
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2025లో విడుదలై వినియోగదారుల ఆదరణ పొందుతున్న కొన్ని ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను కింద తెలుసుకుందాం.
2025 ఏప్రిల్ విడుదలైన కొన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లు
షియోమీ 15 అల్ట్రా: 6.73 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: 6.90 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.
ఐక్యూ జెడ్10: 7300 ఎంఏహెచ్ బ్యాటరీ.
రియల్‌మీ 14 సిరీస్: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, 120 ఎఫ్‌పీఎస్ గేమింగ్ సపోర్ట్.
ఒప్పో కే13 5జీ: 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో: డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్: డ్యూయల్ రియర్ కెమెరాలతో స్లిమ్మెస్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది.
మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్: ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్.
నథింగ్ ఫోన్ (3ఏ): మంచి కెమెరా ఎక్స్‌పీరియన్స్‌తో లాంచ్ చేశారు.
వివో ఎక్స్ 200 అల్ట్రా: ఏప్రిల్ 29, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్.
నోట్: వీటితోపాటు గతంలో విడుదలై మరింత ప్రజాదరణ పొందిన మెరుగైన ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..