గాంధీనగర్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇతర దేశాల్లో రోజుకి లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే భారత్‌లో మాత్రం ఆ స్థాయిలో పరీక్షల సామర్థ్యం జరగడం లేదు. ఒకవేళ టెస్టింగ్ కెపాసిటీ పెరిగినా 24 గంటలు వేచి చూడాల్సిన సమయం. దీంతో కరోనా నిర్ధారణ వేగవంతం చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గాంధీనగర్‌కు చెందిన విద్యార్థులు సరికొత్త టెక్నాలజీని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేధస్సు )తో ఇది పనిస్తుందని, మనిషి ఛాతీ భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనా నిర్ధారణ చేయొచ్చంటున్నారు. ఎక్స్‌రే ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో న్యూరల్ నెట్‌వర్క్‌కి అనుసంధానించడం ద్వారా కరోనా ఉందో లేదో ఆటోమెటిక్‌గా వెల్లడవుతుందని రీసెర్చ్ టీమ్ ఎంటెక్ విద్యార్థి కుష్పాల్ సింగ్ యాదవ్ తెలిపారు. (నవంబర్ అఖరు వరకు ఉచిత రేషన్ : మోదీ )
మనిషి మెదడులోని న్యూరాన్‌ల వలె 12 లేయర్ల న్యూరల్ నెట్‌వర్క్ ఉంటుందని దీని ద్వారా ఆటోమెటిక్‌గా ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ కావడంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అని కుష్పాల్ అభిప్రాయపడ్డారు. ఐఐటీ విద్యార్దులు రూపొందించిన ఈ సరికొత్త టెక్నాలజీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపిహెచ్) పరీక్షిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణకు త్వరలోనే మార్గం సుగుమం కానుంది. దీని ద్వారా టెస్టింగ్ కెపాసిటీ పెరగనుంది.
ఇక భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 19,459 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 5,48,318 కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారినపడి 380 మంది చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,475 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో 15 వేలకు పైగా కేసులు నమోదవడం వరుసగా ఇది ఆరవ రోజు. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు! )
Comments
Please login to add a commentAdd a comment