
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని సన్‌టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్‌బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్‌టాఫ్ సోలార్ ఇన్‌స్టలేషన్‌లో 2025 మార్చి నాటికి భారత్‌లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్‌బాబు తెలిపారు.