
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్‌లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.
సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్‌లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్‌తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
Siddharth Mallya gets married in London.
Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024