
రైల్వే టికెట్లను.. రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేస్తే ఆన్‌లైన్‌లో IRCTC వెబ్‌సైట్ ద్వారా లేదా 139కి కాల్ చేసి రద్దు చేసుకోవచ్చు. అయితే టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత రీఫండ్ కోసం రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కొత్త చొరవ వల్ల ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి ప్రత్యేకించి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది లక్షలాది మంది రైలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని అన్నారు.
ఈ-టిక్కెట్లకు బదులుగా కౌంటర్ల నుంచి వెయిటింగ్ టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు రైలు బయలుదేరే ముందు స్టేషన్‌కు వెళ్లి టిక్కెట్లను రద్దు చేసుకోవాలా?.. అని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి: మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!
గతంలో ప్రయాణికులు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి, డబ్బు వాపసు తీసుకోవడానికి రైల్వే కౌంటర్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీనికోసం ప్రయాణికులు సమయాన్ని వృధా చేయాల్సి వచ్చేది. కొత్త ఆన్‌లైన్ టిక్కెట్ రద్దు వ్యవస్థ భారతీయ రైల్వే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియను చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.