
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యజమానిగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కావ్య మారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్‌తోపాటు ఆమెకు కార్లంటే మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీని ప్రీమియం కార్లతో నింపేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తన వద్ద ఉన్న హై-ఎండ్ కార్ల వివరాలు కింద తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీ

దీని ధర భారతదేశంలో సుమారు రూ.12.2 కోట్లు.
బెంట్లీ బెంటాయ్‌గా ఈడబ్ల్యూబీ
ఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎస్‌యూవీ ఇది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్‌తో వస్తుంది.
బీఎమ్‌డబ్ల్యూ ఐ7
ఆమె వద్ద బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్‌తో కూడిన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 కారు ఉంది. దీని ధర రూ.2.5 కోట్లుగా ఉంది.
ఫెరారీ రోమా

ఇటాలియన్ ఫెరారీ గ్రాండ్ టూరింగ్ కారు ధర సుమారు రూ.3.76 కోట్లు.
కావ్య మారన్ 1999 నవంబర్ 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. ఎస్ఆర్‌హెచ్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సహా సన్ గ్రూప్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నిర్వహణలో కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదీ చదవండి: ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
ఆమె సారథ్యంలో 2016లో ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2023, 2024లో ఎస్ఏ20 లీగ్ టైటిల్ గెలుచుకుంది. 2024లో దేవి అవార్డ్స్‌లో ‘ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్’ అవార్డు అందుకున్నారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) ఉంటుందని అంచనా.