Married Woman Brutally Murdered In YSR Kadapa Vempalli, Details Inside - Sakshi
Sakshi News home page

Crime News: ప్రవీణ్‌తో ప్రేమ వివాహం.. ఇడ్లీ భాషాతో సహజీవనం.. చివరకు దారుణంగా..

Published Fri, Jun 17 2022 8:34 AM | Last Updated on Fri, Jun 17 2022 9:24 AM

Married WOman Brutally Assassinated in Vempalli - Sakshi

షేక్‌ బాష ఉరఫ్‌ ఇడ్లీ బాషతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుండేది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ బాషతో గొడవ జరిగేది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫర్హనాకు కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇడ్లీ బాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు.

వేంపల్లె: వేంపల్లె పట్టణం భరత్‌నగర్‌ వీధికి చెందిన షేక్‌ ఫర్హనా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలి తల్లి షహారున్నీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఫర్హనా 11ఏళ్ల క్రితం పట్టణ పరిధిలోని రాజీవ్‌ నగర్‌కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి లతీఫ్‌ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.

అనంతరం జావీద్‌ ఉరఫ్‌ మహ్మద్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిద్దరికి జహీన్‌ షే అనే కుమారుడు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్త జావీద్‌ జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. భర్త పట్టించుకోకపోవడంతో షేక్‌ బాష ఉరఫ్‌ ఇడ్లీ బాషతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుండేది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ బాషతో గొడవ జరిగేది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు)

ఫర్హనాకు కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇడ్లీ బాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు. గురువారం తెల్లవారుజామున ఇడ్లీ బాష ఫర్హనా గొంతు కోసి అతికిరాతకంగా చంపినట్లు పర్హనా తల్లి షేక్‌ షహారున్నీషా పోలీసులకు వివరించింది. అనంతరం ఫర్హనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, వేంపల్లె సీఐ సీతారామిరెడ్డి, ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ పరిశీలించారు. షేక్‌ బాష ఉరఫ్‌ ఇడ్లీ బాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement