టెలికం సర్వీస్‌ లైసెన్సింగ్‌లో సమూల మార్పులు | TRAI proposes new licensing framework | Sakshi
Sakshi News home page

టెలికం సర్వీస్‌ లైసెన్సింగ్‌లో సమూల మార్పులు

Published Sat, Sep 21 2024 12:40 PM | Last Updated on Sat, Sep 21 2024 12:40 PM

TRAI proposes new licensing framework

న్యూఢిల్లీ: ప్రస్తుత టెలికం సర్వీస్‌ లైసెన్సింగ్‌ విధానంలో సమూలంగా మార్పులు తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రదానంగా మూడు రకాల అనుమతులను సిఫార్సు చేసింది. మెయిన్‌ సర్వీస్‌ ఆథరైజేషన్, అనుబంధ సర్వీసుల ఆథరైజేషన్, క్యాప్టివ్‌ సర్వీస్‌ ఆథరైజేషన్‌ వీటిలో ఉన్నాయి.

వివిధ సేవలు, సర్వీస్‌ ఏరియాలవ్యాప్తంగా ’వన్‌ నేషన్‌ – వన్‌ ఆథరైజేషన్‌’  లక్ష్యాన్ని సాధించే దిశగా ’ఏకీకృత సర్వీస్‌ ఆథరైజేషన్‌’ కింద ట్రాయ్‌ ఈ సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం మెయిన్‌ సర్వీస్‌ ఆథరైజేషన్లను నెట్‌వర్క్‌ సర్వీస్‌ ఆపరేటర్‌ (ఎన్‌ఎస్‌వో), వర్చువల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌ (వీఎన్‌వో)గా రెండు విభాగాల కింద ఇస్తారు.

అనుబంధ సర్వీస్‌ ఆథరైజేషన్లను సాధారణంగా పెద్దగా పర్యవేక్షణ అవసరం ఉండని ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకు ఇస్తారు. సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం తీసుకున్న సంస్థలకు క్యాప్టివ్‌ సర్వీస్‌ ఆథరైజేషన్‌ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement