న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు.. పాజిటివ్ కేసులు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలను పెంచడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ పరీక్షలు నిర్వహించేలా(పూల్ టెస్టింగ్) భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఒక రోడ్‌మ్యాప్ రూపొందించింది. ఈ విధానంలో ఐదు నమూనాలను ఒకేసారి పరీక్షించవచ్చు. రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్‌టీ–పీఆర్‌సీ)తో ఈ పరీక్షలు చేస్తారు. ఫలితం నెగటివ్ అని వస్తే.. అందులోని అన్ని నమూనాలు నెగటివ్ అని అర్థం. అంటే కరోనా లక్షణాలు లేనట్లే. ఒకవేళ పాజిటివ్ అని వస్తే.. అన్ని నమూనాలను బయటకు తీసి, మళ్లీ విడివిడిగా పరీక్షిస్తారు. దీనిద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ నమూనాలు పరీక్షించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment