
భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.
▸1925: రూ. 18.75
▸1935: రూ. 30.81
▸1945: రూ. 62.00
▸1955: రూ. 79.00
▸1965: రూ. 72.00
▸1975: రూ. 540.00
▸1985: రూ. 2130.00
▸1995: రూ. 4680.00
▸2005: రూ. 7000.00
▸2015: రూ. 26845.00
▸2016: రూ. 29560.00
▸2017: రూ. 29920.00
▸2018: రూ. 31730.00
▸2019: రూ. 36080.00
▸2020: రూ. 48480.00
▸2021: రూ. 50000.00
▸2022: రూ. 53000.00
▸2023: రూ. 60000.00
▸2024: రూ. 80000.00
▸2025: రూ. 97970.00
1925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.
ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?