యు.టి.ఖాదర్
బెంగళూరు: నగరంలో మహిళలపై అత్యాచారాలు అధికం కావడంతో వాటిని నిరోధించడానికి కర్ణాటక ప్రభుత్వం నడుం బిగించింది. ఢిల్లీ తరువాత బెంగళూరులోనే బాలికలపైన, మహిళలపైన అమానుషంగా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యాచారాలను ఖండిస్తూ కన్నడ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బెంగళూరు బంద్ జరిగింది. అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు.
ఈ నేపధ్యంలో అత్యాచార బాధిత మహిళలకు ప్రస్తుతం చేస్తున్న పరీక్షా విధానంలో మార్పు చేస్తూ నిపుణులైన ముగ్గురు వైద్యులు గల సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు సాంత్వన చేకూర్చే ఇంటిగ్రేటెడ్ సెంటర్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉమాశ్రీ చెప్పారు.