమానంగా లేవని తెలుస్తుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలోని టాప్ 200 ర్యాంకులలో ఏ ఒక్క ప్రధాన ఐఐటీ కనిపించలేదు. సాహా, పీసీ రే, ఎస్.ఎన్.బోస్, విశ్వేశ్వరయ్య, కెఎల్. రావు, రామన్, కృష్ణన్, హోమీ భాభా వంటి గొప్ప శాస్త్రవేత్తలతో పోల్చ దగినవారిని ఎంతమందిని స్వతంత్ర భారతదేశంలో మనం తయారు చేశాం? హైడల్ పవర్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్‌తో సహా మన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఇప్పటికీ గ్లోబల్ టెండర్లపైనే ఆధారపడతాము. నౌకలను మరమ్మతు చేయడానికి కూడా మనవద్ద సాంకేతికత లేనందున రష్యాపై ఆధారపడుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ సహజ వాయువు పైప్‌లైన్ 20 రోజులు నిరంతరం మంటలతో ప్రజ్వలించినప్పుడు, వాటిని ఆర్పడానికి కూడా మనం నీల్ ఆడమ్స్‌ను విదేశాల నుండి రప్పించాల్సి వచ్చింది. ఐఐటీల్లో ఆత్మహత్యలు, ఒత్తిడి లేకుండా సమగ్ర మూల్యాంకనాన్ని నిర్ధారించడానికీ, ఐఐటీలలోని విద్యా, సామాజిక వాతా వరణాన్ని పరిశోధించడానికీ ‘అంబుడ్స్‌మన్ రకం’ వ్యవస్థను నియమించాలి. నియమాలు, అకడమిక్ గ్రేడింగ్ విధానాలను అన్ని ఐఐటీలలో ప్రామాణీకరించాలి. ఐఐటీ చార్టర్లలో నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. మనం తరచుగా వార్తాపత్రికలలో ఐఐటీల పరి శోధనా నివేదికలను చూస్తాము. ఇవి తరచుగా ‘తదుపరి అధ్యయ నాలు అవసరం’ అని ముగుస్తుంటాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యల ప్రాబల్యం ఒక బాధాకరమైన సమస్య. ఈ ఆత్మహత్యల వల్ల అంతర్జాతీయ విద్యా సంస్థలు, యాజమాన్యాల ముందు మన భారతీయ ప్రతిష్ఠ పలుచబారుతుంది. చివరగా, ఐఐటీలలో చేరే ప్రవేశ ప్రక్రియను వికేంద్రీకరించాలని సూచిస్తున్నాం. ప్రతి రాష్ట్రం ఒక ప్రవేశ బోర్డును కలిగి ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు, ప్రైవేట్ లేదా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆత్మహత్యలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ ప్రైవేట్ ఇంజి నీరింగ్ కళాశాలల నుండి లక్షలాది మంది విద్యార్థులు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ కంప్యూటర్ ఆధారిత కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఐఐటీ డిగ్రీ లేకపోయినా జీవితం ఉంది. టెక్నా లజీలో భారత్‌ను పటిష్టంగా మార్చాలన్న నెహ్రూ ఆశయం సమీప భవిష్యత్తులో నెరవేరుతుందా? నూతన విద్యా విధానం(ఎన్ఈపీ –2020) ఈ అంశాలను పరిశీలించాలి. డాక్టర్ కె. నాగయ్య, చీఫ్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ, హైదరాబాద్; ప్రొ‘‘ జి. శ్రీమన్నారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ విభాగం, ఉస్మానియా; ఫణిరాజ్ జి., ఐటీ ప్రొఫెషనల్, అమెరికా -
లెక్కలతోనే ఇక్కట్లు..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1.9 లక్షల మంది దరఖాస్తు చేయగా, అందులో 85 శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 44వేల మంది బాలికలు ఉన్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఈసారి ఈ పరీక్షలో ప్రశ్నల సరళి గతంలో మాదిరిగానే మధ్యస్థంగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు ఒకింత సులభంగా ఉన్నా, గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈసారి సిలబస్‌ను బోర్డు సిలబస్‌తో సమానంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌నే పేర్కొన్నప్పటికీ ప్రశ్నలను రూపొందించిన తీరు వినూత్నమైన రీతిలో ఉందని వివరించారు. ముఖ్యంగా గణితానికి సంబంధించిన ప్రశ్నల చిక్కులు విప్పడం విద్యార్థులకు కష్టంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షకు కోచింగ్ నిర్వహించిన కార్పొరేట్ విద్యా సంస్థ అకడమిక్ డీన్ ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం.. ఇక, ఐఐటీ గౌహతి ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్–1లో మొత్తం 180 మార్కులకు 51 ప్రశ్నలు అడిగారు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌లో 17 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగంలో 60 మార్కులు చొప్పున ప్రశ్నలిచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం మేథమెటిక్స్‌లో ప్రశ్నల సరళి అంతుచిక్కని రీతిలో కఠినంగా ఉంది. ‘ప్రశ్నలను అర్థంచేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువ సమయం మేథమెటిక్స్ విభాగపు ప్రశ్నలకే వెచ్చించాల్సి వచ్చింది’.. అని హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థి శ్రీకాంత్ వివరించాడు. ఫంక్షన్స్, మేట్రిక్స్, ఎల్లిప్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపాడు. ప్రాబబులీటీ, కాంప్లెక్సు నెంబర్స్, త్రీడీ, జామెట్రీల నుంచి కొంచెం మంచి ప్రశ్నలు వచ్చాయని మరికొందరు చెప్పారు. ఇక ఫిజిక్స్ విభాగంలో కైనమేటిక్స్, థర్మో డైనమిక్స్, మోడరన్ ఫిజిక్సు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, గ్రావిటేషన్, ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. మేథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోల్చిచూస్తే ఈసారి ఫిజిక్స్ సులభంగా ఉందనే చెప్పుకోవచ్చని పలు కోచింగ్ సంస్థల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నలు ఒకింత అసమతుల్యంగా ఉన్నా మేథమేటిక్స్ అంత గజిబిజిగా లేదన్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలను రాయడంలో విద్యార్థులు ఇబ్బందిపడినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి నేరుగా ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ కైనటిక్స్, లోనిక్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమినీస్, పాలిమర్స్, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా మిక్స్డ్ కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీలో కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. జూన్ 11న ప్రిలిమనరీ కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 11న ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు జూన్ 9 నుంచి వారికి అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. జూన్ 18న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. సీఆర్ఎల్ కటాఫ్ 86–91 మధ్య ఉండొచ్చు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులకు వారు సాధించిన మార్కుల ఆధారంగా రెండు రకాల ర్యాంకులను ప్రకటించనున్నారు. ఒకటి కామన్ ర్యాంకు లిస్టుకు సంబంధించినది కాగా.. మరొకటి అడ్మిషన్ల ర్యాంకుకు సంబంధించినది. అడ్మిషన్ల ర్యాంకులు మొత్తం సీట్లు, పరీక్ష రాసిన అభ్యర్థులు, సంస్థల వారీగా ఆయా సంస్థల్లో సీట్ల కేటాయింపులో చివరి ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ర్యాంకు కటాఫ్ నిర్ణయిస్తారు. అలాగే, ర్యాంకు లిస్టుకు సంబంధించి కటాఫ్ మార్కులు ఈసారి జనరల్ కేటగిరీలో 86–91 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓబీసీలో 71–76, ఈడబ్ల్యూఎస్‌లో 77–82, ఎస్సీలకు 51–55, ఎస్టీలకు 39–44గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
అడ్వాన్స్డ్ ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ అడ్వాన్స్‌డ్‌పై ఉంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష జూన్ 4వ తేదీన జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే కష్టపడకపోతే అడ్వాన్స్‌డ్‌లో గట్టెక్కడం అంత తేలికైన విషయమేమీ కాదని నిపుణులు అంటున్నారు. మంచి ర్యాంకు సాధిస్తేనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేసే అవకాశం దక్కుతుందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 99 పర్సంటైల్ వచ్చి న వాళ్ళ సంఖ్య ఈసారి వేలల్లో ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌లో నెట్టుకురావాలంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గణితంపై దృష్టి పెట్టాల్సిందే జేఈఈ మెయిన్స్‌లో గణితం పేపర్ ప్రతి ఏటా కఠినంగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌లో ఇది మరింత కష్టంగా ఉంటోంది. ప్రతి సబ్జెక్టుకూ 120 మార్కులుంటాయి. అయితే గణితంలో 20 మార్కులు సాధించడం గగనమవుతోంది. గత సంవత్సరం అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళల్లో ఈ మేరకు సాధించినవారు కేవలం 1,200 మంది మాత్రమే ఉన్నారు. ఇక రసాయన శాస్త్రంలో 20 మార్కులు దాటిన వాళ్ళు 2 వేలు, భౌతిక శాస్త్రంలో 4 వేల మంది ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఐఐటీ సీట్లకు కేవలం 55 వేల మందినే ఎంపిక చేస్తారు. అందువల్ల వడపోత కఠినంగానే ఉంటుంది. ఈసారి ఎక్కువమంది జేఈఈ మెయిన్స్ రాయడంతో కటాఫ్ కూడా పెరిగింది. కాబట్టి వడపోతకు వీలుగా అడ్వాన్స్డ్ పేపర్లు కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బోంబేదే హవా ఐఐటీల్లో బోంబేకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇందులో సీటు కోసం పోటీ పడుతుంటారు. తొలి 50 ర్యాంకుల్లో 46 మంది బోంబేలోనే చేరడం గమనార్హం. మొదటి వెయ్యి ర్యాంకుల్లో 246 మంది ఇక్కడ ప్రవేశం పొందారు. గత ఏడాది 3,310 మంది బాలికలకు ఇందులో సీట్లు దక్కాయి. ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందారు. అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 17.7 మంది సీట్లు పొందారు. విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైతే 66 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. కాగా తొలి వెయ్యి ర్యాంకుల్లో ఢిల్లీలో 210, మద్రాసులో 110, కాన్పూర్‌లో 107, ఖరగ్‌పూర్‌లో 93, గువాహటిలో 66, రూర్కీలో 60, హైదరాబాద్‌లో 40, వారణాసిలో 31, ఇండోర్‌లో ఏడుగురు, రోవర్లో ఒకరు చేరారు. -
జేఈఈ మెయిన్స్‌లో.. టాప్ లేపిన తెలంగాణ!
ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్టీఏ శనివారం వెల్లడించింది. టాపర్స్ వీరే.. జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు. రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు. కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ.. కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 90.788642 98,612 పీహెచ్ 0.0013527 2,685 ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057 ఓబీసీ 73.6114227 67,613 ఎస్సీ 51.9776027 37,536 ఎస్టీ 37.2348772 18,752 కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. – సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్ -
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్టీఏ సూచించింది. -
తిరుపతి ఐఐటీలో సందడి చేసిన సింగర్ నిఖితా (ఫొటోలు)
-
‘జేఈఈ’ సెషన్–2కు అభ్యర్థుల తాకిడి
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2023 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్ కన్నా రెండో సెషన్‌నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే, ఈసారి తొలిసెషన్ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్ కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్–1కు.. 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్ పరీక్షలు ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ సెషన్ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ ప్లస్2కు సంబంధించిన ప్రాక్టికల్స్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు.. ఇంటర్మీడియెట్ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తొలి సెషన్లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 30 లోపు ఇక జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశముంటుంది. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. -
చదువుల తల్లులు
సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల్లో మహిళల చేరికలు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. పదేళ్ల క్రితం అంతంతమాత్రంగా ఉన్న చేరికలు ప్రస్తుతం భారీగా వృద్ధి చెందాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులకే పరిమితమైన అమ్మాయిలు ఇప్పుడు స్టెమ్ (సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులకు పెద్దపీట వేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2016లో 8 శాతంగా ఉన్న మహిళల చేరికలు 2021లో 20 శాతానికి పెరగడం విశేషం. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో కూడా వీరి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మహిళల చేరికలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడం ఇందుకు దోహదపడింది. 2017లో ఐఐటీల్లో చేరిన మహిళలు 995 మంది ఉండగా 2021 నాటికి ఈ సంఖ్య 3 వేలకు చేరుకుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ స్టెమ్ కోర్సులకే అమ్మాయిలు ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ ఉన్నత విద్యా సర్వే నివేదిక ప్రకారం.. 2016–17లో స్టెమ్ కోర్సుల్లో చేరిన మహిళలు 41 లక్షలుగా ఉండగా 2020–21లో అది 44 లక్షలకు చేరింది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో కన్నా మనదేశంలో స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్న మహిళలు ఎక్కువ కావడం విశేషం. మనదేశంలో స్టెమ్ కోర్సులు చేస్తున్న మహిళలు 43 శాతం కాగా అమెరికాలో 34 శాతం, బ్రిటన్‌లో 38 శాతం, కెనడాలో 31 శాతం మాత్రమే. 2 కోట్లకు పైగా ఉన్నత విద్యార్థినులు కాగా కొద్దికాలం క్రితం విడుదలైన ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక ప్రకారం.. 2020–21లో ఉన్నత విద్యలో పురుషులు, మహిళల మొత్తం చేరికలు 4.14 కోట్లుగా ఉన్నాయి. 2019–20లో ఈ మొత్తం చేరికలు 3.85 కోట్లు కాగా ఏడాదిలో 30 లక్షల మంది అదనంగా చేరారు. వీరిలో 2019–20లో ఉన్నత విద్యలో చేరిన మహిళలు 1.88 కోట్లు ఉన్నారు. 2020–21లో ఈ సంఖ్య 2.01 కోట్లకు పెరిగింది. 2014–15 నాటి మహిళల చేరికల సంఖ్యతో పోలిస్తే దాదాపు 44 లక్షల మంది అదనంగా చేరారని ఐష్ నివేదిక పేర్కొంది. 2014లో పురుషులు, మహిళల మొత్తం చేరికల సంఖ్యలో మహిళలు 45 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం చేరికల్లో మహిళలు 49 శాతంగా ఉండడం విశేషం. పాఠశాల విద్యలోనూ బాలికల సంఖ్య జంప్.. పాఠశాల విద్యలోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) గణాంకాల ప్రకారం.. దేశంలో పాఠశాల విద్యలో (ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు) బాలికలు 12,73,35,252 మంది ఉన్నారు.కరోనా సమయంలో మొత్తం చేరికలు తగ్గిన నేపథ్యంలో బాలికల సంఖ్య కూడా కొంత తగ్గింది. ఆ తర్వాత మళ్లీ వారి చేరికలు పెరుగుతూ వస్తున్నాయి. -
జేఈఈ మెయిన్ తొలి విడతలో బాలుర హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్షల ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన 20 మందీ బాలురే కావడం గమనార్హం. 100 స్కోర్ పాయింట్లతో పాటు ఆ తర్వాత అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరైనవారేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల ఆధారంగా స్కోర్ పాయింట్లతో ఈ ఫలితాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వావిలాల చిద్విలాసరెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, ఎన్కే విశ్వజిత్, అభినీత్ మాజేటిలు 100 స్కోర్ పాయింట్లు సాధించినవారిలో ఉన్నారు. జనరల్‌లో 14 మంది, ఓబీసీల్లో నలుగురు, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు, ఎస్సీల్లో ఒకరు 100 స్కోర్ పాయింట్లు సాధించారు. బాలికల్లో టాప్ తెలుగు అమ్మాయిలే.. కాగా 100 స్కోర్ పాయింట్లు తర్వాత మంచి పాయింట్లు సాధించినవారిలో బాలికలు నిలిచారు. బాలికల విభాగం.. టాప్ టెన్‌లో 99.99 నుంచి 99.97 స్కోర్ పాయింట్లు సాధించిన పది మంది పేర్లను ఎన్టీఏ ప్రకటించింది. వారిలో టాప్‌లో మీసాల ప్రణీతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, మేథా భవానీ గిరీష్, సీమల వర్ష, అయ్యాలపు రితిక, పీలా తేజ శ్రీ, వాకా శ్రీవర్షిత, గరిమా కల్రా, గున్‌వీన్ గిల్, వాణి గుప్తా ఉన్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలే అధికం కావడం విశేషం. ఇక ఓబీసీ కేటగిరీలో బావురుపూడి రిత్విక్, ఈడబ్ల్యూఎస్‌లో మల్పాని తుషార్, దుంపల ఫణీంద్రనాధరెడ్డి, పెందుర్తి నిశ్చల్ సుభాష్, ఎస్సీ కేటగిరీలో కొమరాపు వివేక్ వర్థన్, ఎస్టీల్లో ధీరావత్ తనూజ్, ఉద్యావత్ సాయి లిఖిత్, దివ్యాంగుల్లో బి.శశాంక్, తుమ్మల తిలోక్‌లున్నారు. రెండో విడత దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్–1కు 8,60,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,23,967 (95.80 శాతం) మంది పేపర్–1 రాశారు. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు ఉద్దేశించిన పేపర్–2కు 46,465 మంది దరఖాస్తు చేశారు. పేపర్–2ను 95 శాతానికి పైగా రాశారు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. కాగా జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మంగళవారం (ఫిబ్రవరి 7) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 7 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి నాలుగో వారంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్!
టెక్నికల్ విద్య, బోధన విషయంలో ఐఐటీలు, ఎన్ఐటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. వాస్తవ ధృక్పథంతో ఈ విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలు, విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, జాబ్ రెడీ స్కిల్స్ విద్యార్థుల కెరీర్‌కు సోపానాలుగా మారుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు సంస్థలకు హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తున్నారు. భారీగా ప్యాకేజ్ ► ఐఐటీలు, ఎన్ఐటీ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఈ ఏడాది రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్లు ఖరారు కావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఇన్స్టిట్యూట్లుగా గుర్తింపు ΄పొందిన ఐఐటీ–ఖరగ్‌పూర్,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, చెన్నై వంటి క్యాంపస్‌ల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ► ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2023 బ్యాచ్‌కు సంబంధించి ప్లేస్మెంట్ ప్రక్రియ తొలి దశలో అత్యధిక వార్షిక వేతనం రూ.2.68 కోట్లుగా నమోదైంది. ఈ క్యాంపస్‌లో తొలి దశ డ్రైవ్స్‌లో 1600 మందికి ఆఫర్లు లభించాయి. రూ.50 లక్షలు కనిష్ట వార్షిక వేతనంగా నమోదైంది. 16 మందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయి. ► ఐఐటీ కాన్పూర్‌లో రూ.1.9 కోట్ల వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్ లభించింది. ఇలా మొత్తం 33 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ΄్యాకేజ్ ఖరారైంది. మొత్తంగా చూస్తే 947మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా, వాటిలో 74 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉండడం గమనార్హం. ► ఐఐటీ ఢిల్లీలో 1300కు పైగా ఆఫర్లు ఖరారవగా, 50 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక ΄్యాకేజ్ లభించింది. ఈ క్యాంపస్‌లో గరిష్ట వేతనం ఏకంగా రూ.నాలుగు కోట్లుగా నమోదవడం విశేషం. అదే విధంగా 30 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి. గత ఏడాదితో ΄ోల్చితే ఈ ఏడాది ఆఫర్లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ► ఐఐటీ చెన్నైలో రిక్రూట్మెంట్ డ్రైవ్ తొలి రోజే 445 మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవగా.. వారిలో 25 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం లభించింది. అంతేకాకుండా మొత్తం 15 మంది విద్యార్థులకు నాలుగు సంస్థల నుంచి ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కినట్లు ఐఐటీ చెన్నై క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ–ముంబై క్యాంపస్ డ్రైవ్స్‌లో ఇప్పటి వరకు 1500 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. వీటిలో 71 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉండగా.. 63 మంది వీటికి సమ్మతి తెలి΄ారు. అదే విధంగా 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక వేతనం ఖరారైంది. ఈ క్యాంపస్ తొలి దశ డ్రైవ్స్ ముగిసే సమయానికి అత్యధిక వార్షిక వేతనం రూ.4 కోట్లుగా నమోదైంది. ► ఐఐటీ–రూర్కీలో గరిష్ట వార్షిక వేతనం రూ.1.06 కోట్లుగా నమోదు కాగా, పది మంది విద్యార్థులకు రూ.80 లక్షలకు పైగా వేతనం లభించినట్లు రూర్కీ ప్లేస్‌మెంట్స్æ సెల్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ హైదరాబాద్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌లో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు లభించాయి. గరిష్ట వేతనం రూ.63.78 లక్షలుగా నమోదైంది. 54 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. ఐఐటీ–హైదరాబాద్‌లో ఏఐ బ్రాంచ్ తొలి బ్యాచ్‌లో 82 శాతం మందికి ఆఫర్లు దక్కాయి. ఈ క్యాంపస్‌లో సగటు వార్షిక వేతనం రూ.19.49 లక్షలుగా నమోదైంది. ► ఐఐటీ–గువహటిలో సైతం తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్‌లో గరిష్టంగా రూ.2.46 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్, రూ.1.1 కోటితో డొమెస్టిక్ ఆఫర్ ఖరారైంది. ఎన్ఐటీలదీ అదే బాట ► ఐఐటీల తర్వాత దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్‌లలో సైతం ఈ ఏడాది భారీగా ఆఫర్స్ లభించాయి. ► తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ఐటీ–వరంగల్‌లో రూ.88 లక్షల గరిష్ట వేతనంతో ఆఫర్ లభించింది. ఈ క్యాంపస్‌లో మొత్తం వేయి మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా.. సగటు వార్షిక వేతనం రూ.19.9 లక్షలుగా నమోదైంది. ► ఎన్ఐటీ హమీర్‌పూర్‌లో గతేడాది కంటే 39 శాతం అధికంగా సగటు వార్షిక వేతనం లభించింది. సగటు వార్షిక వేతనం రూ.12.84 లక్షలుగా, గరిష్ట వార్షిక వేతనం రూ. 52 లక్షలుగా నిలిచింది. ► ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో అయిదుగురు విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి. ► ఎన్ఐటీ కాలికట్లో సగటు వార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది. ► ఎన్ఐటీ పాట్నా క్యాంపస్‌లోనూ గరిష్ట వేతనం రూ.52 లక్షలుగా, సగటు వేతనం రూ.16.51 లక్షలుగా నమోదైంది. ► ఇతర ఎన్ఐటీల్లోనూ ఇదే తరహాలో గతేడాది కంటే పది నుంచి 20 శాతం అధికంగా ఆఫర్లు లభించడంతో΄పాటు, వేతనాల్లోనూ పది శాతానికిపైగా పెరుగుదల నమోదైంది. టాప్ రిక్రూటర్స్ వీరే ఐఐటీలు, ఎన్ఐటీల్లో టాప్ రిక్రూటింగ్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. క్వాల్ కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, గూగుల్, బార్క్లేస్, ఎస్ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్ అండ్ కో సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా ఉబెర్, హనీవెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఓఎన్జీసీ, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్టీఎం మైక్రోఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్ కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ్ర΄ోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్ డిజైనర్, ్ర΄÷డక్ట్ డిజైనర్, ఫుల్‌స్టాక్ ఇంజనీర్ జాబ్ ్ర΄÷ఫైల్స్‌లో అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి. డేటా అనలిస్ట్ జోరు ► ఈసారి ఐఐటీ, ఎన్ఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో డేటా అనలిస్ట్ ప్రొఫైల్ జోరు కొనసాగింది. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లోని సంస్థలు ఈ నియామకాలు చేపట్టాయి. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ సంస్థలు క్లయింట్స్, వినియోగదారులను పెంచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో డేటా అనలిస్ట్ జాబ్స్‌కు డిమాండ్ కనిపించింది. ► ఐటీ మొదలు ఆన్లైన్ టెక్నాలజీస్ ఆధారంగా సేవలందిస్తున్న అన్ని రంగాల్లోని సంస్థలు సాఫ్ట్వేర్స్ ్ర΄ోగ్రామింగ్, డిజైనింగ్‌కు ్ర΄ాధాన్యమిస్తుండడంతో.. కోడింగ్ విభాగంలో జాబ్ ప్రొఫైల్స్‌కు కూడా డిమాండ్ కనిపించింది. ఎస్పీఓల్లోనూ వృద్ధి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ ఏడాది సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లోనూ వృద్ధి కనిపించింది. దాదాపు అన్ని క్యాంపస్‌లలో నూటికి 80 శాతం మందికి సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయి. గరిష్టంగా రెండు నెలల కాలానికి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇచ్చే సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లో స్టయిఫండ్ మొత్తాలు కూడా ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.80 లక్షలు, సగటున రూ.30 లక్షల స్టయిఫండ్‌తో పలు సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్లు ఖరారు చేశాయి. రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ఐఐటీలు, ఎన్ఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొన్న సంస్థలు రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. తొలుత రిటెన్ టెస్ట్, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్, చివరగా టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలు చేపట్టి.. ప్రతిభ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేశాయి. కోడింగ్‌కే ప్రాధాన్యం సంస్థలు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కంపెనీలు రిటెన్ టెస్ట్‌లు, టెక్నికల్ రౌండ్స్‌లో కోడింగ్ సంబంధిత నైపుణ్యాలను ఎక్కువగా పరిశీలించినట్లు ఆయా క్యాంపస్‌ల ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. కోర్ ఇంజనీరింగ్, సర్క్యూట్ బ్రాంచ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌పై విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలి΄ారు. మార్చి నాటికి నూరుశాతం క్యాంపస్ డ్రైవ్స్ ప్రతి ఏటా డిసెంబర్లో ్ర΄ారంభమై.. మరుసటి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం అన్ని క్యాంపస్‌లలో తొలి దశ ముగిసింది. ఇందులో దాదాపు 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. మార్చి నాటికి నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు లభిస్తాయని ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వీయ అన్వేషణ దిశగా ఇప్పటికే పలు సంస్థలు లే అఫ్లు కొనసాగిస్తున్నప్పటికీ.. వాటి కార్యకలా΄ాల నిర్వహణకు మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్రెషర్స్‌ను నియమించుకుని తమ విధానాలు, సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే అవకాశముందంటున్నారు. టైర్–2 ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రం ఉద్యోగ సాధనలో క్యాంపస్ డ్రైవ్స్పైనే ఆశలు పెట్టుకోకుండా.. స్వీయ అన్వేషణ దిశగానూ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. సంస్థలు కోరుకుంటున్న కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని.. జాబ్ మార్కెట్లో ΄ోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ముఖ్యాంశాలు ► ఐఐటీలు, నిట్‌ల్లో 2023 బ్యాచ్‌కు ముగిసిన తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్. ► ఐఐటీ–ఢిల్లీలో రూ.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనంతో ఆఫర్. ప్రతి క్యాంపస్‌లోనూ గరిష్టంగా రూ.కోటికి పైగా వేతనం నమోదు. ► సగటు వార్షిక వేతనం రూ.36 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నమోదు. ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం పెరుగుదల. ► కోడింగ్, ఏఐ–ఎంఎల్, ఐఓటీ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంస్థలు. -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్–2023ను జూన్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2023 ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఫీజు చెల్లింపును మే 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేయాలి. అభ్యర్థులు https://jeeadv.ac.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. విదేశీ అభ్యర్థులు https:// jeeadv.ac.in/foreign. html ద్వారా రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు కంప్యూటరాధారితంగా నిర్వహిస్తారు. సంబంధిత పోర్టల్‌లో మాక్ టెస్టులనూ అందుబాటులో ఉంచుతారు. జూన్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచి, 11, 12 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, రిజల్స్‌ను జూన్ 18న ప్రకటిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గౌహతి సంస్థ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐటీ గౌహతి గురువారం షెడ్యూల్‌ను, సవివర బ్రోచర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు రెండు పేపర్లకూ హాజరవడం తప్పనిసరని పేర్కొంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులను (అన్ని కేటగిరీలకు సంబంధించిన వారిని) ఈ పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షలు రాసేందుకు వరుసగా రెండేళ్లు మాత్రమే అనుమతిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, తత్సమాన పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. 2021, అంతకు ముందు ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్సుడ్–2023కి దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ), రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) తదితర సంస్థలు కూడా ఈ సారి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఏపీలో పరీక్ష నిర్వహించే నగరాలు, పట్టణాలివే.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ. -
మెయిన్స్ షెడ్యూల్‌పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో నిర్వహించేవారు. జనవరి సెషన్‌కు సంబంధించి నవంబర్‌కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్‌ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్‌ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఇప్పుడేం చేయాలి? చేరిన 2 రోజులకే ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది!
ఇటీవల జరుగుతున్న పరిణామలు చూస్తుంటే ఐటీ రంగంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కంపెనీలు ఒకదాని వెనక మరొకటి తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటంతో పాటు ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. దీంతో లేఆఫ్‌లు తప్పవని కంపెనీలు చెబుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఫేస్బుక్లో ప్రస్తుతం ఉద్యోగాల పోగొట్టుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. అలా మోటా చేపట్టిన కోతలు వల్ల ఉద్యోగం పోయిన ఓ ఐఐటియన్ తన బాధని లింక్డిన్లో షేర్ చేశాడు. ఏం చేయాలి తెలియడం లేదు.. ఐఐటియన్ హిమాన్షు షేర్ చేసని పోస్ట్‌లో... “నేను అందరిలానే ఎన్నో కలలతో మెటా సంస్థలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. భవిష్యత్తు బాగుంటుందని భావించే లోపే ఊహించని షాక్ తగిలింది. ఉద్యోగంలో చేరిన 2 రోజులకే, కంపెనీ భారీ తొలగింపు కారణంగా మెటాలో నా ప్రయాణం ముగిసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్లిష్టసమయాలను ఎదుర్కొవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. అయితే తదుపరి కార్యాచరణ ఏమిటని, ఎటువంటి ఐడియా కూడా నాకు లేదని’’ తెలిపాడు. తనకు భారత్‌లో లేదా కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం కావాలని కోరుతూ ఈ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చాలా మంది హెచ్1బీ వీసాపై ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటాలో ఉద్యోగం చేసేందుకు హిమాన్షులానే విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఉద్యోగం పోవడంతో.. వారు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుకోవాల్సి ఉంది. లేదంటే.. ఆ దేశాలను విడిచి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఇబ్బందేంలేదు.. తేల్చిచెప్పిన ఐఐటీ-రూర్కీ
రామగోపాలరెడ్డి ఆలమూరు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల ముంపు సమస్యే ఉత్పన్నం కాదని ఐఐటీ–రూర్కీ కూడా తెగేసిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు గోదావరికి గరిష్టంగా వరద వచ్చిన సమయంలో సీలేరు, శబరి నదుల్లో ఏ స్థాయిలో వరద మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతేస్థాయిలో ఉంటుందని తేల్చింది. రూర్కీ–ఐఐటీ అధ్యయన నివేదికను పరిశీలిస్తే.. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఆ నివేదికను చూపుతూ ఒడిశా సర్కార్ చేస్తున్న వాదనలో వీసమెత్తు నిజం కూడా లేదన్నది స్పష్టమవుతోంది. గోదావరిలో గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్–ప్రాబబుల్ మాగ్జిమమ్ ఫ్లడ్), పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ–ఐఐటీలోని హైడ్రాలజీ విభాగంతో ఒడిశా జలవనరుల శాఖ అధ్యయనం చేయించింది. ఆ రెండు అంశాలపై రెండేళ్లపాటు అధ్యయనం చేసిన రూర్కీ–ఐఐటీ 2019, ఫిబ్రవరిలో ఒడిశా సర్కార్‌కు వేర్వేరుగా నివేదికలిచ్చింది. అందులోని ప్రధానాంశాలివీ.. ఏకరీతిలో వర్షం కురిస్తే.. గోదావరి పరీవాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతంలో 1986, ఆగస్టు 12–14 మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల ఆగస్టు 15, 16న మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్ (ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా)ల లో వర్షం కురిసిందని రూర్కీ–ఐఐటీ పేర్కొంది. దీనివల్ల గోదావరి ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు గరిష్టంగా 94,900 క్యూసెక్కులు (35,06,338 క్యూసెక్కులు) వరద వచ్చిందని వెల్లడించింది. గోదావరి చరిత్రలో ఇదే గరిష్ట వరద ప్రవాహం మొత్తం గోదావరి బేసిన్లో మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్లు 70 శాతంలో విస్తరించి ఉన్నాయని.. 1986, ఆగస్టు 15, 16న కురిసిన వర్షపాతం మొత్తం గోదావరి బేసిన్లో ఒకేరోజు.. ఒకే సమయంలో కురిస్తే.. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 1,64,872 క్యూమెక్కులు (58,05,143 క్యూసెక్కులు) వరద వచ్చే అవకాశముందని వివరించింది. ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం సాధ్యమా? వాతావరణ మార్పుల ప్రభావంవల్ల ప్రస్తుతం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలోనే ఏకరీతిలో వర్షం కురవడంలేదు. అలాంటిది ఆరు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్లో ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం కురవడం అసాధ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముంటుందని తేల్చిన ఐఐటీ–రూర్కీ అధ్యయనం శాస్త్రీయం కాదని స్పష్టంచేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు 1986, ఆగస్టు 16న వచ్చిన గరిష్ట వరద ప్రవాహం 35,06,338 క్యూసెక్కులను పరిగణలోకి తీసుకుంటే.. వెయ్యేళ్లకు ఓసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కులు, పదివేల ఏళ్లకు ఓసారి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరదవచ్చే అవకాశముందని ఐఐటీ–హైదరాబాద్ అధ్యయనంలో తేల్చడం గమనార్హం. ఇక గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కులకు మించి వరదవచ్చే అవకాశమేలేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. పోలవరం ప్రాజెక్టులోకి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించింది. ఆ మేరకే ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వేను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పులేదు ♦పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ– ఐఐటీ వెల్లడించిన అంశాలేమిటంటే.. ♦పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. కనిష్ట నీటిమట్టం 41.15 అడుగులు. గరిష్టస్థాయిలో నీటిని నిల్వచేస్తే.. 637 చదరపు కిలోమీటర్లు భూమి ముంపునకు గురవుతుంది. ఇందులో ఏపీలో 601, ఒడిశా లో 12, ఛత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. ఉంటుంది. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎగువ భాగంలో 145 కి.మీల దూరంలో దుమ్ముగూడెం ఉంటుంది. కూనవరం వద్ద శబరి నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఎగువన 72 కి.మీల పొడవున శబరి ప్రవహిస్తుంది. కొంటాకు 25 కిమీల ఎగువన శబరిలో సీలేరు నది కలుస్తుంది. ♦గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు కట్టకముందు సీలేరు నది 25 కిమీల వద్ద నీటిమట్టం 70.80 మీటర్లు ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిమట్టం 70.81 మీటర్లు ఉంటుంది. అంటే.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల పెరిగే నీటి మట్టం ఒక సెంటీమీటరే. ♦అలాగే, ఇదే స్థాయిలో వరద వచ్చినప్పుడు.. పోలవరం కట్టకముందు శబరి నదిలో 40 కిమీల వద్ద నీటిమట్టం 105.4 మీటర్లు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అది 105.4 మీటర్లే ఉంటుంది. అంటే.. శబరిపైనా పోలవ రం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదన్న మాట. ♦ఇక రూర్కీ–ఐఐటీ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సంస్థ అంచనా వేసిన మేరకు గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తగ్గిన ఉత్తీర్ణత శాతం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022లో గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. అలాగే ఈ ఏడాది పరీక్ష రాసినవారి సంఖ్య కూడా తక్కువ ఉంది. కరోనా సమయంలో కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోవడం గమనార్హం. గత నాలుగేళ్ల గణాంకాలను గమనిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. జేఈఈ మెయిన్‌లో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన టాప్ 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. అయితే 2.50 లక్షల మందికి అవకాశమిస్తున్నా అందులో లక్ష పైనే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేయడం లేదు. అలా దరఖాస్తు చేసిన వారిలోనూ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మరింత తగ్గుతోంది. 2019లో 2.50 లక్షల మందికి గాను 1,74,432 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఏడాది 1,55,538 మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్‌గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్‌టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్‌టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
అడ్వాన్స్‌డ్‌ను అధిగమిస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది. 2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్‌గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్గా కొనసాగుతున్నాయి. ప్రవేశానికి రెండంచెల విధానం.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు. 2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది. సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్‌లో, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది. -
28న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ – 2022 పరీక్షను ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్సైట్ (https://jeeadv.ac.in/) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు మినహా పాత విధానంలోనే పరీక్ష జరగనుంది. అడ్వాన్స్డ్ పరీక్షలో న్యూమరికల్ వ్యాల్యూ విభాగంలోని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు. తక్కిన విభాగాల్లోని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. జేఈఈ మెయిన్‌ను 13 మాధ్యమాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్‌డ్‌ను మాత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి.. మూడు గంటలు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పేపర్–1, పేపర్–2ల్లో ఒక్కోదానిలో 54 ప్రశ్నలుంటాయి. ఒక్కో పేపర్‌కు 180 చొప్పున మొత్తం 360 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు మినహా తక్కిన విభాగాల్లో తప్పుగా రాసినవాటికి నెగిటివ్ మార్కులుంటాయి. మార్కుల విధానంలో ఫుల్ మార్కులు, పార్షియల్ మార్కుల విధానం అమలవుతుంది. సెప్టెంబర్ 3న ప్రొవిజినల్ ‘కీ’.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐఐటీ భువనేశ్వర్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు ఐఐటీ మద్రాస్ జోన్ పరిధిలో 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రెస్పాన్సు కాపీలను సెప్టెంబర్ 1 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రొవిజినల్ ఆన్సర్ కీని అదే నెల 3న విడుదల చేస్తారు. వీటిపై 3, 4 తేదీల్లో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆన్లైన్లో స్వీకరిస్తారు. తుది ఆన్సర్ కీని, ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అదే రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను సెప్టెంబర్ 14న నిర్వహించి ఫలితాలను 17న విడుదల చేస్తారు. కాగా సెప్టెంబర్ 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
JEE Mains Results 2022: మనదే హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పేపర్ 1 (బీఈ, బీటెక్) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్ము లేపేశారు. దేశవ్యాప్తంగా 24 మందికి 100 ఎన్టీఏ స్కోర్ రాగా ఇందులో పది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. ఈ పది మందిలో ఐదుగురు మన రాష్ట్ర విద్యార్థులు ఉండగా, మరో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఈ మేరకు జేఈఈ మెయిన్ స్కోర్లు, ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. టాప్ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చోటు దక్కించుకున్నారు. పెనికలపాటి రవికిషోర్ ఆరో ర్యాంకు, మెండ హిమవంశీ ఏడో ర్యాంకు.. పల్లి జలజాక్షి 9వ ర్యాంకు సాధించారు. వీరు ముగ్గురుతోపాటు ఏపీకే చెందిన పోలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి రూపేష్ బియానీ, ధీరజ్ కురుకుంద, జాస్తి యశ్వంత్ వీవీఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, అనికేత్ ఛటోపాధ్యాయ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును శ్రేణిక్ మోహన్ సకల (మహారాష్ట్ర), రెండో ర్యాంకును నవ్య (రాజస్థాన్) సాధించారు. 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన 24 మందిలో ఇద్దరే బాలికలు. మిగతా 22 మంది బాలురే. పెరిగిన జనరల్ కటాఫ్.. కాగా జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికయ్యేందుకు జనరల్ విభాగం కటాఫ్ స్కోర్ గతేడాది కంటే పెరిగింది. మరోవైపు ఇతర కేటగిరీల్లో మాత్రం కటాఫ్ స్కోర్ తగ్గింది. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణిస్తారు. వీరు మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 1,01,250, ఈడబ్ల్యూఎస్ 25,000, ఓబీసీ 67,500, ఎస్సీలు 37,500, ఎస్టీలు 18,750 మందిని ఎంపిక చేస్తారు. ఈ అన్ని కేటగిరీల్లోనూ 0.05 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. మొదటి సెషన్లోనే అధికం జేఈఈ మెయిన్‌ను 2021లో కరోనా దృష్ట్యా నాలుగుసార్లు నిర్వహించగా ఈసారి మాత్రం రెండు సెషన్లకే పరిమితం చేశారు. జూన్ 24 నుంచి 30 వరకు మొదటి సెషన్, జూలై 25 నుంచి 30 వరకు రెండో సెషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,26,799 మంది దరఖాస్తు చేసుకోగా 9,05,590 మంది హాజరయ్యారు. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసిన వారు 4,04,256 మంది ఉన్నారు. అత్యధికంగా మొదటి సెషన్లో 8,72,970 మంది దరఖాస్తు చేయగా 7,69,604 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 6,22,034 మంది దరఖాస్తు చేయగా 5,40,242 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో 6,48,555 మంది బాలురు కాగా 2,57,031 మంది బాలికలున్నారు. ఐదుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ఎన్టీఏ పేర్కొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.ఇక పేపర్–2కు సంబంధించిన బీఆర్క్, బీప్లానింగ్ ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌కు 11 వరకు దరఖాస్తు గడువు.. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియను ఐఐటీ –బాంబే ఆదివారం (ఆగస్టు 7) నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే మెయిన్ ఫలితాలు సోమవారం వెలువడడంతో ఒక రోజు ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజును 12 సాయంత్రం 5 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులను 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 28న జరుగుతుంది. ప్రొవిజినల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 1న ప్రకటిస్తారు. వాటిపై అదే నెల 3, 4 తేదీల్లో అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకొని ఫైనల్ కీని, తుది ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేస్తారు. బీఆర్క్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను 14న నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఐఐటీ బాంబేలో చేరతా.. మాది గుంటూరు. నాన్న ఆదినారాయణ ప్రైవేటు సంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తారు. అమ్మ నందకుమారి స్టాఫ్ నర్సు. ఇంటర్మీడియెట్‌లో 962 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా స్థాయిలో ఆరో ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రణాళికాబద్ధంగానే చదవడంతోనే ఇంత చక్కటి ర్యాంకు సాధించగలిగా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంచుకుంటా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. – పెనికలపాటి రవికిషోర్, జేఈఈ మెయిన్, ఆలిండియా 6వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా.. మాది.. శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, అమ్మ స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంటర్మీడియెట్‌లో 972 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – ఎం.హిమవంశీ, జేఈఈ మెయిన్, ఆలిండియా ఏడో ర్యాంకర్ నా లక్ష్యం సివిల్స్.. మాది శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాకరపల్లి. నాన్న గోవిందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ జయలక్ష్మి గృహిణి. వారి ప్రోత్సాహంతోనే నేను రాణిస్తున్నా. ఇంటర్మీడియెట్‌లో 983 మార్కులు సాధించా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేశాక సివిల్స్ రాస్తా. సివిల్స్ సాధించడమే నా జీవితాశయం. –పి.జలజాక్షి, జేఈఈ మెయిన్, ఆలిండియా 9వ ర్యాంకర్ విద్యార్థులు సమానమైన స్కోరు సాధిస్తే.. ముందు ఎవరికి ప్రాధాన్యత? కంప్యూటర్ బేస్డ్లో జరిగే జేఈఈ మెయిన్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో రెండు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. ఎ–సెక్షన్లో ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున, బి సెక్షన్లో 10 చొప్పున ప్రశ్నలుంటాయి. ఎ–సెక్షన్‌లోని 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలివ్వాలి. ఇక బి సెక్షన్‌లోని న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. తప్పుగా సమాధానాలు రాసినవాటికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున మైనస్ చేస్తారు. రోజుకు రెండు బ్యాచుల చొప్పున ఐదారురోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షల్లో ఒకరోజు సులభం, మరో రోజు కష్టంగా ప్రశ్నలున్నా నార్మలైజేషన్ ద్వారా దాన్ని సరిసమానంగా ఉండేలా చేసి అభ్యర్థులకు స్కోరును నిర్ణయిస్తారు. ఈ విధానంలో ఏ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన స్కోరు ఉన్నా ‘టై బ్రేక్’ విధానాన్ని అనుసరించి ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రాధాన్యత క్రమంలో ఇలా ఉంటుంది. ► తొలుత మ్యాథమెటిక్స్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును పరిగణలోకి తీసుకొని అధిక స్కోరు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. ► రెండోదిగా ఫిజిక్సు స్కోరు, మూడోదిగా కెమిస్ట్రీ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► మూడింటిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్ ఉంటే.. పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి.. ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► అందులోనూ సరిసమానమైన స్కోర్ ఉంటే.. మ్యాథ్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీనిలోనూ సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీనిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్లు ఉంటే కెమిస్ట్రీలో తప్పు సమాధానాలు తక్కువ ఇచ్చి, సరైన సమాధానాలు ఎక్కువ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► ఒకవేళ ఈ అన్ని సబ్జెక్టులోనూ ఏ ఇద్దరు అభ్యర్థులు సమానంగా నిలిచినా ముందుగా వయసుపరంగా పెద్దవారికి ప్రాధాన్యమిస్తారు. ► అప్పటికీ సమానమైన పరిస్థితి ఏర్పడితే దరఖాస్తు నంబర్‌ను అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని ర్యాంకును ప్రకటిస్తారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ముంబై ఐఐటీ షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా పోర్టల్ అందుబాటులోకి తేవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. మెయిన్ తుది ఫలితాలపై స్పష్టమైన తేదీ, సమయాన్ని ప్రకటించాలని రెండు రోజులుగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, ఎన్టీఏ హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలు డ్రాప్ శుక్రవారం రాత్రికే విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్ష ఫైనల్ కీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయలేదు. రెండో సెషన్ ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలను ఎన్టీఏ డ్రాప్ చేసింది. ఆయా ప్రశ్నలకు ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండడంతో వాటన్నిటినీ డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాము ఇచ్చిన సమాధానాల సంఖ్యకు, రెస్పాన్స్ షీట్లలోని సంఖ్యకు వ్యత్యాసం ఉండడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలువురు ఎన్టీఏకు నేరుగా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నపాలు పంపుతున్నారు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలలో సమస్యలు నెలకొన్నట్లు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మెయిన్స్ రెండో సెషన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఆగస్టు 3వ తేదీన ఎన్టీఏ విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసినా వాటిలోనూ పొరపాట్లు దొర్లాయంటున్నారు. తొలిసెషన్ ప్రొవిజనల్ కీ తప్పుల తడక జూన్‌లో నిర్వహించిన తొలిసెషన్‌కు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్టీఏ జూలై 3వ తేదీన ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇచ్చిన కీ తప్పుల తడకగా ఉంది. ఒక విభాగం కీ వేరొక విభాగానికి జతచేయడంతో గందరగోళానికి గురయ్యారు. 130 నుంచి 200 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులకు 60 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఏకు విన్నపాలు వెల్లువెత్తాయి. అనంతరం ఎన్టీఏ ప్రాథమిక కీలో దొర్లిన పొరపాట్లను సవరించి మళ్లీ ప్రకటించింది. అడ్వాన్స్డ్ షెడ్యూల్ జారీ జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6వ తేదీకల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్సుడ్‌కు ఆగస్టు 7 నుంచి 11వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా ఆదివారం నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మూడో విడతకు విన్నపాలు మరికొందరైతే ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల సమయంలో వరదలు, వర్షాల వల్ల సరిగా రాయలేకపోయామని, పరీక్షలకు హాజరు కాలేకపోయామని అందువల్ల మరో సెషన్ పరీక్షలకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆదినుంచి అయోమయమే.. జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2021 నవంబర్ – డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి అనంతరం నెల వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. కానీ ఎన్టీఏ మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో షెడ్యూల్ ప్రకటించకుండా నాన్చింది. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించగా ఈదఫా రెండు సెషన్లకే పరిమితం చేసింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నల విభాగంలో మైనస్ మార్కులు లేవు. ఈసారి మాత్రం అన్ని విభాగాలకూ మైనస్ మార్కులను ప్రకటించింది. తొలి సెషన్ పరీక్షల తేదీలపై ఆయా రాష్ట్రాల బోర్డుల పబ్లిక్ పరీక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు తొలిసెషన్, మే 24 నుంచి 29వ తేదీవరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అప్పటికే షెడ్యూల్ విడుదలయ్యాయి. జేఈఈ పరీక్షలను కూడా అదే సమయంలో నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీల్లో మార్పులు చేసుకున్నాయి. అలా బోర్డులు మార్పులు చేసిన తరువాత ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను సవరించి ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీవరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు తమ పరీక్షల షెడ్యూళ్లను మళ్లీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అవి మార్పులు చేశాక ఎన్టీఏ మూడోసారి మళ్లీ జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది. జూన్ 20 నుంచి 29 వరకు తొలి సెషన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆ పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. తొలిసెషన్ను జూన్ 24 నుంచి, రెండో సెషన్‌ను జులై 25 నుంచి చేపట్టింది. -
6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఈ నెల 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది. 7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు కాగా జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. -
అడ్వాన్స్‌డ్‌లోనూ 'మెయిన్' అంశాలే
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2022లో జాయింట్ అడ్మిషన్ బోర్డు చేసిన మార్పులతో విద్యార్థులపై ప్రిపరేషన్ భారం తగ్గుతోంది. విద్యార్థులు ఆయా అర్హత పరీక్షల్లో నేర్చుకున్న సిలబస్‌తో అనుసంధానమయ్యేలా మెయిన్, అడ్వాన్స్‌డ్‌లోని అంశాలను మార్పు చేశారు. దీనివల్ల విద్యార్థులు గతంలో మాదిరిగా ఒత్తిడికి లోనుకారని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ తొలివిడత పూర్తయింది. ఈ నెల 25 నుంచి రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్‌ను దేశవ్యాప్తంగా 6.29 లక్షల మంది రాస్తున్నారు. వీరిలో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించనున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో కుస్తీ.. ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసినవారిలో అత్యధికులు ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా ఉద్యుక్తులవుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై దృష్టి సారించారు. మెయిన్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌లో ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ బోర్డుల సబ్జెక్టులతోపాటు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్‌లోనే డెప్త్.. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి అడ్వాన్స్‌డ్‌లో ఎలాంటి మార్పు లేకున్నా.. మెయిన్‌లోని అంశాలే కొంత లోతుగా ఉంటున్నాయని అంటున్నారు. అందువల్ల విద్యార్థులు ఎక్కువగా వీటిపై దృష్టి సారించాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జేఈఈ మెయిన్ కెమిస్ట్రీలో అదనపు అంశాలు చేర్చారని.. ఈసారి వాటిని అడ్వాన్స్‌డ్‌కు కూడా కొనసాగిస్తున్నందున ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఆ అంశాలను మెయిన్‌లో బాగా ప్రిపేర్ అయ్యేవారికి మేలు చేకూరుతుందంటున్నారు. కెమిస్ట్రీపైన గతంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం.. 20%కి పైగా ప్రశ్నలు ఉండేవని.. విద్యార్థులు వీటిపై ఎక్కువగా దృష్టి సారించేవారని అంటున్నారు. ఇప్పుడు మెయిన్‌కు చదివే వాటిని మళ్లీ పునశ్చరణ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని అంశాలు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాటికోసం డిగ్రీ, పీజీ స్థాయిల్లోని అంశాలను కూడా తీసుకొని బోధన చేయాల్సి వస్తోందంటున్నారు. అడ్వాన్స్‌డ్‌లో కొత్త అంశాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈసారి కొత్తగా గణితంలో స్టాటిస్టిక్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ వంటి అంశాలను చేర్చారు. ఇవి అడ్వాన్స్‌డ్‌లో గతంలో లేవు. మెయిన్‌లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటిని అడ్వాన్స్‌డ్‌లోనూ చేర్చడంతో విద్యార్థులకు వెసులుబాటు కలుగుతోందని ప్రముఖ కోచింగ్ సంస్థ అకడమిక్ డీన్ మురళీరావు అన్నారు. విద్యార్థులు మెయిన్‌లో వీటిని బాగా చదివి ఉంటారు కాబట్టి ఆ మేరకు ఇతర అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. అదనపు సమయాన్ని 10% వరకు ఇతర అంశాలకు కేటాయించవచ్చన్నారు. -
హైదరాబాద్ ఐఐటీ అదుర్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. హెచ్‌సీయూ భళా.. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ మిగులు సీట్లు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేటగిరీల్లో అర్హుల కొరతతోనూ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు చేరినవారిలోనూ కొంతమంది వేర్వేరు కారణాలతో మధ్యలో చదువు మానుకుంటున్నారు. దీనివల్ల కూడా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్డీ విభాగాల్లో గత రెండు, మూడేళ్లుగా మిగిలిపోతున్న సీట్లను గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్న సీట్లు.. కొన్ని కేటగిరీల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోతుండడంతో గత కొన్నేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. దేశంలో 23 ఐఐటీల్లో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీల్లో 2020–21లో 5,484 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో 476 సీట్లు బీటెక్లోనివే. ఇక పీజీ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ 5,296 సీట్లు మిగిలిపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. యూజీలో 361 సీట్లు, పీజీలో 3,083 సీట్లు, పీహెచ్‌డీలో 1,852 ఖాళీగా ఉండిపోయాయి. ఎన్ఐటీల్లోనూ మిగులు.. ఇక ఎన్ఐటీల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మొత్తం 31 ఎన్ఐటీల్లో 2020–21లో 3,741 సీట్లు, 2021–22లో 5,012గా ఉన్నాయి. యూజీ కోర్సుల్లో కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ సీట్లు మిగిలిపోతున్నాయి. 2021లో 2,487 మిగలగా 2021–22లో ఈ సంఖ్య 3,413కి చేరింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించలేకపోవడమే సీట్లు మిగిలిపోవడానికి కారణమని కేంద్రం గతంలోనే తేల్చింది. జాతీయ విద్యాసంస్థల్లోకి ప్రవేశించాలంటే నిర్ణీత పరీక్షల్లో అభ్యర్థులు అర్హత మార్కులను సాధించాల్సిందే. ముఖ్యంగా వివిధ రిజర్వేషన్ల కేటగిరీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. 2022–23కి సీట్ల అందుబాటు ఇలా.. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ తొలి విడతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే పూర్తి చేసింది. ఇక రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 11న అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర విద్యాసంస్థల్లో సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించనుంది. ఈసారి యూజీ ప్రథమ సంవత్సరానికి ఐఐటీల్లో 16,234, ఎన్ఐటీల్లో 23,997 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 110 జాతీయ విద్యాసంస్థలు దేశంలో ఐఐటీలు సహ వివిధ కేటగిరీల్లో 110 జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నవే. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు (ఐఐఎస్ఈఆర్లు), 29 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వివిధ విభాగాల వారీగా 50,882 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐఐటీలు, ఎన్ఐటీలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌కు ఏటా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించినవారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. ఇందులోనూ నిర్దేశిత అర్హత మార్కులు సాధించి టాప్‌లో నిలిచినవారిని ఐఐటీలకు ఎంపిక చేస్తున్నారు. మిగిలినవారికి ఎన్ఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), దివ్యాంగులు ఇలా ఆయా కేటగిరీల్లో సీట్లు కేటాయింపు జరుగుతోంది. -
జేఈఈ సెకండ్ సెషన్‌పై కన్ను
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్స్)–2022 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుంది. మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తొలి సెషన్ ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. తొలి సెషన్ పేపర్లలోని ప్రశ్నల స్థాయి ఒకింత క్లిష్టంగా, ఆధునికంగా (మోడరేట్) ఉండి విద్యార్థులను అయోమయానికి గురి చేశాయి. ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాలన్నీ ఇంచుమించు ఒకేలా.. సరైన సమాధానాలుగా స్ఫురించేలా ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడ్డారు. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగిటివ్ మార్కులను అమలు చేస్తున్న నేపథ్యంలో పొరపాటున తప్పుడు సమాధానామిచ్చే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండేవి కావు. ఇప్పుడు అన్ని విభాగాలకూ నెగిటివ్ మార్కులున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులకు మార్కుల స్కోరులో తగ్గుదల ఉందని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, కోచింగ్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సెకండ్ సెషన్‌పైనే అభ్యర్థుల దృష్టి ఇలాంటి పరిస్థితుల కారణంగా మొదటి సెషన్లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించింది. మొదటి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. తాజాగా బుధవారం ఎన్టీఏ మరో పబ్లిక్ నోటీస్‌ను విడుదల చేస్తూ జూలై 9వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11.50 నిముషాల వరకు ఆన్లైన్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణను కొనసాగించవచ్చని సూచించింది. ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. -
చేసింది ఐఐటీ.. ‘యోగా’లక్ష్యం కోటి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యోగాకు ప్రాచుర్యం బాగా పెరగడంతో అనేక మంది యోగాతో లాభాలు పొందుతూనే ఉన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన సౌరభ్ బోత్రా మరికొంతమంది ఐఐటీ, ఐఐఎమ్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తో ‘హాబిల్డ్’ పేరిట ఓ టీమ్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా ఎంతో మందికి యోగా చాలా సులువుగా నేర్పడంతో పాటు... దాని ప్రయోజనాలనూ పంచుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆయన 21 రోజులపాటు దేశవ్యాప్తంగా ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మీరు కూడా హాయిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఈ సందర్భంగా హాబిల్డ్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘నిజానికి యోగా మాస్టర్నైన నేను కూడా చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడ్డవాణ్ణే. నా బాల్యమంతా దగ్గుతూ సాగింది. వాతావరణం మారినప్పుడల్లా జలుబు, ఫ్లూ జ్వరాలతో బాధపడేవాణ్ణి. ఒకసారి నేను ఐఐటీ బీహెచ్‌యూలో ఉండగా అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం జరిగినప్పుడు నాకు యోగా, ధ్యానం గురించి తెలిసింది. నా సమస్యకు అదే పరిష్కారం అని అర్థమైంది. అంతే... ఆనాటి నుంచి ఈనాటివరకు... అంటే దాదాపు పదేళ్లకు పైగా నేనెప్పుడూ ఇన్హేలర్ ఉపయోగించలేదు’’ అని చెప్పారు. 21 రోజుల ఉచిత యోగా శిక్షణ గురించి వివరిస్తూ.. ‘‘నేను యోగా నుంచి ఎంతో ప్రయోజనం పొందాను. నేను పొందిన ప్రయోజనాలనే అంతర్జాతీయంగా కనీసం కోటి మందికి అందించాలన్నదే నా లక్ష్యం. మీరు మీ ఇళ్లలోనే ఉంటూ ‘ఆన్లైన్’లో ఉచితంగా యోగా నేర్చుకోవచ్చు. ఈ నెల 19 వరకు ఎంతమందైనా, ఏ సమయంలోనైనా ఉచితంగా చేరవచ్చు. ఈ 21 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజూ ఆన్లైన్ ద్వారా లైవ్ కార్యక్రమాల రూపంలో క్లాసులు నిర్వహిస్తాం. ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున ప్రతిరోజూ నాలుగు బ్యాచ్‌లు నిర్వహిస్తాం. ప్రతి బ్యాచ్ 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ టైమింగ్స్ ఏమిటంటే... 6.30 నుంచి 7.15, 7.30 నుంచి 8.15 వరకు ఉదయం బ్యాచ్.. 6.00 నుంచి 6.45 వరకు, 7.00 నుంచి 7.45 వరకు సాయంత్రం బ్యాచ్ నిర్వహిస్తాం’’ అని వివరించారు. habuild. in or https:// habit. yoga ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని.. 86000 39726 నెంబరుకు హాయ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా ఇందులో చేరవచ్చని తెలిపారు. -
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్‌ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్‌ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్‌లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
జేఈఈ మెయిన్ రెండో సెషన్ యథాతథం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్– 2022–23 సెకండ్ సెషన్ షెడ్యూల్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టే మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఏటీ) తెలిపింది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే పేర్కొన్నప్పటికీ మెయిన్ సెకండ్ సెషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌ను ముందు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ బోర్డుల పరీక్షల తేదీలతో అవి క్లాష్ అవుతుండడంతో ఆ తేదీలను ఎన్టీఏ మార్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ సెషన్ తేదీల్లో కూడా మార్పులు ఉండొచ్చని విద్యార్థుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఏ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. కాగా జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు సవరించుకోవడానికి ఈసారి అవకాశం లేనందున విద్యార్థులు ముందే తగు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఏ సూచించింది. న్యూమరికల్ ప్రశ్నలకూ నెగెటివ్ మార్కులు జేఈఈ మెయిన్‌లోని పేపర్–2 సెక్షన్ బీలో న్యూమరికల్ ప్రశ్నలకు గతంలో నెగెటివ్ మార్కులు ఉండేవి కావు. అయితే ఈసారి వాటికి కూడా ఎన్టీఏ నెగెటివ్ మార్కులను ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి ఒక్కో మార్కు కోత పడనుంది. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకొని సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్‌లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్‌కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్‌కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్‌తో ఆఫ్‌లైన్ మోడ్‌లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్‌లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్‌లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్‌తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీజీ చదివేవారేరి?
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోని వివిధ పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. బీటెక్‌తోనే విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. బీటెక్‌తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్‌లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లలో భర్తీ కాని సీట్లు.. గత రెండేళ్లలో ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కాగా కొత్త ఐఐటీలైన భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక 2021–22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. ప్లేస్మెంట్లకే విద్యార్థుల ప్రాధాన్యత మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ పూర్తికాగానే విద్యార్థులు మంచి కొలువులకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పీజీ, పీహెచ్డీ సీట్ల వైపు వారు మొగ్గు చూపడం లేదు. బీటెక్ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్‌డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలంటే ఆసక్తి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు మాత్రమే పీజీ, పీహెచ్‌డీల్లో చేరుతున్నారు. అయితే వీరి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. పైగా ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను నిర్వహిస్తున్నారు. బీటెక్ ఉత్తీర్ణులు గేట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాగ్ వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కాని సీట్లు ఎన్ఐటీల్లోనే అధికం ఐఐటీలతో పోలిస్తే ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతున్నట్టు కాగ్ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఎన్ఐటీల్లో సీట్లు భర్తీ కావడం లేదని పేర్కొంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఆరు నుంచి ఏడు రౌండ్ల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నా సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. కొన్నిసార్లు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను చేపడుతున్నా ఇదే పరిస్థితి. ఐఐటీలు, ఎన్ఐటీలు పరిశోధనలకు ఉద్దేశించినవే అయినా వాటిలో పీహెచ్డీ సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపినవారికే ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో మెరిట్ సాధిస్తున్నవారు లేకపోవడం కూడా ఈ సీట్లు మిగిలిపోవడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పీహెచ్డీ సీట్లు ఉండగా.. ఏటా 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ సిలబస్‌ను జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) సరళీకరించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలు, ఇంజనీరింగ్ కోర్సుల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల బోర్డులు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ అంశాల్లో పలు అంశాలను చేర్చారు. సవరించిన సిలబస్ 2023 జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఇంటర్ విద్యార్థులకు ఊరట ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు ఒకింత ఊరట కలగనుంది. వారు చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌లోనూ ఉండటంతో వారు ప్రత్యేకంగా వేరే అంశాలపై సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియెట్ సబ్జెక్టులతో పాటే అడ్వాన్స్డ్ అంశాలను కూడా ఒకే సమయంలో వారు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఇంటర్మీడియెట్‌కు, జేఈఈకి వేర్వేరుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఇపుడు రెండింటికీ కలిపి ఒకే సిలబస్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు జేఈఈ మెయిన్‌లో బోర్డు పరీక్షలలో ఉన్న అంశాలను కవర్ చేసినా, అడ్వాన్స్‌డ్‌లో మాత్రం వాటిని కలపలేదు. వేర్వేరు ఇతర అంశాలను ఉంచగా.. ఇప్పుడు వాటి స్థానంలో బోర్డు అంశాలను, ఇంజనీరింగ్ విద్యలో వచ్చే సంబంధిత అంశాలను సిలబస్‌లో చేర్చారు. దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళానికి తావుండదని, వారి అధ్యయనం సాఫీగా సాగుతుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. పోటీ ఇక తీవ్రం జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించి బోర్డుల సిలబస్‌లోని అంశాలతో సమానమైన మాదిరిగా మార్పులు చేసినందున ఆ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో బోర్డుల అంశాలకన్నా భిన్నంగా ఒకింత కఠినమైన రీతిలో జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే పరీక్షలను బాగా ఎదుర్కొనగలిగే వారు. కానీ.. ఇప్పుడు బోర్డులతో సమానం చేసినందున ఆ సిలబస్‌ను ప్రిపేర్ అయిన వారిలో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం కాగలుగుతారని, తద్వారా అత్యధిక మార్కులు సాధించగలవారు మాత్రమే ఎంపికవుతారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేందుకు పోటీ అత్యధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఐఐటీలు సహా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరిస్తుంటారు. అలాగే పాఠ్యప్రణాళికను పదేళ్లకోసారి పునర్వ్యవస్థీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించారు. 11, 12 తరగతులకు (ఇంటర్మీడియెట్) సంబంధించి ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సవరించింది. ఆ సంవత్సరంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సమీక్షించి మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ఈ సిలబస్ రివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఏడు ప్రధాన ఐఐటీలు ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, గౌహతి, రూర్కీలకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ ఫ్యాకల్టీ సభ్యులను నియమించారు. వీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సిలబస్ మార్పులపై సిఫార్సులు చేశారు. వారి విభాగాల వారితో పాటు ఇతర ఫ్యాకల్టీల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఈ సిఫార్సులు అందించారు. సబ్జెక్టుల వారీగా మార్పులు ఇలా.. భౌతిక శాస్త్రంలో ఇప్పుడున్న ఏ అంశాన్నీ తొలగించలేదు. కొన్ని అధిక స్కోరింగ్ అంశాలు జోడించారు. ఇవి మునుపటి కంటే సులభంగా ఉండేలా రూపొందించారు. ఎలక్ట్రానిక్ వేవ్స్, సర్ఫేస్ టెన్షన్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీని తొలగించారు. బయో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాలలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పెరియోడిక్టీ ఇన్ ప్రాపర్టీస్, హైడ్రోజన్, ఎఫ్–బ్లాక్ ఎలిమెంట్స్, క్రిస్టిల్ ఫీల్డ్ థియరీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే, బయో మాలిక్యూల్స్ వంటి అంశాలను జోడించారు. మేథమేటిక్స్‌లో హార్మోనిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్ సొల్యూషన్ అంశాలను తొలగించారు. ఆల్జీబ్రాలో ప్రాథమిక అంశాలు, చతుర్భుజ సమీకరణాలు, సెట్ సిద్ధాంతం, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ రోఆపరేషన్స్ వంటివి చేర్చారు. మేథ్స్, ఫిజిక్స్‌లో క్లిష్టత స్థాయి తగ్గినట్టే.. సిలబస్ సవరణ వల్ల మేథ్స్, ఫిజిక్స్‌లలో క్లిష్టత స్థాయి గతంలో కన్నా కొంత తగ్గినట్టేనని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులంటున్నారు. ఇంటతో సంబంధమున్న అంశాలను, సైద్ధాంతిక అధ్యాయాలను జోడించడం వల్ల రసాయన శాస్త్రం విభాగం కూడా సులభంగా మారొచ్చంటున్నారు. జేఈఈ మెయిన్ కన్నా భిన్నమైన రీతిలో అడ్వాన్స్డ్ ప్రశ్నల స్థాయి ఉంటున్నందున ఆయా అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్కోరు పెంచుకోవచ్చు జేఈఈ మెయిన్‌ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ స్కోరును పెంచుకోవడానికి ఈ విధానం వారికి ఆస్కారమిచ్చింది. ఇప్పుడు సిలబస్‌ను కూడా సవరించినందున మంచి స్కోరు సాధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలబస్‌ను మార్పు చేసినా ప్యాట్రన్ మాత్రం గతంలో మాదిరిగానే ఉండనుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ నుంచి టాప్ స్కోరులో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మెరిట్లో నిలిచిన వారికి రిజర్వేషన్ల ప్రకారం ఆయా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 11,326 సీట్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 13,376కు పెరిగింది. -
జేఈఈకి ఎన్నికల దెబ్బ!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పరీక్షకు ఈసారీ ఆటంకాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జేఈఈ పరీక్షలు ఈ ఏడాది కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానుండడంతో మెయిన్స్ పరీక్షలు ఆ తరువాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జేఈఈ మెయిన్స్ ఏడాదికి ఒకేసారి నిర్వహించగా 2021 నుంచి 4 దశల్లో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ఇచ్చింది. కరోనా వల్ల ఆ పరీక్షలు అక్టోబర్ నాటికిగాని పూర్తికాలేదు. దీని ప్రభావంతో 2021 డిసెంబర్లో విడుదల కావలసిన 2022 జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ఇప్పటివరకు రాలేదు. జనవరిలో విడుదల చేసి ఫిబ్రవరి నుంచి 4విడతల్లో పరీక్షలు నిర్వహించవచ్చని అందరూ భావించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జేఈఈ మొదటి దశ మార్చి ఆఖరులో నిర్వహించే అవకాశముందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్లలో మిగిలిన దశలను నిర్వహించి అనంతరం ‘అడ్వాన్స్’ను చేపట్టనున్నారు. ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం జేఈఈకి అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సీబీఎస్ఈ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జేఈఈకి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. అక్రమాలకు వీల్లేకుండా.. గత ఏడాది జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరగడంతో సీబీఐ దర్యాప్తు.. కొందరు కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల అరెస్టు.. 20 మంది విద్యార్థుల డిబార్ వంటి ఘటనలు తెలిసిందే. ఈసారి అటువంటి వాటికి తావులేకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు చేపడుతోంది. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. -
CAG Report: అయ్యయ్యో ఐఐటీ.. సమస్యలు తిష్ట
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. చదవండి: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23% అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
అడ్వాన్స్‌డ్‌కు మరోసారి చాన్స్
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత రెండేళ్లలో (2020, 2021) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ రెండేళ్లలో దరఖాస్తు చేసి, కరోనా వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. గత రెండు సంవత్సరాల్లో అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించి ఉంటే వారు జేఈఈ మెయిన్–2022తో సంబంధం లేకుండా నేరుగా అడ్వాన్స్‌డ్‌పరీక్షకు హాజరవ్వొచ్చు. వీరిని నేరుగా అనుమతించడంవల్ల జేఈఈ–2022 మెయిన్ అభ్యర్థులకు నష్టం కలగకుండా ఎన్టీఏ చర్యలు చేపడుతోంది. వీరిని జేఈఈ మెయిన్–22లో అర్హత సాధించే అభ్యర్థులకు అదనంగానే పరిగణించనుంది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ వరుసగా మూడేళ్లు, అడ్వాన్స్డ్ వరుసగా రెండేళ్లు రాసుకోవచ్చు. కోవిడ్ వల్ల పరీక్షలు రాయలేకపోయిన వారికి ఎన్టీఏ మరో అవకాశమిస్తోంది. ఈసారీ జేఈఈ షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. జనవరి మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశముంది. నాలుగు విడతల పరీక్షల్లో అక్రమాలు జేఈఈ మెయిన్ షెడ్యూల్ ఏటా ఆరు నెలల ముందు ప్రకటిస్తున్నారు. కరోనా వల్ల రెండేళ్లుగా షెడ్యూల్ ప్రకటన, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. 2021 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను 2020 డిసెంబర్లో ప్రకటించారు. పరీక్షలను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు విడతల్లో నిర్వహించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్ని సార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ఏ దశ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయో వాటిని పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది. అయితే చివరి రెండు విడతల పరీక్షలు చాలా ఆలస్యమయ్యాయి. జేఈఈ మెయిన్ 2021 సెప్టెంబర్ నాటికి కానీ పూర్తి కాలేదు. అయితే 2021 జేఈఈ మెయిన్ నాలుగు విడతల పరీక్షల నిర్వహణలో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయి. తొలి దఫా పరీక్షలో కనీస మార్కులు కూడా సాధించలేని కొందరు అభ్యర్థులు మలి విడతలో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తగా చివరకు సీబీఐ విచారణ చేపట్టింది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు అక్రమాలకు పాల్పడి పరీక్ష కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై కాపీయింగ్ చేయించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కోచింగ్ సెంటర్ల యజమానులు, సిబ్బందిని సీబీఐ అరెస్టు కూడా చేసింది. అక్రమ పద్ధతుల్లో ర్యాంకులు పొందిన 20 మంది ఫలితాలను ఎన్టీఏ రద్దు చేసింది.షెడ్యూల్ ఆలస్యం, గత పరీక్షల్లో అక్రమాలతో ఈసారి నాలుగు విడతల పరీక్షల విధానాన్ని అమలు చేస్తారా? మార్పులుంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిలబస్ యథాతథం కోవిడ్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో హయ్యర్ సెకండరీ (ఇంటర్మీడియెట్) పరీక్షలు గందరగోళంగా మారాయి. విద్యా సంస్థలు నడవక విద్యార్ధులకు బోధన కరవైంది. ఆన్లైన్ తరగతుల ప్రభావమూ అంతంతమాత్రమే. పలు రాష్ట్రాలు ఇంటర్మీడియెట్ సిలబస్‌ను కుదించాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలోనూ సమస్యలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఏ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇంటర్ పరీక్షలలో 75 శాతం మార్కులుండాలన్న నిబంధనను కూడా రద్దు చేసింది. ఈసారి జేఈఈకి ఇదివరకటి సిలబస్సే యథాతథంగా కొనసాగనుంది. 2023 నుంచి కొత్త సిలబస్‌ను ఎన్టీఏ ప్రకటించింది. -
‘అష్ట’కష్టాల్లో ఐఐటీలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23 శాతం అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
అమ్మాయిల ఐఐఠీవి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి. 2018 నుంచి అదనపు కోటా ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటర్లో రాణిస్తున్నా.. మండి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తిమోతి ఎ.గోన్సాల్వేస్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను కమిటీ లోతుగా విశ్లేషించింది. -
తగ్గేదేలే.. విద్యార్ధులకు అదిరిపోయే ఆఫర్లు, లక్షలు దాటి కోట్లలో జీతాలు!
కరోనా సంక్షోభం విద్యార్ధులకు కలిసొచ్చింది. ఐఐటీ విద్యార్ధులు క్యాంపస్ నుంచి బయటకు రావడమే ఆలస్యం కోట్లలో వేతనాలు చెల్లిస్తామంటూ దిగ్గజ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ బాంబే యూనివర్సిటీలో జరిగిన తొలిఫేజ్ ఇంటర్వ్యూలో ఆయా సంస్థలు 1400మంది విద్యార్ధుల్ని ఎంపిక చేసుకున్నాయి. వార్షిక వేతనాలు ఊహించని స్థాయిలో ఉండడంతో.. బాంబే యూనివర్సిటీ విద్యార్ధులు శాలరీలలో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేసుకున్నట్లు యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇలా ఒక్క బాంబే యూనివర్సిటియే కాదు. దేశం మొత్తం మీద మరో ఏడు యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధులు భారీ ఎత్తున ప్యాకేజీల్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో కోవిడ్ కారణంగా డిజిటలైజేషన్ వేగంగా వృద్ధి సాధింస్తోంది. దీంతో టెక్నాలజీ రంగంలో నిష్ణాతులైన ఉద్యోగులకోసం టాటా,ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు జరిపిన ఇంటర్వ్యూల్లో ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధులకు దేశీయ కంపెనీలు అధికంగా వార్షిక వేతనం కింద రూ.1.7 కోట్లు చెల్లించగా అంతర్జాతీయ కంపెనీలు రూ.2.2 కోట్లు చెల్లించాయి. ఈ శాలరీలు కోవిడ్ ముందు కంటే 19 శాతం అధికంగా ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీల్లో క్యాంపస్ ఇంటర్వ్యులు జరిగాయి. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 15 రోజుల పాటు జరిగిన ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో 1250 మంది ఎంపికయ్యారు. వారిలో 60 మంది కోటికి పైగా ప్యాకేజీని పొందారు.గతేడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది 45 శాతం మంది విద్యార్ధులు ప్లేస్మెంట్ సంపాదించారు. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ సెలక్షన్లలో 73 శాతం మంది విద్యార్ధులు జాక్ పాట్ కొట్టేశారు. వీరితో పాటు ఐఐటీ వారణాసి యూనివర్సిటీ, కాన్పూర్ ఐఐటీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కే, ఐఐటీ ఖరగ్‌పూర్ ఇలా అన్నీయూరివర్సిటీలకు చెందిన 185మంది విద్యార్ధులు కోటి కంటే ఎక్కువ వేతనాల్ని దక్కించుకున్నారు.కాన్పూర్ యూనివర్సిటీలో 49 మంది, మద్రాస్‌లో 27,బాంబేలో 12, రూర్కేలో 11, గుహతిలో 5, బీహెచ్‌యూలో ఒకరు రూ.కోటిపైగా ప్యాకేజీ అందుకున్నారు. 22మంది పైగా విద్యార్ధులు రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. ఐటీ రంగానికి భారీ డిమాండ్ కోవిడ్ కారణంగా అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. అయితే ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, దేశీయ కంపెనీలైన టాటా, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా,మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు వచ్చే ఏడాది మార్చి నెల ముగిసే సమయానికి 2లక్షలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న విషయం తెలిసిందే. చదవండి: భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..! -
జేఈఈ–2022 జాడేది?
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్–2022 షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్‌ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తం.. 2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా? జేఈఈ మెయిన్‌ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు. -
ఉబర్‌లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి. ఇంకొన్ని అయితే ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్ మనీ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. ఐఐటీలు.. వాటి ఆఫర్లు ఐఐటీ బాంబే: బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే మెరిట్–కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్ అలవెన్స్ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది. ఐఐటీ గాంధీనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ కామన్ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది. బీటెక్ నాలుగేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్షిప్ ఉంటుందని వివరించింది. ఐఐటీ భిలాయ్: అన్రిజర్వ్డ్ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్షిప్ను ఐఐటీ భిలాయ్ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్ మనీని అందించనున్నట్లు పేర్కొంది. ఐఐటీ మద్రాస్: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందితే పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్ –కమ్ –మీన్స్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్షిప్ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఐఐటీ కాన్పూర్ మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ ‘బ్రైట్ మైండ్ స్కాలర్షిప్’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంక్‌లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్షిప్ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్ ఫీజులను ఈ స్కాలర్షిప్ కవర్ చేస్తుంది. -
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్‌సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
హైడ్రోజన్ తయారీ ఇక సులువు
న్యూఢిల్లీ: సాధారణంగా హైడ్రోజన్ వాయువు తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. సహజ వాయువు తయారీతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవు తుంది. పైగా అంత సులువైన ప్ర క్రియేమీ కాదు. ఐఐటీ వారణాసి పరిశోధకులు వీటన్నింటికీ చెక్ పెడుతూ సులువుగా అప్పటికప్పుడు మిథనాల్ నుంచి అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేసేందుకు ఓ పరికరాన్ని రూపొందించారు. పెట్రోల్ బంకుల్లో స్థాపించి మెంబ్రేన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. ఇలా ఉత్పత్తయ్యే వాయువుతో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు ఇంధనంగా వాడుకోవచ్చు. అలాగే దీని నుంచి తయారైన విద్యుత్‌ను ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేసుకునేందుకు, మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని ఈ రూపకల్పనలో పాలుపంచుకున్న అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్ ఉపాధ్యాయ వివరించారు. ఈ పరికరాన్ని వినియోగించడం చాలా సులువని, 2 చదరపు మీటర్ల స్థలంలోనే ఇమిడిపోగలదని చెప్పారు. పైగా 0.6 లీటర్ల మిథనాల్ నుంచి దాదాపు 900 లీటర్ల హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చని వెల్లడించారు. ఈ పరికరాన్ని ఉపయోగించి పీఈఎం ఫుయెల్ సెల్ సాయంతో 1 కిలోవాట్ విద్యుత్‌ను తయారుచేసినట్లు చెప్పారు. -
అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవి బిడ్డలు 2014లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటంటే ఒక్కటే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీ సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2019లో ఐఐటీ, ఎన్ఐటీల్లో 20 సీట్లు, 2020లో 48 సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులు ఈ ఏడాది 89 సీట్లు సాధించి విద్యారంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలు కొండకోనల మధ్య అణగారిపోకుండా రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. గిరిజన గురుకుల కళాశాలలకు చెందిన 225 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కళాశాలలు మూసివేయటంతో వారికి ఇబ్బంది కలగకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారా అధ్యాపకులు శిక్షణ కొనసాగించారు. ప్రధానాచార్యులు, అధ్యాపకులు సైతం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్టడీ మెటీరియల్ అందించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యేటట్టు గిరిజన సంక్షేమ అధికారులు ప్రోత్సహించారు. ఇటువంటి గట్టి ప్రయత్నాల కారణంగా 225 మంది విద్యార్థుల్లో 214 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వారిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించారు. మరో 21 మంది విద్యార్థులకు ప్రిపరేటరీ కోర్స్ (ఏడాదిపాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎటువంటి అర్షత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. మరో 59 మంది విద్యార్థులు 7 వేల లోపు ర్యాంకులు సాధించారు. వీరికి జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చిన ర్యాంకులతో ఎన్ఐటీకి అర్హత లభించింది. సాంకేతిక సహకారం అందిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండె ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన గిరిజన గురుకులాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లుకు అర్హత సాధించిన గిరిజన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పొరపాటున కూడా అవకాశాలు కోల్పోకుండా చూసేలా సాంకేతిక సహకారం అందిస్తాం. మాక్ కౌన్సెలింగ్‌లో నిపుణులతో తగిన సాంకేతిక తోడ్పాటును అందించి అవగాహన కల్పిస్తాం. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు మొదటి ఏడాది ఫీజు చెల్లించడంతోపాటు ల్యాప్‌టాప్ కూడా అందిస్తాం. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోను ప్రభుత్వం అందించిన సహకారంతో రాణించిన విద్యార్ధులందరూ జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి మంచి భవిష్యత్ పొందాలి. – కె.శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ -
‘అడ్వాన్స్డ్’లో అదరగొట్టారు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ దెందులూరు/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్/చాగల్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–అడ్వాన్స్డ్–2021 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్–10లో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి (4), పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి (5), మొదుళ్ల హృషికేష్‌రెడ్డి (10), సవరం దివాకర్ సాయి (11) ర్యాంకులను సాధించారు. రామస్వామి సంతోష్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, ఓబీసీ కేటగిరీలో గొర్లె కృష్ణ చైతన్య ఆలిండియాలో మొదటి ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను శుక్రవారం పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్‌కు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. జోన్లవారీగా చూస్తే.. టాప్–100 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. జోన్లవారీగా టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్లో బాలాజీ సిద్ధార్థ్ (126వ ర్యాంక్), పట్నాన యశ్వంత్ నారాయణ (127వ ర్యాంక్) టాప్–5లో ఉన్నారు. విద్యార్థినుల వెనుకంజ ఈసారి జేఈఈ ర్యాంకుల్లో విద్యార్థినులు వెనుకబడ్డారు. ఆలిండియా స్థాయిలో టాప్–100లో ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాప్‌లో నిలిచింది. తెలుగు విద్యార్థినుల విషయానికి వస్తే ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన (107వ ర్యాంకు) అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మందికి అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1,41,699 మంది హాజరుకాగా.. వారిలో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకు గాను 348 మార్కులు వచ్చాయి. ఇక మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో సుమారు 7 వేల మంది ర్యాంకులు దక్కించుకున్నారని తెలుస్తోంది. 27న తొలి విడత సీట్లు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులు వెలువడడంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలొకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలొకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ విద్యా సంస్థలన్నింటిలో మొత్తం 50,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ర్యాంకర్ల అభిప్రాయాలు కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, ఆలిండియా ఐదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి, ఆలిండియా పదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజమండ్రిలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. నాన్న బాపూజీరావు మల్లవరంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. – ప్రగళ్లపాటి వెంకటరత్న సాయికుమార్, ఆలిండియా 21 ర్యాంకర్ ఏఐలో శాస్త్రవేత్తనవుతా.. మాది పాలకొల్లు. నాన్న త్రినాథరావు.. పారిశ్రామికవేత్త, అమ్మ మోహన కృష్ణకుమారి.. గృహిణి. అన్నయ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. నాకు తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్, ఏపీఈసెట్‌లో 9వ ర్యాంక్, జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంక్ వచ్చాయి. ఐఐటీ – బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శాస్త్రవేత్తనవుతా. – సత్తి కార్తికేయ, ఆలిండియా 33వ ర్యాంకర్ సైంటిస్టుని కావాలన్నది నా కల మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు. సైంటిస్టును కావాలన్నది నా కల. మొదటి నుంచీ అమ్మానాన్న డోమ్నిక్, విజయలక్ష్మి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. సైంటిస్టుగా మానవ చరిత్రలో బయటకు రాని విషయాలను వెలికితీయాలన్నదే నా లక్ష్యం. నాసాలో సైంటిస్టుగా పనిచేస్తా. తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తా. – బొంతు మాథ్యూస్, ఎస్టీ కేటగిరీలో 44వ ర్యాంకర్ -
సిటీ పొల్యూషన్‌కి మంచి సొల్యూషన్ ‘లివింగ్ ల్యాబ్’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరమైంది. అభివృద్ధి మంచిదే. కానీ అభివృద్ధితోపాటు వృద్ధి చెం దుతున్న కాలుష్యం నగర జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది. నగరాల్లోని గాలి నాణ్యత అక్కడి ప్రజల జీవన నాణ్యతను తెలియజేస్తుందంటారు. ఢిల్లీ లాంటి మహా నగరాలలాగా కాదు.. హైదరాబాద్ గాలిలో విషపూరిత వాయువులు అధికమయ్యాయి. వీటి నంచి బయటపడేందుకు గాలితోపాటు నీరు, విద్యుత్‌ను కాపాడుకోవడాకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఓ వినూత్న ఆలోచన చేసింది. అదే క్యాంపస్ లో స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు. 2019 నుంచి ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షణలో ఉన్నది ట్రిపుల్ ఐటీ క్యాంపస్. యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నోవేషన్ ఎరీనా (ఏఐఏ), అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తెలం గాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నవి. లివింగ్ ల్యాబ్ ఎలా పనిచేస్తుందంటే.. ► గాలి నాణ్యత మాత్రమే కాదు... నీటి నిర్వహణ, విద్యుత్ వినియోగం ఎలా ఉంది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అన్ని అంశాలను ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షిస్తున్నది. ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత అంచనా... ► ప్రతి పదిహేను సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెక్కించి సర్వర్కి పంపిస్తుంది ట్రిపుల్ ఐటీలోని ల్యాబ్. వాయి వేగాన్ని, దిశను, గాలిలోని ఉష్ణోగ్రతలు, తేమను సైతం తెలుపుతుంది. నీరు వృథా కాకుండా... ► ప్రతి 4 గంటలకోసారి నీటిలోని లవణాలు, గాఢత స్థాయిలను లెక్కిస్తుంది. నీటి వృథాని నివారించడం కోసం, దుర్వినియోగం చేయకుం డా ఉండటం కోసం ఏర్పాటు చేసిన నియత్రణ పరికరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను, వర్షపా తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. విద్యుత్ వినియోగంపైనా ఓ కన్ను... ► మానవ జీవితంలో మరో నిత్యావసరం విద్యుత్. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బల్బులు, ఫ్యానులు, ఇతర పరికరాల విద్యుత్ వినియోగాన్ని, సోలార్ విద్యుత్ వినియోగ డాటాని ల్యాబ్‌లోని నోడ్స్ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలవుతుంది. ఉల్లంఘనలను పసిగడుతుంది... ► సహజవనరులను కాపాడుకోవడమే కాదు... మహమ్మారుల నుంచి రక్షించడానికీ కొన్ని పద్ధతులున్నాయి. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఎక్కువమంది గుమిగూడినా, భౌతికదూరం పాటించకపోయినా.. ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఈ లివింగ్ ల్యాబ్ కనిపెట్టేస్తోంది. ఇలా అన్ని విభాగాల నుంచి సమాచారం ఒకే దగ్గరకు రావడంతో... అన్ని సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెక్ పెడుతున్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, నగర మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శక్తి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ అవసరం: లీడ్ ఆర్కిటెక్ట్ అనురాధ ఈ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు నాణ్యత, విద్యుత్ వినియోగం మాత్రమే కాదు... కోవిడ్ నిబంధలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా క్యాంపస్‌లో కోవిడ్–19 వ్యాప్తిని అదుపులో ఉంచగలిగాం. లివింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో అంతర్జాతీయ విలువలు కలిగిన ఓఎం2ఎం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాం. ఐయూడీఎక్స్తో కలిసి బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు: పరిశోధక విద్యార్థులు ఇది జాతీయ, ప్రపంచవ్యాప్త వినియోగంలో ఉన్న ప్లాట్పామ్. ఒక్క క్యాంపస్‌లోనే కాదు.. నగరపాలన, పౌరుల రోజువారీ సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇది. -
ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను..
న్యూఢిల్లీ: ఐఐటీ విద్యార్థి అనగానే చదువు పూర్తి అయ్యేసరికి లక్షల్లో ఉద్యోగం లేదా సొంతంగా స్టార్టప్ కంపెనీ ఐడియాతో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అందరు భావిస్తుంటారు. కానీ ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం అమ్మాయిలు, టీచర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. ఖరగ్‌పూర్ ఐఐటీలో మహవీర్ బీ.టెక్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను నార్త్ ఢిల్లీలోని ఓ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినులను, టీచర్లను వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో బాధితులను సంప్రదించడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి, వాట్సప్‌లో వర్చువల్ నంబర్ల కోసం యాప్‌లను ఉపయోగించేవాడు. తెలివిగా తన ఐడెంటిటీ దాచేందుకు, అతను వాయిస్ మార్చే యాప్‌ని కూడా ఉపయోగించేవాడు. అమ్మాయిల పేర్లపై నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసిన అతను .. బాధితుల మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసేవాడు. ఈ అకృత్యాలకు సంబంధించి బుధవారం పాఠశాల యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి జరిపిన దర్యాప్తులో.. వేరువేరు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి టీచర్లకు, బాలికలకు ఫోన్ కాల్ చేసి వేధించినట్లు తెలిసింది. ఆన్లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి ఆ ఐఐటీ విద్యార్థి వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. స్కూల్ విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులను కూడా విచారించారు. నిందితుడికి చెందిన పలు వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఇన్‌స్టా ప్రొఫైల్స్, ఫేక్ కాలర్ ఐడీ యాప్‌లను గుర్తించారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఐడీల లాగిన్స్‌ను పరిశీలించగా అతను పాట్నా నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మొదట ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పరుచుకున్న మహవీర్.. ఆ తర్వాత బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫ్రెండ్స్‌తో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఐఐటీ విద్యార్థి కావడంతో పాటు యాప్ టెక్నాలజీలో మంచి నాలెడ్జ్ ఉండడంతో అతనికి విద్యార్థులను, మహిళలను వేధించడం సులువైంది. ఇందులో కొందరు మైనర్ బాలికలను కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భార్యను కొట్టి చంపి.. మృత దేహంపై కూరగాయల బస్తాలు వేసి.. సొంతూరికి -
మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని వివిధ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సీట్ల కేటాయింపు ఈ విద్యాసంవత్సరం నుంచి మారనుంది. ఇప్పటివరకు అన్ని ఐఐటీల్లోని సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది మాత్రం ఈ విధానాన్ని తొలగించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన మహిళల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే 20 శాతం కోటా సీట్లను నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల ఈ మార్పులను ప్రకటించింది. అర్హులైన మహిళా అభ్యర్థుల అందుబాటును అనుసరించి సూపర్ న్యూమరరీ సీట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆయా ఐఐటీలకు కల్పించింది. ఐఐటీల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు 2018 నుంచి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐఐటీల్లోని మొత్తం సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో కేవలం మహిళలకు కేటాయించేలా అదనపు సీట్లను ఏర్పాటు చేయించింది. 2018–19లో 14 శాతం సీట్లను ఇలా కేటాయించగా, 2019–20లో ఈ సంఖ్యను 17 శాతానికి పెంచింది. 2020–21లో దీనిని 20 శాతం చేసింది. ఇక 2021–22 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆయా ఐఐటీలే ఈ 20 శాతం కోటాపై నిర్ణయం తీసుకునేలా చేసింది. గత ఏడాది కరోనా వల్ల జేఈఈ మెయిన్‌లో అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రాయలేకపోయారు. వారికి ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నేరుగా రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. వీరు గత ఏడాది జేఈఈ మెయిన్ అర్హతతోనే ఈ అడ్వాన్స్‌డ్‌ను రాసే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.50 లక్షల మందికి వీరు అదనం. ఈ కారణంగానే మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపును ఆయా ఐఐటీలకు అర్హత సాధించే మహిళల సంఖ్యను అనుసరించి నిర్ణయం తీసుకునేలా కొత్త మార్పు చేశారు. గత ఏడాదిలో అర్హులైన మహిళలు లేకపోవడం వల్ల పలు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా సీట్లు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. కొన్ని ఐఐటీల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నా సూపర్ న్యూమరరీ కోటాను అనుసరించి సీట్లకేటాయింపు చేశారు. ఈనేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా ఈసారి మార్పులు చేశారు. టాప్ 100 అభ్యర్థులకు పూర్తి రాయితీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన వారిలో మొదటి 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్లు తమ ఐఐటీలో చదువులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కాలర్షిప్ కింద అందించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఫుల్ స్కాలర్‌షిప్‌నకు అర్హులని వివరించింది. ‘పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫుల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈఈ ర్యాంకర్స్’ పేరిట అందించనుంది. దీనికింద ఇనిస్టిట్యూషన్ ఫీజు, వసతి భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు ఇతర వ్యయాలను కూడా ఐఐటీయే భరిస్తుంది. వీటితోపాటు ప్రతినెలా పాకెట్ మనీ కూడా అందిస్తుంది. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్డ్–2021 నిర్వహించింది. 15న ఫైనల్ కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సంబంధిత వెబ్సైట్లో ఈనెల 5నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ ప్రకటించనున్నారు. 10, 11 తేదీల్లో ప్రాథమిక కీపై అభ్యర్థులు వారి అభ్యంతరాలను ఆధారాలతో సహా ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం అక్టోబర్ 15న ఫైనల్ కీ, తుది ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేయనుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. 16 నుంచి కౌన్సెలింగ్ దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాల కోసం జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలు, ర్యాంకులు విడుదలైన అనంతరం జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో ఇచ్చే వెబ్ ఆప్షన్లను అనుసరించి వారి ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రశ్నల తీరిలా.. జేఈఈ అడ్వాన్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా అడిగినట్టు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో సరిసమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వచ్చినట్టు పలు కోచింగ్ కేంద్రాల నిపుణులు విశ్లేషించారు. గతానికీ.. ఇప్పటికీ ప్యాట్రన్‌లో స్వల్పంగా మార్పు చేశారని, ప్రతి విభాగంలో 19 ప్రశ్నలు చొప్పున 57 ప్రశ్నలను 180 మార్కులకు ఇచ్చారని వివరించారు. ఆయా సబ్జెక్టులలో నాలుగు సెక్షన్లుగా ప్రశ్నలు పొందుపరిచారని, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఇంటర్మీడియెట్ రెండేళ్లకు సంబంధించిన టాపిక్‌లను కవర్ చేస్తూ ప్రశ్నలు అడగ్గా, ఫిజిక్సులో ఇంటర్ ఫస్టియర్ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని విజయవాడకు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వివరించారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పోల్చుకుంటే మేథమెటిక్స్ ప్రశ్నలు ఒకింత కఠినంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఎన్సీఈఆర్టీలో ఉన్న వాటిని యథాతథంగా అడిగారని వివరించారు. ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అంశాలతో పాటు మోడ్రన్ ఫిజిక్స్ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. మ్యాథమెటిక్స్‌లో మేట్రిక్స్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ, డిఫరెన్షియలబిలిటీ, 3డీ జియోమెట్రీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని గమ్మత్తయిన ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు పేర్కొన్నారు. -
అక్టోబర్ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లతో పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా–2021) ఇంతకు ముందే అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాక అడ్మిషన్ల ప్రక్రియను జోసా ప్రారంభించనుంది. జేఈఈ మెయిన్ తుది విడత ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ పరీక్షల ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11కి ముందే జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలవుతాయని భావించారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆ పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ ఖరగ్‌పూర్ ముందు నోటిఫికేషన్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఆలస్యం కావడంతో ఈ నెల 13కి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసింది. మెయిన్ ఫలితాలు 14న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీని సెప్టెంబర్ 21 (నేడు) వరకు ఐఐటీ ఖరగ్‌పూర్ పొడిగించింది. అడ్వాన్స్‌డ్‌కు 2.50 లక్షల మంది.. జేఈఈ మెయిన్‌లో నిర్దేశిత కటాఫ్‌తో మెరిట్లో ఉన్న 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అక్టోబర్ 3న పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అక్టోబర్ 5 సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. దీనిపై 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 15న అడ్వాన్స్డ్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేస్తారు. 16 నుంచి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జీఐఎఫ్‌టీ)ల్లోని సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా అభ్యర్థులకు కేటాయించనుంది. మెయిన్ పరీక్ష స్కామ్‌లో 20 మంది విద్యార్థులపై వేటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,39,008 మంది దరఖాస్తు చేశారు. చివరిదైన నాలుగో సెషన్లో 7 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే తుది ఫలితంగా ఎన్టీఏ పరిగణించింది. అయితే చివరి సెషన్లో కొందరి స్కోర్ తొలి సెషన్ స్కోర్ కంటే అమాంతం పెరిగిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. హరియాణాలోని సోనిపట్‌లో ఒక కేంద్రంలో పరీక్షలు రాసిన వారికి ఇలా అత్యధిక మార్కులు వచ్చాయి. అంతకు ముందు 38, 40కి మించి స్కోర్ రానివారు ఏకంగా 95 నుంచి 99 పాయింట్ల స్కోర్ సాధించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణ చేపట్టి ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ స్కామ్‌లో ఉన్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్ చేసింది. -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది. -
నెంబర్ వన్‌గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు. టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి. వర్సిటీ కేటగిరీల్లో హెచ్సీయూకు 9వ ర్యాంకు యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి. కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే.. కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి. ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి. ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్: మేనేజ్మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి. వైద్య విద్య విభాగం వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి. దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి. -
నేటి నుంచి జేఈఈ 4వ విడత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్టీఏ ప్రకటించనుంది. -
IIT JAM 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్‌లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్–2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్‌తో ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్ మొదలు.. బీటెక్ ఉత్తీర్ణులు రాసే గేట్ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్డ్, లేదా గేట్ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్!! జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్నే సంక్షిప్తంగా జామ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్–2022 షెడ్యూల్‌ను ప్రకటించింది. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లు జామ్‌లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్డీ స్థాయి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్‌లతోపాటు ఐఐఎస్సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. కోర్సులు ► జామ్‌లో సాధించిన స్కోర్‌తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు); జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్డీ; ఎమ్మెస్సీ–పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ► వీటితోపాటు ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అందుబాటులో ఉంది. జామ్ స్కోర్ ఆధారంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్సీ బెంగళూరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఏడు పేపర్లలో పరీక్ష జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్;మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. మూడు విభాగాలు ► జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. ► సెక్షన్ ఏ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ► సెక్షన్ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ► సెక్షన్ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్ పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపు జామ్‌లో స్కోర్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. సిలబస్.. ప్రిపరేషన్ ఐఐటీ–జామ్‌లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్టోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్,క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి. జియాలజీ ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. ఫిజిక్స్ మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. ఐఐటీ–జామ్ 2022 ముఖ్య సమాచారం ► ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2021 ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: జనవరి 4, 2022 ► జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022 ► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jam.iitr.ac.in -
మరింత సులువుగా కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ /సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కోవిడ్ పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు సరికొత్త కిట్ అభివృద్ధి చేశారు. నోరు లేదా ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల ఆధారంగానే కోవిడ్‌ను గుర్తించగలగడం ఈ కిట్ ప్రత్యేకత. కోవిహోం అని పిలుస్తున్న ఈ కిట్‌ను త్వరలోనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తయారీ ఖర్చు రూ.400 వరకు ఉందని, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ఖర్చు రూ.300కు తగ్గుతుందని కిట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శివ్ గోవింద్‌సింగ్ తెలిపారు. పని చేస్తుందిలా..! స్మార్ట్‌ఫోన్‌లో ఐ కోవిడ్ పేరుతో అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఈ కిట్ ను ఉపయోగించాలని శివ్ గోవింద్ చెప్పారు. ముందుగా చిప్‌ను కిట్‌లోని చొప్పించాలని, అంతకుముందే ఓటీజీ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను, ఈ కిట్‌ను అనుసంధానించు కోవాలని వివరించారు. ఆ తర్వాత వినియోగదారుడి వివరాలను నమోదు చేసి చిప్‌ను తొలగించి ముక్కు లేదా నోటి నుంచి సేకరించిన ద్రవ నమూనాను చేర్చాల్సి ఉంటుంది. 20 నిమిషాల తర్వాత చిప్ ను మరోసారి కిట్‌లోకి చొప్పించి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లో పరీక్షించి ట్యాబ్‌ను నొక్కితే 10 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. నైపుణ్యం అవసరం లేదు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ప్రత్యేకమైన పరికరాలు, బీఎస్ఎల్ లెవెల్–2 పరిశోధనశాల అవ సరం ఉండగా.. కోవిహోంకు అలాంటి అవసరం ఉండదు. -
వచ్చే పదేళ్లు ‘ఇండియాస్ టెకేడ్’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్ చేశారు. ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. -
కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం?
సాక్షి, చండీగఢ్: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన ఇంతా కాదు. ఒక మాదిరి నుంచి తీవ్రంగా ప్రభావితమైన కరోనా బాధితుల్లో సీపాప్ థెరపీ చాలా కీలకంగా మారింది. అయితే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సీపాప్, బీపాప్ మెషీన్లు ఖరీదైనవిగావటం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన రేపింది. అయితే జీవన్ వాయు పేరుతో రూపొందించిన ఒకకొత్త సీపాప్ డివైస్ వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ ( ఐఐటి రోపర్ )ట్వీట్ చేసింది. చాలా తక్కువ రేటులో సీపాప్‌ను మెషీన్ మోడల్ రూపొందించడం ఒక ప్రత్యేకత అయితే..విద్యుత్ అవసరం లేకుండానే పనిచేయడం మరో విశేషం. ఐఐటీ రోపార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖుష్బూరాక దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విద్యుతు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసినట్టు రాక వెల్లడించారు. నిమిషానికి 15 లీటర్లు ఆక్సిజన్ అందిస్తుండగా, తమ డివైస్ ద్వారా నిమిషానికి 16 లీటర్లు దాకా అందిచ వచ్చన్నారు. అంతేకాదు దీన్ని 3 వేల రూపాయలలోపే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘జీవన్ వాయు’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ మెషీన్ ద్వారా గ్రామాలు, సౌకర్యాలు కొరత వున్న గ్రామాల నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేరేవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈసీ భాగస్వామ్యంతో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. అన్ని అనుమతులు లభిస్తే.. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె చెప్పారు. @iitrpr develops NATION’S FIRST Power-free CPAP device ‘JIVAN VAYU’ to save lives in villages and low resource areas and during transit of patients from ambulance to hospitals. @Reuters @DrRPNishank @EduMinOfIndia @SanjayDhotreMP @iitcouncil @PIB_India @HuffPost @PTI_News pic.twitter.com/VBKtKxWWqG — IIT Ropar (@iitrpr) June 14, 2021 -
కటాఫ్ ఎక్కువే!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి మార్చిలో నిర్వహించిన రెండవ విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ఫలితాలు ఈనెల చివరి వారంలో వెలువడనున్నాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన తొలివిడత సెషన్ పరీక్షలకు మాదిరిగానే ఈ రెండో విడతలోనూ ప్రశ్నలు ఒకింత మధ్యస్తంగా, సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.రెండో సెషన్లో 200 మార్కుల స్కోరు సాధించిన వారికి 90కి పైగా పర్సంటైల్ దక్కే అవకాశముంటుందని ప్రాథమిక కీ విడుదల అనంతరం ఆయా సబ్జెక్టుల నిపుణులు, కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన పిదప సవరణలతో తుది విడత కీ విడుదల సమయంలో తుది మార్కుల స్కోరు, పర్సంటైల్ ఖరారు అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జేఈఈ మెయిన్ కటాఫ్ ఓపెన్ కేటగిరీకి 90 నుంచి 100 పర్సంటైల్ వరకు ఉండవచ్చని, రిజర్వుడ్ కేటగిరీలో 60 నుంచి 70 పర్సంటైల్ మధ్య ఉండే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. 200 మార్కులు వచ్చే అభ్యర్థులు 90–100 పర్సంటైల్ సాధించగలుగుతారని చెబుతున్నారు. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభంగా ఉండటంతో జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ కన్నా ఈసారి కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని విడతలు ముగిసిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోరును అనుసరించి కటాఫ్ పర్సంటైల్‌ను ప్రకటించనున్నారు. 2018లో తక్కువ కటాఫ్ జేఈఈ మెయిన్‌లో 2019లోని కటాఫ్‌తో పోలిస్తే 2020 కటాఫ్‌లు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 2018 జేఈఈ మెయిన్‌లో ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ పర్సంటైల్ తక్కువగా ఉంది. జేఈఈ మెయిన్ 2017లో కటాఫ్ పర్సంటైల్ మళ్లీ అధికంగానే ఖరారైంది. ఆ కటాఫ్ గణాంకాలు పరిశీలిస్తే ఏమేరకు పెరుగుదల, తగ్గుదల ఉందో స్పష్టమవుతుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్–2
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. జేఈఈ మెయిన్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ నుంచి 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.. పరీక్షల నిర్వహణలో కోవిడ్–19 నియమాలను పాటించేలా ఎన్టీఏ చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలురాసే వారంతా తప్పనిసరిగా మాసు్కలు ధరించి రావాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వారి అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. పరీక్షలకు సంబంధించి రఫ్‌వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పేపర్–1 పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానం నిర్వహించిన తొలివిడత పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు చేయగా 6,20,978 మంది హాజరైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అభ్యర్థుల స్కోర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది నుంచి జేఈఈని నాలుగు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులవారీగా కేవలం స్కోర్‌ను మాత్రమే విడుదల చేసింది. మొత్తం నాలుగు విడతల పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించనుంది. ఫిబ్రవరి సెషన్లో 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆరుగురున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికీ100 స్కోర్ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞసాయి 99.999 స్కోర్ సాధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఏపీకే చెందిన మరో ఆరుగురు అభ్యర్థులు తక్కిన కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాల్లో నిలిచారు. ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో అనుముల వెంకట జయచైతన్య 99.9961682, గుర్రం హరిచరణ్ 99.9942523 స్కోర్లు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఓబీసీ కేటగిరీలో 99.9913217 స్కోర్‌తో బిత్రసాయి సిద్ధి రఘురామ్ శరణ్ రెండో స్థానం, 99.9846474 స్కోర్‌తో గొట్టిపల్లి శ్రీ విష్ణు సాత్విక్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. దివ్యాంగుల కేటగిరీలో ఇద్దరికి 3, 4 స్థానాలు లభించాయి. మల్లిన శ్రీ ప్రణవ్ శేషుకు 99.6393686, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణకు 99.6363357 స్కోర్లు దక్కాయి. -
జేఈఈ కటాఫ్ మార్కులు పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దీనిని అనుసరించి జేఈఈ మెయిన్–2021లో కటాఫ్ మార్కులు గతంలో కన్నా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఈ, బీ.టెక్, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల స్థాయిని అనుసరించి కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ప్రాథమిక ‘కీ’ కూడా విడుదల కావడంతో కటాఫ్ మార్కులపై వేర్వేరు అంచనాలలో తలమునకలవుతున్నాయి. అన్ని సెషన్ల పరీక్షలు పూర్తయ్యాకే కటాఫ్‌పై స్పష్టత జేఈఈలో కటాఫ్ మార్కులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఐఐటీ విద్యాసంస్థల్లోకి ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ మార్కులు. జేఈఈ మెయిన్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును అనుసరించి ఈ కటాఫ్‌ను నిర్ణయిస్తారు. రెండోది ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ స్కోరును అనుసరించి నిర్ణయించే కటాఫ్. ఈ నెల 7వ తేదీలోపు ప్రకటించే తుది ఫలితాలతో జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఎన్టీఏ ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుతం నాలుగు సెషన్లలో ఫిబ్రవరి సెషన్ పరీక్షలలో అభ్యర్థులు సాధించే స్కోరును అనుసరించి మాత్రమే ఈ కటాఫ్, పర్సంటైల్ అంచనాలు వేస్తున్నా మార్చి, ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ముగిశాక కానీ తుది కటాఫ్ తేలదు. అంతిమంగా మే సెషన్ ఫలితాల అనంతరమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి సెషన్ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలతో పాటే వీటిని విడుదల చేస్తారు. జూన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కటాఫ్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ప్రకటిస్తుంది. విద్యాసంస్థల వారీగా ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను అనుసరించి అడ్మిషన్ల కటాఫ్ మార్కులను ప్రవేశాల సమయంలో జోసా విడుదల చేయనుంది. మొత్తం అన్ని సెషన్ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న సీట్లు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత తదితరాలను అనుసరించి తుది కటాఫ్ తేలనుంది. ఫిబ్రవరి సెషన్‌కు 6,61,776 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 6,52,627 మంది పరీక్షలు రాశారు. ప్రాథమిక ‘కీ’ని అనుసరించి కటాఫ్ ఇలా ఈసారి కటాఫ్ గత ఏడాది జేఈఈ మెయిన్ కటాఫ్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాçశం ఉందని కార్పొరేట్ విద్యాసంస్థ అధ్యాపకురాలు ఒకరు అభిప్రాయపడ్డారు. జనరల్ కటాఫ్ మార్కులు ఈసారి 90–95 శాతం వరకు ఉండవచ్చన్నారు. రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా 60 నుంచి 70 శాతానికి పైగా మార్కుల స్కోరు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 200 వరకు మార్కులు వచ్చే అభ్యర్థి 90–95 పర్సంటైల్ సాధించవచ్చన్నారు. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ప్రాథమిక కీ జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఆన్సర్ ‘కీ’, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్సు షీట్లను కూడా అందులో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. ఛాలెంజ్ చేసే ఒక్కొక్క ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపునకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు అవకాశం మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సెషన్లకు ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి లేదా తమ దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారికి రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చింది. మార్చి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు 15, 16, 17, 18 తేదీల్లో జరుగుతాయి. దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. రిజిస్టేషన్ ఫీజును 6వ తేదీ రాత్రి 11.50 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు, రిజిస్టేషన్ల ఫీజు గడువును ఆ తరువాత తెలియచేయనున్నట్టు ఎన్టీఏ వివరించింది. -
జేఈఈలో తొలివిడతకే ఎక్కువమంది..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్‌కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్‌కు 5,04,540, మే సెషన్‌కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు జరభద్రం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే.. ► ‘జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ► అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు. ► జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే. ► అడ్మిట్‌కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి. ► అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే 0120–6895200 నెంబర్లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్‌కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ–మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్–ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’లో కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు.. ► పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి. ► పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ► ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అండర్‌టేకింగ్ ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి. ► కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు. ► మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. ► పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ► రఫ్‌వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. ► పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్‌కు అందించాలి. ► పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు. నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ► ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు. ► అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ► పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు. పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు.. జామిట్రీ బాక్సు, హ్యాండ్‌బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు. ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా.. ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అప్డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. -
జేఈఈలో నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలను సడలించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఏ వెబ్సైట్లో అధికారిక నోట్‌ను పొందుపరిచింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అర్హత విషయంలో మినహాయింపులిచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని కొనసాగించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈకి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ ఉండడంతో పాటు వారికి ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండడం లేదా టాప్ 20 పర్సంటైల్ వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఇంటర్లో 75 శాతం మార్కులు, లేదా టాప్ 20 పర్సంటైల్‌లు ఉండే వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికి ఐఐటీ ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనావల్ల గత విద్యా సంవత్సరం అనేక రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను నిర్వహించలేకపోయాయి. దీంతో ఆయా బోర్డులు విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించాయి. అలాగే, కరోనావల్ల ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జేఈఈలో కూడా విద్యార్థులకు 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తమకు ఇంటర్లో 75 శాతం మార్కుల నుంచి మినహాయింపునివ్వాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వస్తుండడంతో కేంద్రం స్పందించింది. అర్హత విషయంలో గత ఏడాది ఇచ్చిన మినహాయింపులను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రత్యేక నోటీసును వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు 75శాతం మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సాధిస్తే చాలని పేర్కొంది. మెయిన్స్‌కు 20 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 26 వరకు కొనసాగుతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 20 నగరాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అవి.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. -
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. -
ఐఐటీకి ‘సుప్రీం’ పాఠం
కీలక స్థానాల్లో, బాధ్యతాయుత పదవుల్లో వుండేవారు నిబంధనల చట్రంలో బందీలైతే... అక్కడి నుంచి బయటకు రావడానికి మొండికేస్తే, కనీసం ఆ పరిధిని మించి ఆలోచించడానికి నిరాకరిస్తే సామాన్యులకు సమస్యే. నిబంధనల అమలులో ‘చాదస్తంగా’ వుండే నేతలకూ, అధికారులకూ సుప్రీంకోర్టు తాజాగా ఒక కేసులో ఇచ్చిన తాత్కాలిక ఆదేశం కనువిప్పు కావాలి. సమస్య చాలా చిన్నది. పెద్ద మనసు చేసుకుని అధికారులు తార్కికంగా ఆలోచిస్తే అరక్షణంలో కనుమరుగయ్యే సమస్య అది. కానీ అందుకు సిద్ధపడకపోవడం వల్ల పద్దెనిమిదేళ్ల విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ప్రతిష్టాత్మక జేఈఈ పరీక్షల్లో 270వ ర్యాంకు సాధించిన ఆగ్రా విద్యార్థి సిద్ధాంత్ బాత్రా ఆన్లైన్లో తనకు నచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న బాత్రాకు సీటు కేటాయించినట్టు బొంబాయి ఐఐటీనుంచి సందేశం కూడా వచ్చింది. తదుపరి ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో పొరబాటు చేశాడు. తనకు సీటు కేటాయింపు అయింది గనుక ఇతర రౌండ్ల అవసరం లేదనుకుని, దానికి సరిపోతుందనుకుని ‘ఫ్రీజ్’ లింకును క్లిక్ చేశాడు. దాంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందనుకున్నాడు. కానీ ఎంపిక చేసుకున్న సీటును రద్దు చేసుకోవడానికి దాన్ని ఉద్దేశిం చామని ఐఐటీ అంటోంది. ఏమైతేనేం తుది జాబితాలో అతని పేరు గల్లంతయింది. అప్పటినుంచీ ఎవరిని ఆశ్రయించినా ఆ విద్యార్థి మొర ఆలకించేవారే కరువయ్యారు. వారందరూ చెప్పిన పరిష్కారం ఒకటే– వచ్చే ఏడాది మరోసారి పరీక్షలు రాసి సీటు తెచ్చుకోవాలనే! పనులు సజావుగా సాగడానికి రూపొందించుకున్న నిబంధనలు ఆ పనులకే ప్రతిబంధకంగా మారకూడదు. గుదిబండలు కాకూడదు. ఆ విద్యార్థి మొదట బొంబాయి ఐఐటీని, అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. సీట్లన్నీ నిండిపోయాయి గనుక ఈ దశలో ఏం చేయలేమని ఐఐటీ చెప్పిన జవాబుతో హైకోర్టు కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిద్ధాంత్‌కు తాత్కాలిక అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. బొంబాయి ఐఐటీ మొదటే ఇలాంటి ఆలోచన చేసివుంటే దాని నిర్వాహకులను అందరూ అభినందించేవారు. ఎందు కంటే సిద్ధాంత్ అమ్మానాన్నల్ని కోల్పోయి వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో వున్నా క్లిష్టమైన జేఈఈని ఛేదించాడు. మంచి ర్యాంకు తెచ్చుకుని ప్రతిభాశాలినని నిరూపించుకున్నాడు. అలాంటి వాడు తమ సంస్థకే వన్నె తెస్తాడని ఐఐటీ గుర్తించాల్సింది. అతని కోసం ఏం చేయగలమన్న కోణంలో ఆలో చించాల్సింది. డిజిటల్ ప్రపంచం మయసభలాంటిది. అక్కడ ఏమాత్రం ఏమరు పాటుగా వున్నా తలకిందులుకావడం ఖాయం. బ్యాంకు లావాదేవీల్లో సాధారణ పౌరులకు తరచుగా ఎదురయ్యే అనుభవమే ఇది. ఆన్లైన్లో దేన్నయినా క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే హెచ్చరిక సందేశం కంప్యూటర్ స్క్రీన్‌పై వెంటనే ప్రత్యక్షమయ్యే ఏర్పా టుండాలి. అది స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వుండాలి. తప్పు చేసిన పక్షంలో అలాంటివారిని హెచ్చ రించడానికి తగిన వ్యవస్థ కూడా వుండాలి. అంతా ఆన్లైన్ గనుక మధ్యలో ఇంకేమీ కుదరవంటే జనం నష్టపోతారు. మన దేశంలో అంతంతమాత్రంగావున్న ఆన్లైన్ విధానంలోకి జనాన్ని మళ్లిం చడంలో పాలకులు విజయం సాధించారు. రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గరనుంచి, బ్యాంకు లావాదేవీల వరకూ అన్నీ ఆన్‌లైన్‌కే మారుతున్నాయి. కానీ జనానికి సులభంగా బోధపడేలా ఇంటర్ ఫేస్‌లను రూపొందించడంలో, వారికి అర్థమయ్యే భాషలో వివరించడంలో అవి విఫల మవుతున్నాయి. దాంతో ఒక ప్రత్యామ్నాయానికి బదులు మరొకటి ఎంచుకుని జనం ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పటికే అనేకచోట్ల కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రోబోలతో పనులు కానిస్తుండగా, మున్ముందు వాటి పాత్ర మరింతగా పెరుగుతుందంటున్నారు. మంచిదే. వాటివల్ల పనులు చిటికెలో పూర్తవుతుంటే కాదనేవారుండరు. కానీ ఈ క్రమంలో మనుషులే రోబోలుగా మారకూడదు. గిరి గీసుకుని వుండిపోకూడదు. భిన్నంగా ఆలోచించబట్టే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీవంటివి రూపొందించి నిరుపేద వర్గాల వారు సైతం ఉన్నత చదువులు చదవడానికి, వారికి మెరుగైన వైద్యం లభించడానికి మార్గం సుగమం చేశారు. దేనిలోనైనా సమస్యలుంటాయి. మానవీయ కోణంలో ఆలోచిస్తే వాటికి సులభంగా పరి ష్కారాలు లభిస్తాయి. ఆచరణలో వచ్చే అనుభవాలతో ఆ పరిష్కారాలకు మరింత మెరుగు పెట్టవచ్చు. ఐఐటీ ఉన్నతాధికార వర్గంలో ఇప్పుడు కనబడిన ధోరణి కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ ఉంటున్నది. రెండున్నరేళ్లుగా అంతూ దరీ లేకుండా సాగుతున్న భీమా కోరెగావ్ కేసు విచారణలో ఖైదీలుగా వున్న ఫాదర్ స్టాన్‌స్వామి, పౌరహక్కుల నాయకుడు గౌతం నవలఖాలకు ఎదురైన సమస్యలే ఇందుకు ఉదాహరణ. పార్కిన్సన్ వ్యాధి వల్ల మంచినీరు తాగాలన్నా కష్టమ వుతోందని, సిప్పర్, స్ట్రా అందజేయాలని స్టాన్‌స్వామి కోరితే దాన్ని నెరవేర్చడానికి జైలు అధికారులు నెలరోజుల సమయం తీసుకున్నారు. అది కూడా న్యాయస్థానం జోక్యం తర్వాతే. గౌతం నవలఖా కళ్లజోడు కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. ఈ తీరు చూసిన ధర్మాసనం జైలు అధికారులు సున్నితంగా, మానవీయంగా ఆలోచించడం కోసం వారికి ప్రత్యేక పాఠాలు చెప్పించా లేమోనన్న సందేహం వ్యక్తం చేసింది. అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు ఉన్నంతలో తక్షణ పరి ష్కారంగా ఏం చేయాలన్న ఆలోచన కలగాలంటే అధికారుల్లో సృజనాత్మకత వుండాలి. బాధితు లపట్ల సహానుభూతి వుండాలి. అప్పుడే మెరుగైన నిబంధనలు అమలులోకొస్తాయి. అలా ఆలోచిం చగలిగేవారే చరిత్రలో నిలిచిపోతారు. అందరికీ మార్గదర్శకులవుతారు. -
ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. మార్చిలో లాక్డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్ దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలంలో సెకండ్ వేవ్ ? దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు. పత్రికల ద్వారా సోకదు వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్–2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్–19 కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన, అడ్వాన్స్‌డ్‌కు సరైన సన్నద్ధత లేక సఫలం కాలేకపోయిన వారికి ఇదో మంచి అవకాశం. అయితే వీరు జేఈఈ అడ్వాన్స్డ్–2021లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్–2021కు ఈ అభ్యర్థులు 2020 మెయిన్స్ అర్హతతోనే హాజరుకావచ్చు. వీరు 2021 జేఈఈ మెయిన్స్‌ను రాయాల్సిన అవసరం లేదు. కేవలం 2020 జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు మాత్రమే ఇది పరిమితం. కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఏబీ నిబంధనల నుంచి సడలింపు కోవిడ్–19ను దృష్టిలో ఉంచుకుని జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) అర్హత తదితర నిబంధనల నుంచి వీరికి సడలింపు ఇచ్చింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చి అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు, సఫలం కాలేకపోయిన వారికి సమానావకాశాలిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏటా నమోదిత విద్యార్థులలో నాలుగింట ఒక వంతు మంది ఆ పరీక్షకు హాజరు కావడం లేదు. సమన్యాయం చేసేందుకు.. జేఈఈ అభ్యర్థులకు సమన్యాయం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 అడ్వాన్స్‌డ్‌కు అవకాశం పొందిన అభ్యర్థులు అదనపు అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2021 జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి సంఖ్యకు వీరు అదనం. అర్హతలు, వయసు, ఇతర అంశాల్లో కూడా వీరికి సడలింపు ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా.. వారిలో 1.50 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం, ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఒక అభ్యర్థికి రెండు ప్రయత్నాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆయా విద్యార్థులు చివరి సంవత్సరం లేదా ఆ సంవత్సరం పరీక్ష రాయక రెండవ ప్రయత్నంలో ఉన్నవారికి సడలింపు ఇస్తున్నారు. అదే జేఈఈ మెయిన్స్‌ను వరుసగా మూడుసార్లు రాసేందుకు అవకాశం ఇస్తున్నారు. జేఈఈ మూడుసార్లు రాసినా అడ్వాన్స్‌డ్‌ను వరుసగా రెండేళ్లు రాయడానికి మాత్రమే వీలుంటుంది. ఈ సంఖ్యను పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుటినుంచో డిమాండ్ చేస్తున్నారు. -
‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదల య్యాయి. ఇందులో తెలుగు విద్యార్థులు సత్తా చాటినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ఈసారి తెలం గాణ విద్యార్థులు వెనుకబడిపోయారు. టాప్– 100లోపు రెండు రాష్ట్రాల్లో కలిపి 15 మంది పైగా ఉండగా, అందులో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నుంచి టాప్– 100లో ఇద్దరి పేర్లే వెల్లడైనా.. మరో ఐదారుగురు ఉండొచ్చని పేర్కొన్నాయి. తెలంగాణలో స్థిరపడిన (మధ్యప్రదేశ్‌కు చెం దిన) హర్ధిక్ రాజ్‌పాల్ ఆరో ర్యాం కుతో టాప్ 10లో నిలువగా, మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్ 93వ ర్యాంకు సాధించారు. ఇక ఏపీ నుంచి.. ఆలిండియా ర్యాం కుల్లో జనరల్ కేటగిరీ 2వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర దక్కించుకున్నాడు. రాసింది తక్కువే.. అర్హులు తక్కువే.. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా, కరోనా నేపథ్యంలో వారిలో 1,60,838 మందే దరఖాస్తు చేసుకున్నారు. గతనెల 27న జరిగిన పరీక్షకు 1,50,838 మంది హాజరు కాగా, వారిలో 43,204 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హుల్లో బాలురు 36,497 మంది ఉండగా, బాలి కలు 6,707 మంది ఉన్నారు. టాప్ 500లో 140 మందే ఐఐటీ మద్రాస్ పరిధిలో టాప్–500 ర్యాంకులోపు 140 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 100లోపు 28 మంది ఉండగా, అందులో తెలుగు విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. ఇక టాప్–200లోపు 61 మంది, టాప్–300లోపు 86 మంది, టాప్–400లోపు 114 మంది, టాప్–500 ర్యాంకులోపు 140 మంది ఉన్నారు. తగ్గిన కటాఫ్ మార్కులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు తగ్గాయి. గతేడాది 90 వరకు ఉండగా ఈసారి కామన్ ర్యాంకులో కటాఫ్ 69 మార్కులకు తగ్గిపోయింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 62, ఈబ్ల్యూఎస్‌లో 62, ఎస్సీ, ఎస్టీలలో 34 మార్కులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కనీస అర్హత మార్కులుగా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఇక వికలాంగుల కోటాలో 34 మార్కులను కనీస అర్హత మార్కులుగా ప్రకటించింది. ప్రణాళికతో చదివి.. అనుకున్నది సాధించి.. మంచిర్యాలఅర్బన్ : ఉన్నత స్థానాలను చేరుకోవాలనే తపన.. కష్టపడేతత్వం ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే అని నిరూపించాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయివర్ధన్ . తల్లిదండ్రుల ప్రోత్సాహం.. పట్టుదలతో చదివి జేఈఈ అడ్వాన్ ్సడ్ ఆలిండియా ర్యాంక్‌ల్లో 93, ఓబీసీలో 7వ ర్యాంక్‌తో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు జయ, రమణారెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాయివర్ధన్ ను 8వ తరగతిలో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్య సంస్థల్లో చేర్పించారు. 10వ తరగతిలో 9.5 మార్కులు, ఇంటర్లో 967 మార్కులు సాధించాడు. సీఈసీ (కంప్యూటర్ సైన్ ్స ఇంజనీర్) చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రణాళికాబద్ధంగా చదివితే సాధించలేనిది ఏమిలేదని సాయివర్ధన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తను ఈ ర్యాంక్ సాధించడం వెనుక కుటుంబసభ్యుల తోడ్పాటు ఎంతో ఉందన్నాడు. -
జేఈఈ అడ్వాన్స్ టాపర్.. చిరాగ్ ఫలోర్
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో పుణేకు చెందిన చిరాగ్ ఫలోర్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 352 మార్కులతో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ బాంబే జోన్ నుంచి అతడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాశాడు. కాగా 317 మార్కులతో కనిష్కా మిట్టల్ అనే విద్యార్థిని బాలికల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రధాని మోదీతో అనుబంధం... ఈ ఏడాది జనవరి 24న చిరాగ్ ఫలోర్ ప్రతిష్ఠాత్మక 'బాల పురస్కార్' అవార్డు దక్కించుకున్నాడు. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం విశేషం. మాథ్స్, సైన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విటర్లో షేర్ చేశారు. Meet my friend Chirag Falor, a Bal Puraskar awardee. Winner of national and international math and science competitions, he represented India in the International Olympiad Award on Astronomy and Astrophysics. Chirag has a bright future ahead and I wish him success. pic.twitter.com/B2YPdIsWb3 — Narendra Modi (@narendramodi) January 24, 2020 -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ మంగళవారం వెలువడనుంది. ఆదివారం నిర్వహించిన పేపర్–1, పేపర్–2 ప్రశ్నపత్రాల కాపీలను పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ– ఢిల్లీ సోమవారం వెబ్సైట్లో పొందుపరిచింది. కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా 1.60 లక్షల మంది మాత్రమే పరీక్షకు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ► వీరిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్–1కు 1.51 లక్షలు, పేపర్ 2కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. ► అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అ«థారిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్ ఇస్తారు.అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. ► ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులిస్తారు. -
కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం'
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్, మేథమేటిక్స్ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను చేపడుతుంది. విభిన్న రీతుల్లో ప్రశ్నలు.. ► ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీలలో వివిధ విభాగాల్లో విభిన్నమైన రీతుల్లో ప్రశ్నలున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు. ► మేథమేటిక్స్ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని కోచింగ్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. ► కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ ప్యాట్రన్‌ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు. ► అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారని గుంటూరుకు చెందిన అధ్యాపకుడొకరు చెప్పారు. ► బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు. ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో ఒక్కో దానిలో 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ► కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ► మొత్తం మీద పేపర్–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న ఫలితాలు ► ఫలితాలు అక్టోబర్ 5న వెల్లడవుతాయి. తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది. ► ఈసారి 7కు బదులు ఆరు విడతల కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. ► ప్రాథమిక ఆన్సర్ కీలను త్వరలోనే ప్రకటించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ► అధికారిక బులెటిన్ ప్రకార, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1000 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాట చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్, శానిటైర్ ఉన్నవిద్యార్థులనే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిందే. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. వచ్చే నెల 5న ఫలితాలు విడుదల కానున్నాయి. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో 30 చోట్ల ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటరాధారితంగా ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ► పేపర్–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. ► కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా సమర్పించాలి. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ► కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్ నంబర్ కనిపిస్తాయి. ► రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ కావచ్చు. ► ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలి. ► షూస్ కాకుండా ఓపెన్ పాదరక్షలు మాత్రమే ధరించాలి. -
ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్ 20 పర్సంటైల్ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో మినహాయింపు ► కోవిడ్–19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ► ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్ సాధించి ఉండాలి. ► ఈసారి కోవిడ్ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు ► జేఈఈ అడ్వాన్స్ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ► అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ► ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో... ► ఫలితాలు అక్టోబర్ 5న విడుదలవుతాయి. అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. ► ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ► ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్‌తో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. -
జేఈఈ అడ్వాన్సుకు తగ్గిన దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి నిర్వ హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సు–2020కు గతంలో కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి మెరిట్లో ఉన్న 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సు రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే శుక్రవారం రాత్రి గడువు ముగిసే సమయానికి 64 శాతం మందే అంటే.. 1.60 లక్షల అభ్యర్థులు అడ్వాన్సుకు దరఖాస్తు చేశారు. 2019 జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్సుకు 2.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించి అనుమతివ్వగా 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. జేఈఈ అడ్వాన్సులో మంచి స్కోరు సాధిస్తే ఇష్టమైన ఐఐటీలో చేరేందుకు అవకాశం ఉన్నా కూడా 90 వేల మంది పరీక్షకు దూరంగా ఉండటం విశేషం. ► జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించారు. 12 నుంచి 18 వరకు జేఈఈ అడ్వాన్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ► జేఈఈ అడ్వాన్సును ఈసారి ఐఐటీ న్యూఢిల్లీ నిర్వహిస్తోంది. 27వ తేదీన ఉదయం పేపర్1, మధ్యాహ్నం పేపర్2 పరీక్ష ఉంటుంది. ఫలితాలు అక్టోబర్ 5 న ప్రకటిస్తారు. ఆరో తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రవేశాల షెడ్యూల్‌ను జోసా ఇప్పటికే ప్రకటించింది ► కోవిడ్–19 నేపథ్యంలో ఈఏడాది జేఈఈ అడ్వాన్సు పరీక్షను నిర్వహించే నగరాలు, కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 164 నగరాల్లోని 600 కేంద్రాల్లో నిర్వహించగా, ఈసారి 222 నగరాలు, 1,150 సెంటర్లకు పెంచారు. ► ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ శాతం ఓపెన్ కేటగిరీలో తప్ప తక్కిన అన్ని కేట గిరీల్లో తగ్గింది. అయినా కోవిడ్ పరిస్థితులు, పరీక్ష సన్నద్ధతకు ఆటంకాల నేపథ్యంలో అడ్వాన్స్‌కు దరఖాస్తులు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకుతో ఎన్ఐటీ, ఐఐఐటీల్లో లేదా ఇతర ఎంట్రెన్సు టెస్టుల ద్వారా దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవచ్చన్న అభిప్రాయంతో అడ్వాన్సుకు దరఖాస్తు చేసి ఉండకపోవచ్చని వివరించారు. ఎన్టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం కేటగిరీల వారీగా జేఈఈ మెయిన్–2020 కటాఫ్ ఇలా ఉంది.. ► కామన్ ర్యాంక్ జాబితా (సీఆర్ఎల్): 90.3765335 ► జనరల్–ఈడబ్ల్యూఎస్: 70.2435518 ► ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ): 72.8887969 ► షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ): 50.1760245 ► షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ): 39.0696101 ► పిడబ్ల్యూడి: 0.0618524 -
అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రెండో విడత (సెప్టెంబర్) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ► జేఈఈ మెయిన్‌లో మెరిట్లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ► అడ్మిట్ కార్డులను ఈ నెల 21 నుంచి 27 వరకు https:// jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపూర్, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, తిరువూరు, విజయవాడల్లో నిర్వహిస్తారు. ► ఈ నెల 29న ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’ని విడుదల చేస్తారు. ► ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని అక్టోబర్ 5న https://jeeadv.ac.inలో పెట్టి.. అదే రోజు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ► బీఆర్కిటెక్చర్‌కు అభ్యర్థులు ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. అక్టోబర్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8న ఈ పరీక్ష నిర్వహిస్తారు. జోసా ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. ఈసారి ఆరు విడతల కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీనివల్ల అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్న వారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్లైన్లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు. ముఖ్య తేదీలు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 12 రిజిస్ట్రేషన్ ముగింపు: సెప్టెంబర్ 17 ఫీజు చెల్లింపు తుది గడువు: సెప్టెంబర్ 18 కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు ఇలా.. అక్టోబర్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 6 నుంచి: జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 16: మొదటి విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 21: రెండో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 26: మూడో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 30: 4వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 3: 5వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 7: 6వ విడత సీట్ల కేటాయింపు ఏపీ నుంచి ముగ్గురికి 100 ఎన్టీఏ స్కోర్ కాగా.. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 100 ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) స్కోర్ సాధించిన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన లండా జితేంద్ర, విశాఖపట్నానికి చెందిన వైఎస్ఎస్ నరసింహనాయుడు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్లు ఈ ఘనత సాధించారు. వీరే కాకుండా 100 స్కోర్ సాధించిన ఆర్.శశాంక్ అనిరుధ్ (కడప), రొంగల అరుణ సిద్ధార్థ్ (తూర్పుగోదావరి) ఏపీకి చెందిన వారే అయినా హైదరాబాద్‌లో పరీక్ష రాయడంతో ఆ రాష్ట్ర కోటాలోకి చేరారు. -
అక్టోబర్ 6 నుంచి షురూ..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ఉమ్మడి ప్రవేశాలను వచ్చే నెల 6 నుంచి చేపట్టి నవంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) నిర్ణయిం చింది. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రవేశాల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా తాత్కాలికంగా ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ ఈనెల 6తో ముగియనుండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 27న ఆన్ లైన్లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూ ల్ను ఖరారు చేసింది. దీనికి అనుగుణం గానే ఫలితాలను విడుదల చేసి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఉమ్మడి ప్రవే శాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వచ్చేనెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో స్పష్టం చేసింది. మొత్తా నికి ఈసారి కూడా 7 విడతల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. 12 నుంచి ‘అడ్వాన్స్డ్’ రిజిస్ట్రేషన్లు.. జేఈఈ మెయిన్ ఫలితాలను ఈనెల 11లోగా విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు చేస్తోంది. గత జనవరి జేఈఈ మెయిన్, ప్రస్తుత మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వారంతా ఈనెల 12 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, 18న సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ పరీక్ష 27న ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు పేపరు–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపరు2– పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశాల్లో 12వ తరగతి చదువుకున్న, చదువుతున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 5నుంచే దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. రాష్ట్రంలో 15 కేంద్రాల్లో పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలోని 15 పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట్, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేస్తామని పేర్కొంది. వచ్చే నెల 8న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టును (ఏఏటీ) నిర్వహిస్తామని, 11న వాటి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెల 6న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని వివరించింది. -
జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పలు జాగ్రత్తలు చేపడుతోంది. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రతి అభ్యర్థికి జారీచేసిన అడ్మిట్ కార్డుతో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆన్లైన్(కంప్యూటరాధారితంగా)లో జరిగే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఏపీ నుంచి 45 వేల మంది వరకూ పరీక్షలు రాయనున్నట్టు అంచనా. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో శానిటైజర్లు – నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. – అడ్మిట్‌కార్డులోని బార్కోడ్ రీడర్లను ప్రవేశద్వారాల వద్ద ఉంచుతారు. రీడ్ చేసిన వెంటనే అభ్యర్థుల ల్యాబ్ నంబర్‌ను తెలియచేస్తుంది. – గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. – అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్‌ను తీసేసి కొత్త మాస్క్ ధరించాలి. – శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. – పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవరాదు. – అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. – ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. – దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. – బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి. – డ్రాయింగ్ షీట్లో నీటి రంగు వినియోగానికి అభ్యర్థులకు అనుమతి లేదు. – ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. – అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి. – ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. – ఇందుకోసం అభ్యర్థులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. – రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. కావాల్సి వస్తే అదనంగా ఇస్తారు. – అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్‌లో వాటిని వేయాలి – సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ఏపీలో కేంద్రాలు అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నర్సారావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం -
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్లైన్ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆన్లైన్ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్‌లకు దీటుగా యాప్స్‌ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఐఐటీలను కోరారు. చదవండి : ఇంట్లోనే కరోనా టెస్టులు -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణ
గాంధీనగర్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇతర దేశాల్లో రోజుకి లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే భారత్‌లో మాత్రం ఆ స్థాయిలో పరీక్షల సామర్థ్యం జరగడం లేదు. ఒకవేళ టెస్టింగ్ కెపాసిటీ పెరిగినా 24 గంటలు వేచి చూడాల్సిన సమయం. దీంతో కరోనా నిర్ధారణ వేగవంతం చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గాంధీనగర్‌కు చెందిన విద్యార్థులు సరికొత్త టెక్నాలజీని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేధస్సు )తో ఇది పనిస్తుందని, మనిషి ఛాతీ భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనా నిర్ధారణ చేయొచ్చంటున్నారు. ఎక్స్‌రే ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో న్యూరల్ నెట్వర్క్కి అనుసంధానించడం ద్వారా కరోనా ఉందో లేదో ఆటోమెటిక్‌గా వెల్లడవుతుందని రీసెర్చ్ టీమ్ ఎంటెక్ విద్యార్థి కుష్పాల్ సింగ్ యాదవ్ తెలిపారు. (నవంబర్ అఖరు వరకు ఉచిత రేషన్ : మోదీ ) మనిషి మెదడులోని న్యూరాన్ల వలె 12 లేయర్ల న్యూరల్ నెట్వర్క్ ఉంటుందని దీని ద్వారా ఆటోమెటిక్‌గా ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ కావడంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అని కుష్పాల్ అభిప్రాయపడ్డారు. ఐఐటీ విద్యార్దులు రూపొందించిన ఈ సరికొత్త టెక్నాలజీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపిహెచ్) పరీక్షిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణకు త్వరలోనే మార్గం సుగుమం కానుంది. దీని ద్వారా టెస్టింగ్ కెపాసిటీ పెరగనుంది. ఇక భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 19,459 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 5,48,318 కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారినపడి 380 మంది చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,475 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో 15 వేలకు పైగా కేసులు నమోదవడం వరుసగా ఇది ఆరవ రోజు. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు! ) -
105 ఏళ్ల పాంబన్ బ్రిడ్జిని పరిశీలించిన ఐఐటీ బృందం
చెన్నై: 105 ఏళ్ల నాటి పాంబన్ రైల్వే బ్రిడ్జి స్థిరత్వాన్ని పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ బృందం అక్కడికి చేరుకుంది. ఇందుకోసం వంతెనపై 100 చోట్ల సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమయ్యారు. రామనాథపురం జిల్లాతో రామేశ్వరం దీవిని అనుసంధానించేందుకు సముద్రంలో ఏర్పాటైన పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ముఖ్యపాత్ర వహిస్తోంది. 105 ఏళ్లు దాటినా రైల్వే బ్రిడ్జ్‌పై రైళ్ల రాకపోకలు ఇంకా సాగుతున్నాయి. రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్‌ని రైల్వే శాఖ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఉండగా పాంబన్ సముద్రంలో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి రూ.250 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో గత ఫిబ్రవరి నెల పాంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. చదవండి: పోలీస్ కమిషనర్ మానవీయత ఈలోపున కరోనా వైరస్ వ్యాపించడంతో దీని నియంత్రణకు అమలు చేసిన లాక్డౌన్ కారణంగా పనులను నిలిపి వేశారు. ఈ స్థితిలో పాంబన్ సముద్రంలోని రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు వీలుగా రైళ్లు వెళ్లే సమయంలో ఏర్పడే ప్రకంపనల ప్రభావం, ఉప్పు గాలులతో ఇనుప రాడ్లు, స్థంభాలలో ఏదైనా లోపాలు ఏర్పడ్డాయా అనే విషయంపై పరిశీలన జరిపేందుకు గత మూడు రోజులుగా చెన్నై ఐఐటీ బృందం ఈ వంతెనపై సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమైంది. దీని గురించి ఐఐటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పాంబన్ రైల్వేబ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు ఈ సెన్సర్ పరికరాలను బ్రిడ్జ్‌పై 100 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులలో గత మూడు రోజులుగా 10మందితో ఈ పనులు చేపడుతున్నామని, ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని తెలిపారు. చదవండి: ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
జేఈఈ మెయిన్స్: మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌లో నిర్వహించనున్న రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన సమాచార బులెటిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణను చేపట్టిన ఎన్టీఏ మార్చి 6 వరకు విద్యార్థులు సబ్మిట్ చేయవచ్చని తెలిపింది. మార్చి 7 వరకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మార్చి 8 నుంచి 12 వరకు ఆన్లైన్లో సరిదిద్దుకోవచ్చని పేర్కొంది. జనవరిలో జేఈఈ మెయిన్స్‌కు హాజరు కాని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. (చదవండి: పెళ్లికూతురికి వినూత్న గిఫ్ట్) -
కటాఫ్ 86.19 మించి?
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ పర్సంటైల్ ఈసారి ఓపెన్ కేటగిరీలో 86.19 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ అంచనాకు వచ్చారు. అయితే ఏప్రిల్‌లో మరో దశ జేఈఈ మెయిన్ నిర్వహించనున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ కటాఫ్ పర్సంటైల్‌లో మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి 9లోపు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి కటాఫ్ పర్సంటైల్ నిర్ధారణ జరుగుతుందని పేర్కొంటున్నారు. జనవరిలో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు హాజరు కాని విద్యార్థులంతా ఏప్రిల్‌లో హాజరైతే ఓపెన్ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 86.98 వరకు ఉండొచ్చని, విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కటాఫ్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఏప్రిల్ జేఈఈ ఫలితాల తర్వాత అడ్వాన్స్‌డ్‌ను పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్‌ను ఎన్టీఏ అధికారికంగా ప్రకటించనుంది. లెక్కించుకోవడం సులభమే.. జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వివిధ దశల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల స్కోరును పర్సంటైల్ రూపంలో ఇస్తోంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ లెక్కింపుపై విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. విద్యార్థుల స్కోరును మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్ విధానంలో ఇచ్చినా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. కటాఫ్ లెక్కింపు ఇలా.. ఈ సారి మే 17న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అన్ని కేటగిరీల్లో కలిపి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తామని జేఈఈ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. అందులో 50.5 శాతం విద్యార్థులను (1,26,250 మంది) ఓపెన్ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. అందులో దివ్యాంగులు 5 శాతం మినహాయిస్తే 1,19,938 మందిని ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అయితే మొన్నటి జేఈఈ మెయిన్‌కు మొత్తం 8,69,010 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య 1,19,938. అంటే అది 13.80168237 శాతం అవుతుంది. దీన్ని టాప్ 100.0000 పర్సంటైల్ నుంచి తీసేస్తే 86.19 పర్సంటైల్ వస్తుందని, అదే జనవరి పరీక్షల ప్రకారం ఓపెన్ కేటగిరీలో కటాఫ్ అయ్యే అవకాశం ఉందని జేఈఈ నిపుణుడు కుమార్ వివరించారు. ఏప్రిల్‌లో పెరగనున్న విద్యార్థుల సంఖ్య.. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో 52,251 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. వారంతా ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు కచ్చితంగా హాజరవుతారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 9,21,261కి చేరనుంది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు రెండుసార్లు దరఖాస్తు చేసుకోరు కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 9,21,261కి మించి కూడా ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి జేఈఈకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా (9,21,261 మంది) ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌కు హాజరైతే, అందులో ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్డ్ పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య (1,19,938) అనేది 13.01889475 శాతం అవుతుంది. దానిని టాప్ 100.000 పర్సంటైల్ నుంచి తీసివేస్తే 86.98 పర్సంటైల్ వస్తుంది. అప్పుడు అది ఓపెన్ కేటగిరీ కటాఫ్ కానుంది. ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగితే ఓపెన్ కటాఫ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు.. విద్యార్థులకు వచి్చన పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 91.6438702 పర్సంటైల్ విద్యారి్థని తీసుకుంటే.. టాప్ 100 పర్సంటైల్ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్ తీసేస్తే ఆ విద్యారి్థకి వచ్చేది 8.3561298. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఆ విద్యార్థి ర్యాంకు 8.3561298 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 8,69,010తో గుణించి శాతం లెక్కిస్తే 72,615 వస్తుంది. అదే ఆ విద్యార్థి అంచనా ర్యాంకు అవుతుంది. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షలను 6 స్లాట్లలో నిర్వహించినందున (ఒకే ర్యాంకు ఆరుగురికి వచ్చే అవకాశం ఉన్నందున) అతడి ర్యాంకు 72,615కు 6 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఒకే ర్యాంకు ఉండదు ర్యాంకుల కేటాయింపు సమయంలో 100 పర్సంటైల్ వచి్చన విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు. వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులు చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచి్చన మార్కులను చూసి, ఆయా సబ్జెక్టుల వరుస క్రమంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికి ముందు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకు కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులు కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్‌లో జరిగే పరీక్ష తర్వాతే 2 దశల్లో జేఈఈ మెయిన్‌కు హాజరైన విద్యార్థులను, వారికి వచి్చన పర్సంటైల్‌ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. -
టాప్ తొమ్మిదిలో ఇద్దరు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించి జేఈఈ మెయిన్ పరీక్ష పలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 9 మంది ఉండగా... ఇందులో తెలుగు విద్యార్థులు నలుగురు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రొంగల అరుణ్ సిద్దార్ధ, చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి, ఏపీకి చెందిన లంధ జితేంద్ర, తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 9,21,261 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 8,69,010 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అడ్వాన్స్‌లోనూ కష్టపడతా జేఈఈ మెయిన్‌లో వంద పర్సంటైల్ రావడం ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లోనూ ఇదే తరహాలో కష్టపడి అత్యుత్తమ పర్సంటైల్ సాధిస్తా. బెస్ట్ ఐఐటీలో చదవడమే నా లక్ష్యం. – అరుణ్ సిద్దార్ధ ఆవిష్కరణలంటే ఇష్టం మెయిన్‌లో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం జేఈఈ అడ్వాన్స్పరీక్షే. ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. కానీ అడ్వాన్స్ ర్యాంకు బట్టి వచ్చే ఐఐటీలో చేరతా. కొత్త ఆవిష్కరణలంటే ఇష్టం. – చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి -
‘ఇంజనీరింగ్’కు ఐఐటీ అండ
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్‌లు, విశేష అనుభవం కలిగిన అధ్యాపకులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన జర్నల్స్, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలు మన ఐఐటీలు. అందుకే ఐఐటీలలో బీటెక్, ఎం టెక్ ఇతరత్రా కోర్సులు చదవాలన్నది విద్యార్థుల జీవిత లక్ష్యం. వాటిల్లో చదివితే చాలు అంతా సెట్ అయిపోయినట్లే. పక్కాగా క్యాంపస్ ప్లేస్మెంట్. భారీగా వేతనాలు. లేదంటే పరిశోధనలు.. అదీ కాదనుకుంటే స్టార్టప్ దిశగా అడుగులు.. ఇవీ ఐఐటీల్లో చదువుకునే విద్యార్థుల అవకాశాలు. అలాంటి ఐఐటీలు ఇకపై తమ పరిధిలోని సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించనున్నాయి. ఐఐటీల్లో అమలు చేస్తున్న ప్రత్యేక సిలబస్‌తో కూడిన విద్యా బోధన, అభ్యసన పద్ధతులు, ప్రమాణాల పెంపు, పరిశోధనల వైపు విద్యార్థులు మళ్లేలా ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను ఇక సాధారణ కాలేజీల్లోనూ అందించేందుకు చర్యలు చేపట్టనున్నాయి. ప్రతి ఐఐటీ.. తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీల ఎక్స్టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నాణ్యత ప్రమాణా పెంపునకు చర్యలు చేపట్టనున్నాయి. ఐఐటీల కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇదీ అమల్లోకి రానుంది. తమ విద్యార్థుల్లాగే వారికీ.. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. అవన్నీ తమ ఎక్స్టెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించింది. ఒక్కో ఐఐటీ తమ పరిధిలోని 10 ఇంజనీరింగ్ కాలేజీలను ఎంచుకొని ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు సహకారం అందించాలని పేర్కొంది. అందుకు ఎంపిక చేసిన 230 సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకుల్లో బోధన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తగిన శిక్షణ అందించనున్నాయి. తద్వారా ఆయా కాలేజీల్లో చదివే ఇంజనీరింగ్ విద్యార్థులను ఐఐటీల్లో చదివే విద్యార్థుల తరహాలో తీర్చిదిద్దనున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ఐఐటీ మద్రాసుకు (నోడల్ ఇన్స్టిట్యూట్గా) ఐఐటీల కౌన్సిల్ అప్పగించింది. ఐఐటీల పరిధిలోని కాలేజీల ఎంపికలో ఏఐసీటీఈ తగిన సహకారం అందించనుంది. ల్యాబ్‌లతోనూ అనుసంధానం.. దేశంలోని అత్యున్నత ల్యాబరేటరీలతో ఐఐటీలను అనుసంధానం చేయాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వంటి అనేక జాతీయ స్థాయి సంస్థలతో ఆయా ప్రాంతాల్లోని ఐఐటీలను అనుసంధానం చేయనుంది. వివిధ పరిశోధనల్లో డీఆర్డీవో శాస్త్రవేత్తలు, ఐఐటీల ఫ్యాకల్టీ కలసి పనిచేయాలని డీఆర్డీవో సెక్రటరీ సూచన మేరకు ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్, సైబర్ డిఫెన్స్ రంగాల్లో డీఆర్డీవోతో కలసి ఐఐటీలు జూనియర్ రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు పీహెచ్డీ లేకపోయినా వారితో బోధన నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలో పథకంలో కొన్ని మార్పులు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఆ బాధ్యతను నేషనల్ కోఆర్డినేటర్‌గా ఐఐటీ ఢిల్లీకి అప్పగించింది. 2020 ఫిబ్రవరి నాటికి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే ఐఐటీల్లో విదేశీ విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఐఐటీల్లో విదేశీ అధ్యాపకులను నియమించాలని ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినా, ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే కొత్తగా నిర్మించే ఐఐటీ క్యాంపస్‌లలో ఒక్కో విద్యార్థికి 75 స్క్వేర్ మీటర్లు కాకుండా 108 స్క్వేర్ మీటర్ల చొప్పున స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. బీటెక్ స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రంగాలను గుర్తించాలని పేర్కొంది. -
జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా సెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి. -
ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు
ఇండోర్: దేశంలోని 10 ఐఐటీల్లో గత అయిదేళ్లలో (2014–2019) 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం సమాధానమిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. ఐఐటీ–మద్రాస్‌లో ఈ అయిదేళ్ల కాలంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించింది. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అయిదుగురు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–హైదరాబాద్‌లలో ముగ్గురేసి చొప్పున విద్యార్థులు, బోంబే, గువాహటి, రూర్కీ ఐఐటీల్లో ఇద్దరేసి చొప్పున విద్యార్థులు, వారణాసి, ధన్‌బాద్, కాన్పూర్ ఐఐటీల్లో ఒక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. కానీ, కారణాలు మాత్రం వెల్లడించలేదు. విద్యార్థుల బలవన్మరణాలను నివారించడానికి ప్రతీ ఐఐటీలో విద్యార్థుల గ్రీవియెన్స్ విభాగాలు, క్రమశిక్షణా చర్యల కమిటీలు, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. -
టీచర్లకు టెస్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్:ఐఐటీల్లో ఇంజనీరింగ్ విద్యా బోధనలో నాణ్యతాప్రమాణాల పెంపు దిశగా చర్యలను ఐఐటీల కౌన్సిల్ వేగవంతం చేసింది. బోధనలో నాణ్యత తగ్గిపోతుండటంతో అంతర్జాతీయ స్థాయిని అందుకోలేకపోతున్నామని భావనకొచ్చింది. అందుకే ప్రస్తుత స్థానాన్ని మెరుగు పరుచుకోవడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చేలా చర్య లు చేపడుతోంది.ఇందులో భాగంగా ఐఐటీలకు అకడమిక్ ఫ్రీడంతోపాటు వివిధ ఐఐటీల్లో కొత్త అధ్యాపకుల బోధన తీరుతెన్నులపైనా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.అధ్యాపకులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఇటీవల జరిగిన కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మూడేళ్ల తర్వాత మూల్యాంకనం... పీహెచ్డీ పూర్తి చేసిన వారికి అనుభవం లేకపోయినా ప్రతిభావంతులైన వారిని ఖాళీగా ఉన్న స్థానాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి మూడేళ్ల తరువాత వారి పనితీరును ఐఐటీ అంతర్గత కమిటీలతో మూల్యాంకనం చేస్తారు. 5.5 ఏళ్ల తరువాత ఫ్యాకల్టీ పనితీరు, పరిశోధన, బోధన, తదితర అంశాల్లో ఎక్స్టర్నల్ కమిటీతో సమీక్షించి వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలా? లేదా బయటకు పంపించాలా? అన్న విషయాన్ని తేలుస్తారు. అంటే ఐదున్నరేళ్ల పాటు వారు కాంట్రాక్టు లేదా తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ కమిటీ వాల్యుయేషన్ తరువాతే వారి రెగ్యులరైజేషన్ అంశం తేల్చాలని, ఈ విధానాన్ని కొత్తగా నియమితులయ్యే వారికే వర్తింపజేయాలన్న ఆలోచనలో ఉంది. అలాగే అధ్యాపకులపై అడ్మినిస్ట్రేటివ్ పని భారాన్ని తగ్గించనున్నారు. దీంతో వారు పరిశోధనల పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తారని, తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని కౌన్సిల్ భావిస్తోంది. వెనుకబడితే బీఎస్సీ ఇంజనీరింగ్... ఐఐటీల్లో చేరే విద్యార్థులు సాధారణ విద్యార్థులకంటే కొంత ప్రతిభ కలిగిన వారే అయినా, వాటిల్లో చేరిన అందరూ ఒకేలా ఉండరు. వారి ప్రతిభలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వెనుకబడిన వారి కోసం బీఎస్సీ ఇంజనీరింగ్ చదివే అవకాశాన్ని కల్పించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులు తమ ప్రథమ సంవత్సరం (రెండో సెమిస్టర్) తర్వాత తమ సామర్థ్యాలను,రెండో సెమిస్టర్లో వారికి వచ్చే క్రెడిట్స్‌ను బట్టి,బీటెక్ కొనసాగకుండా బీఎస్సీ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు.మూడేళ్లకే ఈ డిగ్రీని ఐఐటీలు అందజేయాలని కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని నిబంధనలను ఐఐటీలే సొంతంగా రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేసింది. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం.. ఐఐటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచి బలోపేతం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి వర్సిటీల్లో దేశంలోని ఐఐటీలు, విద్యా సంస్థలు టాప్ 250–300 స్థానాల్లోనే ఉన్నాయి. ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన సర్వేలో ఇదే తేలింది. ఈ నేపథ్యంలో రీసెర్చ్, డెవలప్మెంట్, ప్రమాణాల పెంపులో అధ్యాపకులు కచ్చితమైన బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడుతోంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఐఐటీలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తమే కాకుండా పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. పరిశోధనలకు పెద్దపీట దేశంలోని ఐఐటీలతోపాటు ఇండియన్ వర్సిటీలకు చెందిన ప్రముఖులు అనేక మంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్నారు. అయినా దేశీయ విద్యా సంస్థలకు భారీగా నిధులను రాబట్టుకోలేకపోతున్నామన్న అంచనాకు కౌన్సిల్ వచ్చింది. హార్వర్డ్ వర్సిటీకి పూర్వ విద్యార్థుల నుంచి ఏడాదికి దాదాపు రూ. 800 కోట్లొస్తే.. 2017లో ఐఐటీ మద్రాసు రూ. 55 కోట్లే రాబట్టుకోగలిగింది. 2016లో అమెరికన్ వర్సిటీలు పూర్వ విద్యార్థుల నుంచి దాదాపు 535 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా, అందులో 25 టాప్ వర్సిటీలు 52 శాతం నిధులను పొందాయి. దేశంలోని విద్యా సంస్థలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఐఐటీల్లో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంపాదన నుంచి కనీసంగా ఒక శాతం మొత్తాన్ని ఐఐటీల అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల సమీక్ష... ఐఐటీల్లో విభాగాల వారీగా ఉన్న అకడమిక్ కమిటీల ఆధ్వర్యంలో కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను సమీక్షించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక సెమిస్టర్ పూర్తయ్యాక ఆయా కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపైనా విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా చర్యలు తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడంతోపాటు బోధనలో నాణ్యతాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. -
కొత్తగా జేఈఈ–మెయిన్
ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్ 2020కు నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్‌తో నేరుగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందొచ్చు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సైతం అర్హత పరీక్ష జేఈఈ మెయిన్. ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో పరీక్ష జరగనుంది. లక్షల మంది ఇంటర్ ఎంపీసీ/10+2 విద్యార్థులు ఎదురు చూసే జేఈఈ మెయిన్ పరీక్షలో జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) కీలక మార్పులు చేసింది. మరో నాలుగు నెలల్లోనే పరీక్ష జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో మార్పులు, దరఖాస్తు తీరుతెన్నులు, పరీక్ష విధానంపై సమగ్ర కథనం.. మార్పులు ఇవే గతేడాది వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రతీ దాంట్లో నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలు ఉండేవి. వచ్చే జనవరి మెయిన్ పరీక్షల నుంచి వాటిలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఐదు ప్రశ్నలను తగ్గించి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలను ఇవ్వనుంది. గతంలో మొత్తం 360 మార్కులకు పరీక్షలను నిర్వహించగా.. ఇకపై వాటిని 300 మార్కులకే పరిమితం చేసింది. గతంలో అన్నీ బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఉండగా.. ఇకపై 20 బహుళ ఐచ్చిక ప్రశ్నలు, 5 దశాంశ∙స్థాన తరహ(న్యూమరికల్ వాల్యు) ప్రశ్నలు అడగనున్నారు. గతంలో అన్ని ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండేది. ఇకపై దశాంశ స్థాన ప్రశ్నలకు రుణాత్మక మార్కుల విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. బీఆర్క్ పేపర్లో జరిగిన మార్పు బీఆర్క్‌లో ప్రవేశానికి నిర్వహించే మెయిన్ పేపర్ 2 పరీక్షల్లోనూ జేఏబీ మార్పులు చేసింది. బీఆర్క్ పరీక్షల్లో ఇప్పటి వరకు 100 ప్రశ్నలు ఉండేవి. ఇకపై వాటి సంఖ్యను 77కు తగ్గించింది. వీటిలో అయిదు ప్రశ్నలను న్యూమరికల్ వాల్యూ తరహా ప్రశ్నలు ఇవ్వనుంది. గతంలో డ్రాయింగ్కు సంబంధించి 3 ప్రశ్నలు అడిగితే.. ఇకపై వాటి సంఖ్యను 2 కే పరిమితం చేసింది. బీఆర్క్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్లై న్లో జరుగుతాయి. డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్–పేపర్ విధానంలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. బీప్లానింగ్ పేపర్లో ఇలా.. గతంలో బీ ప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి, ఇప్పుడు మ్యాథ్స్ మినహా మిగతా ఏ సబ్జెక్టు ఉన్న పర్వాలేదు. దీంతో ఎంఈసీ విద్యార్థులు కూడా బీప్లానింగ్‌లో ప్రవేశానికి అర్హులవుతారు. బీప్లానింగ్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2, ప్లానింగ్ బేస్డ్ కొశ్చన్స్ పార్ట్–3 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతాయి. పరీక్ష జేఈఈ మెయిన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్–2020(జనవరి) పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక అభ్యర్థి రెండుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు. రెండు పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అడ్మిషన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 25కు 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్విగా ఉంటాయి. మిగిలిన ఐ దు ప్రశ్నలు దశాంశ స్థాన తరహావి అడుగు తారు. 20 ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధా నం ఉండగా.. మిగతా ఐదు ప్రశ్నలకు మా త్రం రుణాత్మక మార్కుల నుంచి మినహయిం పు ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కు లు కేటాయిస్తే; ప్రతి తప్పు సమాధానానికి ఒక మా ర్కు కోత ఉంటుంది. న్యుమరికల్ వాల్యూ ప్రశ్నలకు సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి, తప్పు సమాధానానికి ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. అర్హత ఇంటర్(ఎంపీసీ)/10+2 2018, 2019లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు. అలాగే 2020లో ఫైనల్ ఇయర్ ప్రవేశాలు పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌కు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు. కానీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి నిబంధన ఉంది. ప్రిపరేషన్ టిప్స్ జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ సాధించేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై పట్టు సాధించడం తప్పనిసరి. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఉందో గుర్తించాలి. సిలబస్‌లోని అన్ని టాపిక్స్ ముఖ్యమైనవే అయినప్పటికీ.. పరీక్ష కోణం లో కొన్ని అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆయా సబ్జెక్టుల ప్రిపరే షన్‌కు ప్రణాళిక రూపొందించుకొని ప్రతిరోజూ చదు వుతుండాలి. నాలుగు నెలల సమయం మాత్రమే అందుబాటులో ఉన్నందున అందుకు తగ్గట్లు ఎవ్రీ డే, వీక్లీ, మంత్లీ ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. కష్టమైన టాపిక్స్‌కు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదు వుతూ.. తొలుత కాన్సెప్ట్లపై అవగాహన పెంచు కోవాలి. ఆ తర్వాత రోజూ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆయా పుస్తకాలు చదివేటప్పుడే ముఖ్యాంశాలు, సూత్రాలు నోట్స్‌లో రాసుకోవాలి. ఈ షార్ట్‌నోట్స్ పరీక్షకు ముందు వేగంగా రివిజిన్ చేయడంలో దోహదపడుతుంది. దరఖాస్తు ఫీజు ♦ జనరల్, ఓబీసీ (అబ్బాయిలు) రూ.650; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలకు (జనరల్, ఓబీసీ) రూ.325. ♦ ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. ♦ తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్. ముఖ్య సమాచారం ♦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 3, 2019. ♦ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019. ♦ అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: డిసెంబర్ 6, 2019. ♦ పరీక్ష విధానం: ఆన్లైన్లో. ♦ పరీక్ష సమయం: 3 గంటలు. ♦ పరీక్ష తేదీ : 2020, జనవరి 6 నుంచి 11 వరకు. ♦ ఫలితాల వెల్లడి : 31.01.2020. ♦ వెబ్సైట్ : www.nta.ac.in -
ఐఐటీల్లో అమ్మాయిలు అంతంతే!
దేశంలోని 3,000 విద్యాసంస్థల నుంచి ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో యువతులు 30 శాతం మంది మాత్రమే. అడ్వాన్స్డ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోచింగ్ క్లాసుల తాలూకూ ప్రకటనల్లో అమ్మాయిల ఫొటోలు దాదాపుగా కనిపించని పరిస్థితి. ఐఐటీల్లో పరిస్థితి మరింత అన్యాయం. ఈ ఏడాది 23 ఐఐటీల్లో మొత్తం 38,705 మంది అభ్యర్థులు ప్రవేశార్హత సాధించగా అందులో బాలికలు 5,356 (13.8 శాతం) మంది మాత్రమే. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచిన షబ్నమ్ సహాయ్ 10వ ర్యాంకు సాధించింది. 2018లో టాప్ 500 మంది అభ్యర్థుల్లో అమ్మాయిల సంఖ్య 23 మించలేదు. ఉన్నత విద్యారంగంలో చోటుచేసుకున్న లింగ వివక్షకు ఇదొక ప్రబల ఉదాహరణ. బాలికలపట్ల సమాజ ధోరణులే ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోశ్ శర్మ. కుటుంబం అబ్బాయిలను ప్రోత్సహిస్తోంది. వారు మరో ఆలోచన లేకుండా తమ ఐఐటీ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారు. అమ్మాయిలకు సమర్థత ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువవుతోంది. ‘నా కూతురు భద్రంగా ఉంటుందా? ఇంటికి దూరంగా మనగలుగుతుందా? కోర్సు డిమాండ్ చేసిన విధంగా చదువు సాగించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా?’ వంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి. వారిని ఆందోళనకు లోను చేస్తున్నాయి. ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే విద్యార్థులు గట్టి కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక ఖరీదైన వ్యవహారం. ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో ఖర్చు పెట్టేందుకు సిద్ధ్దపడని దుస్థితి. పైగా రవాణా సౌకర్యం, హాస్టల్లో ఉండాల్సి రావడం గురించి నానారకాల భయాలు. ఈ పరిస్థితుల్లో అమ్మాయిల్ని స్థానిక కళాశాలల్లో చేర్చడం ఉత్తమమని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కాన్పూర్‌లో పార్ధా కోచింగ్ సెంటర్ నడుపుతున్న మనీష్ సింగ్ చెబుతున్నారు. ఈ ఏడాది ఆయన 1,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారిలో 10 శాతం మంది మాత్రమే బాలికలు. వారెవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. సీటు లభించాలేగానీ అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించగలుగుతున్నారంటారు ఐఐటీ ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమీత్ అగర్వాల్. ప్రవేశపరీక్ష బాలికలకు ఒకింత అవరోధంగా ఉందని ఆయన చెబుతున్నారు. ఐఐటీల్లో లింగ నిష్పత్తి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతేడాది ఐఐటీ కౌన్సిల్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన బాలికలకు అదనంగా సీట్లు కేటాయించింది. దీంతో వారి శాతం 8 నుంచి 16కి పెరిగింది. ఐఐటీ ఢిల్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో 2016లో 70 మంది బాలికలు చేరగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 190కి పెరిగిందని అగర్వాల్ తెలిపారు. ఐఐటీలు లింగ సమతౌల్యత పాటించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి విశదపరుస్తోంది. లేకుంటే జనాభాలో 50 శాతం మంది ప్రతిభా సామర్థ్యాలను మనం కోల్పోతామంటున్నారు అగర్వాల్. మెరుగైన సమాజం కోసం సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్న మనం.. ఇందులో అన్ని తరగతుల ప్రజలను భాగస్వాముల్ని చేయాల్సి ఉందని అగర్వాల్ వంటి మేధావులు సూచిస్తున్నారు. -
నిరుపేద విద్యార్థినికి ఐఐటీ సీటు
సాక్షి, హైదరాబాద్ : తల్లి వ్యవసాయ కూలీ.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువు.. అయినా ఆ విద్యార్థికి తాను బాగా చదువుకోవాలన్న తపన ముందు అవేవీ అడ్డుకాలేదు. బాగా చదువుకొని ఏదైనా సాధించాలన్న తపన, ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు ఆమెను ఐఐటీలో సీటు సాధించేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివిన ఎస్.పవిత్రకు ఐఐటీ ధన్బాద్లో సీటు లభించింది. ఐఐటీ, ఎన్ఐటీ , ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ సీట్ల కేటా యింపును జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) గురువారం ప్రకటించింది. ఇందులో పవిత్రకు ఐఐటీ ధన్బాద్లో సీటు లభించింది. తల్లి ధనలక్ష్మి రోజూ కూలి పనికి వెళ్తూ కూతురు పవిత్రను చదివించింది. పవిత్ర ఎలాంటి కోచింగ్ లేకపోయినా కష్టపడి చదువుకొని ఇంటర్మీడియెట్‌లో 936 మార్కులు సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ కేటగిరీలో 2,954 ర్యాంకును సాధించింది. ఐఐటీలో సీటు సాధించిన పవిత్రకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లతోపాటు మధుసూన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
అదనంగా 2,660 సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి విద్యార్థుల నుంచి చాయిస్ ఫిల్లింగ్‌కు (వెబ్ ఆప్షన్లు) అవకాశం కల్పిస్తామని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రకటించినా.. ఆదివారం నుంచే ప్రారంభించింది. మొత్తంగా ఏడు దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. జూలై 23 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన రిపోర్టింగ్ కేంద్రాల వివరాలను జోసా వెబ్సైట్ లో ( https://josaa.nic.in) అందుబాటులో ఉంచింది. రిపోర్టింగ్ కేంద్రాల్లో నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టె్టన్స్/సీట్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుందని వివరించింది. అదనంగా 4,719 సీట్లు.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో కేంద్రం ఈసారి సీట్లను భారీగా పెంచింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోసం 10 శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ప్రత్యేకంగా సీట్లను పెంచింది. మరోవైపు ఐఐటీ, ఎన్ఐటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సూపర్ న్యూమరీ కోటా కింద ఏటేటా సీట్లను పెంచుతోంది. దీనిలో భాగంగా ఈసారి కూడా 2,059 సీట్లను పెంచింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కింద 2,660 సీట్లను అదనంగా పెంచింది. ఇలా మొత్తంగా 4,719 సీట్లను ఈసారి అదనంగా పెంచింది. 107 విద్యా సంస్థల్లో 45,244 సీట్లు.. ఐఐటీలతోపాటు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీలలో ఈసారి సీట్లు ఎక్కువగా పెరిగాయి. మహిళల సూపర్ న్యూమరీ సీట్లతోపాటు ఈడబ్ల్యూఎస్ కోటా అదనంగా రావడంతో సీట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 25 ట్రిపుల్ఐటీ, 28 జీఎఫ్‌టీఐలు మొత్తంగా 107 విద్యా సంస్థల్లో గతేడాది 41 వేల వరకు అందుబాటులో ఉండగా, ఈసారి వాటి సంఖ్య 45,244కి పెరిగింది. ఎన్ఐటీల్లో ఎక్కువగా పెరుగుదల.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈసారి ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 1,384 సీట్లు అదనంగా వచ్చాయి. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 638 సీట్లు పెరిగాయి. ఎన్ఐటీల్లో 50 శాతం సీట్లు హోంస్టేట్ కోటా కింద ఉన్నందున ఆయా రాష్ట్రాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగిన సీట్లతో అధిక ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మహిళల భాగస్వామ్యం కోసం అదనంగా ఇస్తున్న సూపర్ న్యూమరీ సీట్ల సంఖ్య ఐఐటీల్లో ఎక్కువగా పెరిగింది. ఈసారి 1,221 సీట్లు ఐఐటీల్లోనే పెరిగాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్.. 21–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు రాసే వారికి చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం 25–6–2019: ఏఏటీ, ఇతరులందరికీ సాయంత్రం 5 గంటలకు చాయిస్ ఫిల్లింగ్ ముగింపు 27–6–2019: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు 28–6–2019 నుంచి జూలై 2 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ 3–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 3–7–2019: సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు 4–7–2019 నుంచి 5–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 6–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 6–7–2019: సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్ల కేటాయింపు 7–7–2019 నుంచి 8–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 9–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 9–7–2019: సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు 10–7–2019 నుంచి 11–7–2019 వరకు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 12–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 12–7–2019: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు 13–7–2019 నుంచి 14–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 15–7–2019: ఉదయం 10గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు 6వ దశ సీట్లు కేటాయింపు 16–7–2019 నుంచి 17–7–2019: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా (ఐఐటీల్లో సీట్ విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం) 18–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ (చివరి) సీట్ల కేటాయింపు 19–7–2019: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీల్లో చేరికలు 19–7–2019 నుంచి 23–7–2019 వరకు: ఎన్ఐటీ ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, ప్రవేశాలు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించేందుకు ఐఐటీ రూర్కీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.45లక్షల మందికి అర్హత కల్పించినా కేవలం 1.80 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేలమంది అర్హత సాధించిన అడ్వాన్స్‌డ్‌కు కేవలం 18 వేలమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి 8,450 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షను సోమవారం రెండు విడతల్లో పరీక్ష నిర్వహించేలా ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్షను, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్– 2 పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరని, విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెంట పెన్నులు, పెన్సిళ్లు, హాల్‌టికెట్లు, ఐడీ కార్డు తెచ్చుకోవాలని పేర్కొంది. ఇక ఈ పరీక్ష ఫలితాలను/ర్యాంకులను వచ్చే నెల 14న విడుదల చేస్తామని ప్రకటించింది. ఇదీ అడ్వాన్స్డ్ షెడ్యూలు - 27–5–2019: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - 29–5–2019 నుంచి 1–6–2019 వరకు: అభ్యర్థులకు వారి రెస్పాన్స్‌షీట్లు పంపిణీ - 4–6–2019: వెబ్సైట్లో అందుబాటులోకి ‘కీ’ - 4–6–2019 నుంచి 5–6–2019 వరకు: ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ - 14–6–2019 ఉదయం 10 గంటలకు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడి - 14–6–2019 నుంచి 15–6–2019 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ - 17–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు - 21–6–2019 సాయంత్రం: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఫలితాలు -
17% సీట్లు అమ్మాయిలకే..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి అమ్మాయిలకు 17 శాతం సీట్లను కేటాయించేందుకు ఐఐటీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. గతేడాది సూపర్‌న్యూమరరీ కింద 779 సీట్లను పెంచి అమ్మాయిల ప్రవేశాలను 15.3 శాతానికి చేర్చిన ఐఐటీ కౌన్సిల్ ఈ సారి కనీసంగా 17% దాటేలా చూడాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 9.15 శాతమే ఉండటంతో దానిని 2020–21 విద్యా సంవత్సరం నాటికి కనీసంగా 20 శాతానికి పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018–19 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో 14 శాతం సీట్లను కేటాయిస్తామని ప్రకటించింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రెగ్యులర్‌గా సీట్లు లభించిన వారు కాకుండా అదనంగా 779 మంది అమ్మాయిలకు ప్రత్యేక సీట్లను కేటాయించింది. దీంతో ఆ విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 1,840కి చేరింది. ఇక ఈసారి (2019–20 విద్యా సంవత్సరం) 17 శాతం సీట్లను పెంచేందుకు ఐఐటీల కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రవేశాలు పెంచేందుకు.. దేశవ్యాప్తంగా 2014–15లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అమ్మాయిల్లో కేవలం 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015–16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది అమ్మాయిలు అర్హత సాధిస్తే అందులో 850 మందికే సీట్లు వచ్చాయి. 2016–17 విద్యా సంవత్సరంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో 9.15 శాతం మంది అమ్మాయిలకే సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు చర్యలు చేపట్టింది. వరుసగా మూడేళ్ల పాటు ప్రత్యేక సీట్లు కేటాయించి అమ్మాయిల ప్రవేశాలను కనీసంగా 20 శాతానికి చేర్చాలని కేంద్రం గతేడాది నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. వీటిని సూపర్‌న్యూమరీ కింద ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. అబ్బాయిల సీట్లను తగ్గించకుండా అమ్మాయిలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేరిన 9.15 శాతానికి 4.85 శాతం కలిపి కనీసంగా 14 శాతం మంది అమ్మాయిలకు ప్రవేశాలు లభించేలా సీట్లను పెంచింది. ఇక ఈసారి 17 శాతం సీట్లను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీటెక్ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య 2 వేలు దాటనుంది. పెరగనున్న సీట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లున్నాయి. వాటికి అదనంగా 779 సీట్లు చేర్చి 2018–19 విద్యా సంవత్సరంలో సీట్లను 12,058కి పెంచింది. ఈసారి కనీసంగా 17 శాతం కంటే ఎక్కువ మంది అమ్మాయిలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ప్రకారం 2019–20 విద్యా సంవత్సరంలో అమ్మాయిలకు అదనంగా వేయి సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది సీట్ల పెంపులో భాగంగా అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అమ్మాయిలకు 113 అదనపు సీట్లు లభించగా, హైదరాబాద్ ఐఐటీలో 57 అదనపు సీట్లు వచ్చాయి. దీని ప్రకారం ఈ సారి వాటి సంఖ్య మరింతగా పెరుగనుంది. -
గోపీ అకాడమీకి ఐఐటీ సహకారం
కోల్‌కతా: బ్యాడ్మింటన్‌లో సాంకేతిక అంశాల్లో సహకారం అందించే విషయంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ)తో ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ జతకట్టింది. క్రీడాకారులకు ఇచ్చే కోచింగ్‌తో పాటు సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి, పీజీబీఏ వ్యవస్థాపకుడు పుల్లెల గోపీచంద్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్రీడాకారులకు అందించే కోచింగ్‌లో వినూత్న పద్ధతులు రూపొందించే విషయంలో ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయపడుతుంది. క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా శిక్షణలో ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలనే అంశాలపై కోచ్‌లకు సహకరిస్తుంది. దీనితో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రాంగణంలో మరో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనుంది. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ ‘ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అకాడమీ అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. ఈ అకాడమీ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని’ పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ప్రొఫెసర్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్‌తో సమన్వయం చేసుకుంటూ బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకువస్తామని ఆయన అన్నారు. -
ఐఐటీ, ఐఐఎంలకు నిధుల కోత
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లతోపాటు నియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపులను 2018–19తో పోలిస్తే కేంద్రం తగ్గించింది. 2019 విద్యాసంవత్సరం నుంచి జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం కోటా కల్పించి, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పెంచిన నేపథ్యంలో ఆయా సంస్థలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఐఐఎంలకు గత ఏడాది రూ.1,036 కోట్లు కేటాయించగా ఈసారి 59.9 శాతం కోతపెడుతూ 415.41 కోట్లు కేటాయించారు. ఐఐటీలకు గత ఏడాది రూ.6,326 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్లో రూ.6,223.02 కోట్లు కేటాయించారు. 2017–18లో ఐఐటీలకు రూ.8,337.21 కోట్లు ఇచ్చారు. యూజీసీకి గత ఏడాది 4,722.75 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దాన్ని రూ.4,600.66 కోట్లకు తగ్గించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి గత ఏడాది 485 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 466 కోట్లకు తగ్గించారు. మొత్తమ్మీద చట్టబద్ద నియంత్రణ సంస్థలకు గతఏడాదితో పోలిస్తే 2.70 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ సంస్థలకు రూ.5,066.66 కోట్లు ప్రతిపాదించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,207.75 కోట్లు కేటాయించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లకు ఈ బడ్జెట్లో రూ.660 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత ఏడాది రూ.689 కోట్లుగా ఉంది. -
జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ 87.71
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ స్కోర్‌ను మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్ విధానంలో ఇచ్చినప్పటికీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే వారి కటాఫ్ ఓపెన్ కేటగిరీలో 87.71 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ స్కోర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో పర్సంటైల్ ఇవ్వడంతో కొందరు విద్యార్థులు అడ్వాన్స్డ్ కటాఫ్ ఎంత ఉండవచ్చన్న అనుమానాల్లో పడ్డారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, పర్సంటైల్ విధానం ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ లెక్కించుకోవచ్చని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకు ఓపెన్ కేటగిరీలో కటాఫ్ 87.71 ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఏప్రిల్‌లో రెండోదఫా జేఈఈ మెయిన్ పరీక్ష ఉన్నందున దానికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య బట్టి కటాఫ్ లో మార్పులు ఉంటాయి. అప్పుడే కటాఫ్ పర్సంటైల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించనుంది. ఓపెన్ కేటగిరీ కటాఫ్ లెక్కింపు ఇలా.. సాధారణంగా అన్ని కేటగిరీల్లో కలిపి 2.24 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో సమాన మార్కులు వచ్చిన విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోవడంతో మరో 7 వేలు పెరిగి 2.31 లక్షలకు చేరుకుంది. ఈసారి మాత్రం టాప్ 2.24 లక్షల మందినే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం 50.5 శాతం విద్యార్థులను ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి. దీంతో ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్య 1,13,120 అవుతుంది. అందులో దివ్యాంగులను 5 శాతం మినహాయిస్తే 1,07,464 మందిని ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షకు మొత్తం 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల శాతం 12.2890577 అవుతుంది. జనవరి పరీక్షలో టాప్ పర్సంటైల్ 100.0000000. అందులో నుంచి ఓపెన్ కేటగిరీ విద్యార్థుల పర్సంటేజీని తీసేస్తే 87.7109423 పర్సంటైల్ వస్తుందని, ఓపెన్ కేటగిరీలో కటాఫ్‌గా ఉండే పర్సంటైల్ అదే అయ్యే అవకాశం ఉందని జేఈఈ నిపుణులు సురేష్‌కుమార్ వివరించారు. ఇది పూర్తిగా జనవరి పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకేనని పేర్కొన్నారు. వాస్తవానికి జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 54,729 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. అంటే వారంతా ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం రాసిన వారు, పరీక్ష రాయని వారు కలుపుకుని విద్యార్థుల సంఖ్య 9,29,198కి చేరే అవకాశం ఉంది. ఈ విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థుల సంఖ్య (దివ్యాంగులు కాకుండా) 1,07,464 మంది. దీన్ని పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యతో చూస్తే 11.56524228 శాతం. టాప్ పర్సంటైల్ 100 అయినందున అందులో నుంచి 11.56524228ని తీసివేస్తే 88.4347577 వస్తుంది. అదే ఓపెన్ కేటగిరీ కటాఫ్ అవుతుంది. ఏప్రిల్‌లో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి ఇది మారనుంది. ఐఐటీల్లో సీట్లు పెరిగితే మాత్రం అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు కటాఫ్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు విద్యార్థులకు వచ్చిన పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 93.9274506 పర్సంటైల్ విద్యార్థిని తీసుకుంటే.. టాప్ 100 పర్సంటైల్ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్ తీసివేస్తే అతనికి వచ్చేది 6.0725494. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో అతని ర్యాంకు 6.0725494 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం 8,74,469 మంది విద్యార్థుల్లో చూస్తే అతనికి వచ్చే ర్యాంకు 53102.562012686. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షను 8 దఫాలుగా నిర్వహించినందున అతని ర్యాంకులో 8 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు 100 పర్సంటైల్ వచ్చి న విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు. వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులను చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. వరుసగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వరుసగా చూసి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముందు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకును కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్‌లో జరిగే పరీక్ష తర్వాతే 2 దఫాల్లో జేఈఈ మెయిన్‌కు హాజరైన విద్యార్థులను, వారికి వచ్చిన పర్సంటైల్‌ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. -
జేఈఈ ఫైనల్ ‘కీ’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు (జీఎఫ్‌టీఐ)లలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’తో పోల్చితే అం దులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ప్రశ్నలకు జవాబులు మారిపోగా 11 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 70 వేల మంది సహా దేశవ్యాప్తంగా 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ‘కీ’ ప్రకటించి వాటిపై విద్యార్థుల అభ్యం తరాలను స్వీకరించింది. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నెల 19న ఫలితాలను (విద్యార్థుల నార్మలైజేషన్ స్కోర్) ప్రకటించింది. అదే రోజు ఫైనల్ ‘కీ’ కూడా వెలువడుతుందని భావించినా ఎన్టీఏ దాన్ని బుధవారం ప్రకటించింది. ‘కీ’ని పరిశీలించిన జేఈఈ నిపుణులు ఉమాశంకర్ ప్రాథమిక ‘కీ’, ఫైనల్ ‘కీ’ మధ్య వ్యత్యాసం ఉందని అంచనా వేశారు. దీంతో 11 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 11 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. తొలగిం చిన 11 ప్రశ్నలకు ఆయా షిప్ట్‌లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మార్కులను కేటాయిం చినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే 8 షిఫ్ట్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థుల స్కోర్‌ను నార్మలైజేషన్ చేసి వారి పర్సంటైల్‌ను ఇటీవల ఎన్టీఏ ప్రకటించడం తెలిసిందే. దీనిలో భాగంగా 100 పర్సంటైల్‌లో సాధించిన వారు దేశవ్యాప్తంగా 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఫలితాలను ఎన్టీఏ ఎలా వెల్లడించిందన్న విషయం లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రాథమిక ‘కీ’పై ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేసి ఫలి తాలను ప్రకటించిందా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాలను ప్రకటించిందా? అనే గందరగోళం నెలకొంది. ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఫైనల్ ‘కీ’ ప్రకారం 100 పర్సంటైల్లోకి వచ్చే తెలుగు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన 100 పర్సంటైల్ విద్యార్థుల్లో తెలుగువారు ఐదుగురు ఉండగా ఆ ఫలితాల్లో ఫైనల్ ‘కీ’ని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగిన మార్పు లు, ఫైనల్ ‘కీ’మేరకు చూస్తే మరో 10 మంది వరకు తెలు గు విద్యార్థులు 100 పర్సంటైల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవీ వివిధ షిఫ్ట్‌లలో జవాబుల మార్పు, ప్రశ్నల తొలగింపు.. ఈ నెల 9న జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నకు జవాబును మార్చింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్న కు జవాబును మార్పు చేసింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నల జవాబులను మార్చింది.10వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా, మ్యాథ్స్ లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయడంతోపాటు ఒక ప్రశ్నను తొలగించింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. 11వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు జవాబులను మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేసింది. అదేరోజు మధ్యాహ్నం జరిగిన రెండో షిప్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది.12వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను తొలగించింది.