
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు భాగం అయ్యారు వంటి అంశాల గురించి పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా తనపని తాను చేసుకుంటూ రాజమౌళి వెళ్లిపోతున్నాడు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జక్కన్న కేర్ తీసుకుంటున్నారు.
రాజమౌళి సినిమాలకు రెగ్యులర్‌గా పనిచేసే టీమ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కీరవాణి మాత్రం ఆయన సినిమాలకు తప్పకుండా ఉంటారు. కెమెరామెన్, ఫైట్ మాస్టర్స్, డైలాగ్ రైటర్ వంటి వారిని జక్కన్న మారుస్తూ ఉంటారు. ఇప్పుడు SSMB29 సినిమా డైలాగ్ రైటర్‌గా దర్శకుడు దేవా కట్టా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డైలాగ్ పార్ట్ మొత్తం ఆయన పూర్తి చేశారట. పవర్ ఫుల్ డైలాగులను ఆయన అందించారట.

ఆయన దర్శకుడిగా ఆటోనగర్ సూర్య , ప్రస్థానం, రిపబ్లిక్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఆయనకు లిటరేచర్‌లో మంచి ప్రావీణ్యం ఉండటంతో జక్కన్న ఈ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. బాహుబలి కోసం డైలాగ్ రైటర్స్‌గా విజయ్ కుమార్, అజయ్ కుమార్ అనే ఇద్దరు యువకులతో పాటు దేవా కట్టా కూడా ఓ చేయి అందించారు. అయితే, ఆ తర్వాతి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ కోసం బుర్రా సాయి మాధవ్‌ను తీసుకున్నారు.