
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాల విస్తరణకు కోసం భారత్ తమకు కీలక మార్కెట్‌గా నిలుస్తోందని టెలికం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ టెలీనిటీ సీఈవో ఇల్హాన్ బెగోరెన్ తెలిపారు. తమ టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని, ఆదాయాల్లో 15–20 శాతం వాటా ఇక్కడి నుంచే ఉంటోందని పేర్కొన్నారు.
దేశీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి రెట్టింపు స్థాయిలో 100–120కి పెంచుకోనున్నట్లు బెగోరెన్ చెప్పారు. సేల్స్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లాంటి టెలికం దిగ్గజాలకు సేవలందిస్తన్న టెలీనిటీ.. భారత్‌లో కార్యకలాపాల ప్రారంభించి ఇరవై ఏళ్లయిన సందర్భంగా బెగోరెన్ ఈ విషయాలు వివరించారు.