Testing process
-
స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్
కవోసియంగ్(తైవాన్): తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవి్వంపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు. ‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్‌మెరైన్. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్మెరైన్లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం మింగుడుపడనిదే. -
కరోనా పరీక్షల్లో అగ్రస్ధానంలో ఏపీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ప్రక్రియ ఊహించని స్దాయిలో వేగం పుంజుకుంది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఎలాంటి ల్యాబ్‌లు లేకపోయినా సమయానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కరోనా పరీక్షల సామర్ధ్యం మెరుగుపరుచుకుంది. విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తూ ప్రస్తుతం టెస్టుల్లో దేశంలోనే అగ్రభాగంలో నిలిచింది. ప్రతి పది లక్షల జనాభాకు 114 టెస్టులతో మొదలై అధికారుల కృషి, ప్రభుత్వ ముందుచూపుతో రాష్ట్రం ఇప్పుడు మిలియన్ జనాభాకు 50,664 పరీక్షలు చేసేలా ఎదిగింది. ఈనెల 13న ప్రతి మిలియన్ జనాభాకు 50వేల పైచిలుకు టెస్టులు పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలిచింది. ఇక కరోనా టెస్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకున్న తీరును గమనిస్తే..ఏప్రిల్ 19న ఏపీలో ప్రతి పదిలక్షల మందికి 505 కరోనా పరీక్షలు నిర్వహించగా జూన్ 13న ఏకంగా 10,048కి, జులై 8న 20,182 టెస్టులు చేయగలిగే సామర్ధ్యాన్ని పెంచుకోగలిగింది. ఆగస్ట్ 4 నాటికి ప్రతి పదిలక్షల మందిలో 40,731 మందికి పరీక్షలు నిర్వహించగా ఆగస్ట్ 13 నాటికి ఆ సంఖ్య ఏకంగా 50,664కు ఎగబాకింది. చదవండి : ఏపీలో 27 లక్షలు దాటిన కరోనా పరీక్షలు -
ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా 3.2 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజులో ఇంత భారీసంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. జూలై 14 వరకు దేశంలో 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రతి పదిలక్షల మందికి 8994.7 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 14 వరకు మొత్తం 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించగా, ఒక్క మంగళవారమే 3,20,161 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ వర్మ తెలిపారు. మే 25న రోజుకి 1.5 లక్షలకు పైగా ఉన్న కోవిడ్ పరీక్షా సామర్థ్యం మంగళవారానికి 4 లక్షలకు చేరుకున్నట్టు శర్మ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి దేశం, ప్రతి పదిలక్షల మందికి రోజుకి 140 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 865, ప్రైవేటు రంగంలో 358.. మొత్తం కలిపి 1,223 పరీక్షా కేంద్రాలున్నాయి. 24 గంటల్లో 29,429 కేసులు దేశంలో వరుసగా నాలుగో రోజు 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో కొత్తగా 29,429 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అలాగే 582 మంది బాధితులు కరోనా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందారు. ఇప్పటిదాకా మొత్తం కేసులు 9,36,181కు, మరణాలు 24,309కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,19,840 కాగా, 5,92,031 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 63.24 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం 1,24,12,664 కరోనా టెస్టులు నిర్వహించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణ
గాంధీనగర్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇతర దేశాల్లో రోజుకి లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే భారత్‌లో మాత్రం ఆ స్థాయిలో పరీక్షల సామర్థ్యం జరగడం లేదు. ఒకవేళ టెస్టింగ్ కెపాసిటీ పెరిగినా 24 గంటలు వేచి చూడాల్సిన సమయం. దీంతో కరోనా నిర్ధారణ వేగవంతం చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గాంధీనగర్‌కు చెందిన విద్యార్థులు సరికొత్త టెక్నాలజీని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేధస్సు )తో ఇది పనిస్తుందని, మనిషి ఛాతీ భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనా నిర్ధారణ చేయొచ్చంటున్నారు. ఎక్స్‌రే ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో న్యూరల్ నెట్వర్క్కి అనుసంధానించడం ద్వారా కరోనా ఉందో లేదో ఆటోమెటిక్‌గా వెల్లడవుతుందని రీసెర్చ్ టీమ్ ఎంటెక్ విద్యార్థి కుష్పాల్ సింగ్ యాదవ్ తెలిపారు. (నవంబర్ అఖరు వరకు ఉచిత రేషన్ : మోదీ ) మనిషి మెదడులోని న్యూరాన్ల వలె 12 లేయర్ల న్యూరల్ నెట్వర్క్ ఉంటుందని దీని ద్వారా ఆటోమెటిక్‌గా ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ కావడంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అని కుష్పాల్ అభిప్రాయపడ్డారు. ఐఐటీ విద్యార్దులు రూపొందించిన ఈ సరికొత్త టెక్నాలజీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపిహెచ్) పరీక్షిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణకు త్వరలోనే మార్గం సుగుమం కానుంది. దీని ద్వారా టెస్టింగ్ కెపాసిటీ పెరగనుంది. ఇక భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 19,459 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 5,48,318 కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారినపడి 380 మంది చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,475 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో 15 వేలకు పైగా కేసులు నమోదవడం వరుసగా ఇది ఆరవ రోజు. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు! ) -
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ రికార్డ్
-
35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్లు ఉత్పత్తి చేశాం
-
ఒకేసారి ఐదు నమూనాల పరీక్ష
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు.. పాజిటివ్ కేసులు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలను పెంచడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ పరీక్షలు నిర్వహించేలా(పూల్ టెస్టింగ్) భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఒక రోడ్‌మ్యాప్ రూపొందించింది. ఈ విధానంలో ఐదు నమూనాలను ఒకేసారి పరీక్షించవచ్చు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ–పీఆర్సీ)తో ఈ పరీక్షలు చేస్తారు. ఫలితం నెగటివ్ అని వస్తే.. అందులోని అన్ని నమూనాలు నెగటివ్ అని అర్థం. అంటే కరోనా లక్షణాలు లేనట్లే. ఒకవేళ పాజిటివ్ అని వస్తే.. అన్ని నమూనాలను బయటకు తీసి, మళ్లీ విడివిడిగా పరీక్షిస్తారు. దీనిద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ నమూనాలు పరీక్షించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
తేజస్ ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ సక్సెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’మరో అరుదైన ఘనత సాధించింది. గోవాలోని ఓ నావికా కేంద్రంలో తొలిసారి విజయవంతంగా అరెస్టెడ్ ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్ ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్ అవుతుంది. నిమిషానికి 1,500 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ.. యుద్ధ విమానానికి ఏ మాత్రం నష్టం కలగకుండా ల్యాండ్ కావడం ఈ ప్రక్రియలోని విశేషం. ఇది విజయవంతంగా పూర్తవడంతో నేవీలోనూ తేజస్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నేవీ కోసం ప్రస్తుతం రెండు తేజస్ విమానాలను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క సీటుండే తేజస్‌తో అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ సామర్థ్యమున్న యుద్ధ విమానాన్ని రూపొందించిన ఘనత భారత్‌కే దక్కింది. మరి కొన్నిసార్లు ఇదే ఫలితాలను సాధిస్తే పరీక్ష కేంద్రంలో కాకుండా అసలైన యుద్ధనౌకపై అరెస్టెడ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. -
‘అత్యాచార’ పరీక్షా విధానంలో మార్పు
బెంగళూరు: నగరంలో మహిళలపై అత్యాచారాలు అధికం కావడంతో వాటిని నిరోధించడానికి కర్ణాటక ప్రభుత్వం నడుం బిగించింది. ఢిల్లీ తరువాత బెంగళూరులోనే బాలికలపైన, మహిళలపైన అమానుషంగా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యాచారాలను ఖండిస్తూ కన్నడ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బెంగళూరు బంద్ జరిగింది. అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో అత్యాచార బాధిత మహిళలకు ప్రస్తుతం చేస్తున్న పరీక్షా విధానంలో మార్పు చేస్తూ నిపుణులైన ముగ్గురు వైద్యులు గల సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు సాంత్వన చేకూర్చే ఇంటిగ్రేటెడ్ సెంటర్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉమాశ్రీ చెప్పారు.